ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..నేటి నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ఎప్పటివరకంటే?

by Disha Web Desk 18 |
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..నేటి నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ఎప్పటివరకంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫస్టియర్‌లో 67శాతం, సెకండియర్‌లో 78శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ‘నేటి నుంచి ఈ నెల 24’ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అన్సర్ షీట్ రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీ కౌంటింగ్‌కు రూ.260 ఫీజును ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు..

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌లో ఫెయిల్ అయినా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు, విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు.

Next Story