- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
GATE - 2025 : త్వరలోనే గేట్ 2025 రిజిస్ట్రేషన్.. పరీక్ష ఎప్పుడో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 కోసం ఆగస్టు 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. IIT రూర్కీ GATE 2025 కోసం సమాచార వోచర్‌ను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.inని సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 24 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 26 వరకు కొనసాగుతుంది.
విద్యార్థులు GATE - 2025 కోసం ఆలస్య రుసుముతో అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో, వారు సూచించిన ఫార్మట్‌లో మాత్రమే పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చేసిన దరఖాస్తులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
GATE - 2025 పరీక్ష తేదీ..
విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం GATE - 2025 పరీక్ష 1, 2, 15, 16 తేదీల్లో ఫిబ్రవరి 2025 న నిర్వహించనున్నట్టు సమాచారం. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిప్టులో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుందని సమాచారం. రెండో షిప్టులో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారని సమాచారం.
GATE - 2025 రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ?
gate2025.iitr.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.
హోమ్ పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోండి.
సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయాలి.
ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసి సబ్మిట్ చేయండి.
GATE - 2025 అడ్మిట్ కార్డ్: అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదల చేయనున్నారు ?
GATE - 2025 అడ్మిట్ కార్డ్ జనవరి 25 నుంచి 31 వరకు జారీ చేయనున్నారు. హాల్ టికెట్ విడుదలైన తర్వాత, నమోదిత అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా పరీక్ష అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు. అడ్మిట్ కార్డ్‌తో పాటు, విద్యార్థులు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్‌ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
GATE - 2025 : పరీక్ష విధానం ఏమిటి ?
మొత్తం 30 పరీక్ష పేపర్లు ఉంటాయి. వీటిలో విద్యార్థులు ఒకటి లేదా రెండు పరీక్ష పేపర్లు ఇవ్వవచ్చు. విద్యార్థి అభ్యర్థులు రెండు పరీక్ష పేపర్లకు హాజరైనప్పటికీ, వారు ఒక దరఖాస్తు ఫారమ్‌ను మాత్రమే నింపాలి. పేపర్ ఇంగ్లీషులో ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు MCQ, సంఖ్యారకంగా ఉంటాయి. పరీక్షా సరళి గురించి మరింత సమాచారం కోసం, అభ్యర్థులు జారీ చేసిన నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.