- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ హాల్‌లో ఇకపై ఆ పెన్నులు నిషేధం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పరీక్షల కాలం మొదలైంది. ఎప్పుడూ ఆడుతూ.. పాడుతూ కనిపించిన పిల్లలు ఇక మీదట బుక్కులు ముందు వేసుకుని కూర్చుంటారు. తల్లిదండ్రులు ఎంత నిద్ర లేపిన నిద్రమత్తు నుంచి లేవని పిల్లలు వాళ్లంతట వాళ్లే అలారం పెట్టుకుని నిద్రలేచి.. బుద్దిగా చదువుకోవడం చేస్తారు. ఇక పరీక్షల విషయంలో ఎంతో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా పెన్ను విషయంలో ప్రత్యేక కేరింగ్ తీసుకుంటారు. పరీక్ష సమయం ముందు నుంచే ఏ పెన్నుతో రాయాలి అనేది నిర్ణయించుకుంటారు. అయితే ఇకపై కొన్ని పెన్నులు వాడకూడదట. వాటిని నిషేధిస్తున్నారట. ఇంతకి నిషేధించే పెన్నులు ఏవో తెలుసుకుందాం.
పరీక్ష సమయంలో ఎక్కువ మంది వినియోగించే పెన్ను నొక్కుడు పెన్ను. క్లికింగ్ పెన్నులు అంటే స్టూడెంట్స్ ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే పరీక్ష రాసే సమయంలో ఏదైనా ఒత్తిడి కారణంగా ఆన్సర్స్ మర్చిపోతే క్లిక్ పెన్నును నొక్కుతూ ఆలోచించుకుంటారు. అయితే ఇకపై ఆ అవకాశం ఉండదు. క్లిక్ పెన్నులను నిషేధిస్తున్నట్లు బెంగుళూరు సిటీ స్కూల్స్ ఇప్పుడు కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే పరీక్ష హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పిల్లలు ఈ పెన్నులను పరీక్ష హాల్‌కు తీసుకురాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులను నోటిస్‌ను సైతం పంపిచారు.
చాలా మంది విద్యార్థులు సమాధానం తెలియకపోతే పెన్నులను క్లిక్ చేయడం అలవాటు చేసుకుంటున్నారట. దీని వల్ల ఎదుటి వారు డిస్టర్బ్ అవుతారని ఇన్విజిలేటర్లు హెచ్చరిస్తున్నప్పటికీ విద్యార్థులు వినిపించుకోవడం లేదట. అందుకే ఇకపై ఆ పెన్నులను నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ నిర్ణయంతో కొంతమంది విద్యార్థులు అసంతృప్తి చెందుతున్నారు. ఇప్పటి వరకు అలవాటు అయిన పెన్నులు సడెన్‌గా మానేయడం ఎలా అని నిరాశ చెందుతున్నారట. కాగా.. బెంగుళూరు సిటీ స్కూల్ నిర్ణయాన్ని అటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.