- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎందుకీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు?
మన దేశంలో కొందరు బీజేపీ దాని అనుబంధ సంస్థలు..మోడీ ముస్లీంలపై, క్రిస్టియన్లపై అనుసరిస్తున్న మత విద్వేష చర్యలను కొందరు హర్షిస్తూ ఉండవచ్చు. మరికొందరు బీజేపీ అభిమానులు మోదీజీ వ్యక్తిగతంగా పొగుడుతూ ఉండవచ్చు. అయితే వీరికి కోపం వచ్చినప్పుడు మన దేశంలో పుట్టి,పెరిగిన ముస్లీంలను, క్రైస్తవులను మీ మీ మతస్థులు ఉండే దేశాలకు పోండి అని కొందరు హిందూ నాయకులు, బీజేపీ మంత్రులు, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు అనడం మీడియాలో చాలాసార్లు చూశాం.
అలా అనడం, వారి పార్టీ సమావేశాల్లో ఆవేశంగా ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. కానీ ఇండియా నుండి మన హిందూ పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా ఇతర యూరోపియన్ దేశాలలో, అరబ్ దేశాలలో లక్లల కోట్ల మంది బతుకుతున్నారు. మరి మన వారి సంగతేంటి? వారు కూడా మనలాగే హిందువులను మీ మాతృ దేశానికే పోండి అని వెంటపడి తరిమితే మన హిందూ పౌరుల పరిస్థితి ఏమిటి? కనీసం ఇస్లాం, క్రైస్తవ దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వారికి ఆపద అంటూ వస్తే తలదాచుకునే చోటు చాలా దేశాల్లో ఉంది. మరి మన పరిస్థితి ఏమిటి?
ప్రపంచమంతటా మనమే కానీ...
మన భారతీయులు ప్రపంచమంతటా ఉన్నారు. చాలామంది మన దేశంలో కన్న ఆర్థికంగా బలంగా, స్థిరంగా, క్షేమంగా, అన్ని విధాలా బాగున్నారు. ఆయా దేశాల్లో కీలక రాజకీయ పదవుల్లో ఉన్నత స్థానాల్లే కూడా ఉన్నారు. వ్యాపార రంగంలో దిగ్గజాలుగా ఎదిగారు. మనం వారి ఉన్నత స్థితిని చూసి మనం గర్వంగా ఫీలవుతున్నాం. అలాగే మనదేశ పౌరులు విదేశాలకు పోయి ఏవేవో చిన్నా,చితక పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారు అక్కడ సంపాదించిన సొమ్ముతో మనదేశంలో డాలర్ నిల్వలు పెరుగుతున్నాయి. అలాగే అక్కడ బాగా సంపాదించిన వారు మన దేశంలో పరిశ్రమలను కూడా స్థాపించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఇతర మతాల వారిపై దాడులు జరిగితే ఇతర దేశాలు వారు కూడా ఆగ్రహంతో మనవారిని కూడా మన దేశానికి తిరిగి పంపితే మన వారి పరిస్థితి ఏమిటి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి?
దేశభక్తి మన సొంతమేనా?
ఈ వేధింపులు విదేశాలలో ఉన్న మన అమాయకపు పిల్లలు ఎదుర్కోగలుగుతారా? కేవలం దేశభక్తి మనకే పరిమితమా ఇతర దేశాల వారికి దేశభక్తి ఉండదా? గల్ఫ్ దేశాలలో కోట్లమంది మన భారతీయ పౌరులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ, కొందరు కార్మికులుగా,అమ్మాయిలు నర్సులుగా, అరబ్బుల ఇండ్లలో పనిమనుషులుగా అక్కడ లక్షల సంఖ్యలో పని చేసుకుంటున్నారు. ఆ డబ్బుతో ఇండియాలో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారికి ఈ వేధింపులు మొదలైతే వారిని ఎవరు కాపాడతారు. ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో ప్రపంచమే గ్లోబల్ విలేజ్ గా మారిన పరిస్థితులను అర్ధం చేసుకోకుండా, మనం హిందూ మత పిచ్చితో వ్యవహరిస్తే...ఇతర దేశాల మతస్తులు కూడా అలాగే ప్రతిస్పందిస్తారు. ఇతర మతస్తులను తిట్టడం, వారి మత నమ్మకాలను, విశ్వాసాలను హేళన చేయడం. చంపడం, నరకడం కేవలం మనకు మాత్రమే వచ్చిన విద్య అనుకోకూడదు. 'కీడెంచి, మేలెంచాలి', 'నేల విడిచి సాము చేయరాదు'. 'చర్యకు- ప్రతి చర్య' ఉంటుంది అని గుర్తించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దేశాన్ని విడిచి వెళ్లిపోండి అనే ఆమాంబాపతు సవాళ్లకు ఎంత దూరంగా ఉంటే మనందరికీ మంచిది.
డా. కోలాహలం రామ్ కిషోర్
98493 28496