Central Govt Jobs:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్..దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

by Jakkula Mamatha |   ( Updated:2024-03-24 10:31:02.0  )
Central Govt Jobs:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్..దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
X

దిశ,వెబ్ డెస్క్:కేంద్ర విద్యా శాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి లో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభమైంది.పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీలున్నాయి.పోస్ట్ ను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు గా పేర్కొన్నారు.అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి వివరాల కోసం ఇది చదవండి.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రెండు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్

అప్లై విధానం: ఆన్‌లైన్‌ విధానంలో కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు).. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500 గా నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed