‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో :
పదో తరగతి పరీక్షలను మే నెలలోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలలోనే పది పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 5,34,903 మంది విద్యార్థులు 2,530 కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యారు. అయితే కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రస్తుతం భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయాల్సి ఉండగా.. అందుబాటులో ఉన్న స్కూళ్లను గుర్తించడంతో పాటు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓ, ఇన్విజిలేటర్లను నియమించుకునేందుకు డీఈఓలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పరీక్షల కోసం పూర్తి చేసిన ఏర్పాట్లు, చర్యలపై ఈ నెల 9లోపు రిపోర్టును అందజేయాలని డీఈఓలకు విద్యాశాఖ సూచించింది.

Tags: Telangana, SSC, Exams, Lockdown, Corona, postponed

Advertisement

Next Story

Most Viewed