- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ ఫలితాలపై బోర్డు క్లారిటీ.. రిజల్ట్ వచ్చేది అప్పుడే..?
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఈ ఏడాది మొత్తం సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక పరీక్షల అనంతరం గత నెల 24 నుంచి పలు జిల్లాల్లో వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల దృష్టి ఫలితాలపై పడింది. ఎప్పుడెప్పుడు రిజల్ట్ వస్తాయా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెల రెండో వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు, హిందీతో పాటు చిన్న చిన్న సబ్జెక్టుల వాల్యూయేషన్ పూర్తికాగా, ఈ నెల 25తో పూర్తి స్థాయి స్పాట్ ముగియనున్నది. ఓఎంఆర్ స్కానింగ్, రిజల్ట్ ప్రాసెస్‌కు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Advertisement
Next Story