- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. లక్ష రూపాయలు జీతం!
దిశ,కెరీర్: ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు సూపర్ ఛాన్స్. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం ద్వారా ఉచితంగా బీటెక్ చదువుతోపాటు.. నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం. జేఈఈ మెయిన్స్ ర్యాంక్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి ఇంజినీరింగ్ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితంగా లభిస్తాయి.
మొత్తం ఖాళీలు: 35
విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులుండాలి. జేఈఈ మెయిన్-2022లో అర్హత సాధించాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
వయసు: జనవరి 2, 2004 - జులై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2022.
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in
- Tags
- Indian Navy