అమెరికా చరిత్రలో బ్లాక్ డే! ట్విన్ టవర్స్ ఉగ్రదాడి రోజు ఏం జరిగింది

by Ravi |   ( Updated:2022-09-11 02:44:23.0  )
అమెరికా చరిత్రలో బ్లాక్ డే! ట్విన్ టవర్స్ ఉగ్రదాడి రోజు ఏం జరిగింది
X

1998లో ఆఫ్రికన్ దౌత్య కార్యాలయంపై బాంబు దాడులు, అదే యేడు బిన్ లాడెన్ జారీ చేసిన ఫత్వా ద్వారా ఒక మలుపును గుర్తించారు. అంటే, అమెరికా సంయుక్త రాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో బిన్ లాడెన్ ఉన్నట్లు అర్థమైంది. విమానాల దారి మళ్లింపు గురించి కొందరికి శిక్షణ ఇస్తున్నారని, యూఎస్ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌కు 'డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధక కేంద్రం' సమాచారం కూడా అందించింది. దీంతో అమెరికా అప్రమత్తం అయ్యింది. అక్కడి ర‌క్షణ శాఖ ఎంతో శ‌క్తివంత‌మైంది, సీఐఏ ఎంతో ముందు చూపు క‌లిగి, చురుకుగా ఉంటుంది. అయినా, ఆల్‌ఖైదా టీమ్ ప‌క్కా ప్రణాళిక‌తో అనుకున్న విధంగా వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పైన దాడులు జ‌ర‌ప‌గ‌లిగింది.

మెరికాలోని న్యూయార్క్‌ వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ మీద దాడి జ‌రిగి నేటికి 21 యేళ్లు గడిచాయి. ఈ సంఘటన ద్వారానే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్ ఉనికి ప్రపంచానికి తెలిసింది. కార్యాన్ని త‌న చేతుల మీద నిర్వహించింది లాడెనే అయినా, దీనికి సూత్రధారి మాత్రం వేరే ఉన్నాడు. 2001 సెప్టెంబ‌రు 11 మంగళవారం ఉదయం 8.45కు వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పైన లాడెన్ టీమ్ జ‌రిపిన దాడులను చ‌రిత్ర అంత త్వరగా మ‌ర‌వ‌లేదు. ఈ ఘటనతో ప్రపంచ దేశాల‌న్నీ ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డాయి.

ఆల్‌ఖైదా ప‌క్కా వ్యూహంతో జ‌రిపిన దాడుల‌వి. ఆ రోజు ఉద‌యం పది మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు వాణిజ్య సేవ‌లందించే నాలుగు అమెరికన్ జెట్ విమానాల‌ను దారి మ‌ళ్లించారు. రెండు విమానాల‌తో న్యూయార్క్‌లోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌‌కు చెందిన జంట సౌధాల‌ను ఢీకొట్టించారు. సౌదీ అరేబియా, ఇత‌ర అర‌బ్ దేశాల‌కు చెందినవారే ఈ ఘ‌ట‌న‌కు పాల్పడ్డారని త‌ర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్‌ఖైదా నాయ‌కుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వ‌హించారు.

ఒక్కరూ మిగలలేదు

వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌ దాడి ఘ‌ట‌న‌లో విమానంలో ఉన్న ప్రయాణికులంద‌రూ, భ‌వ‌నాలలో ప‌ని చేస్తున్న అనేక మంది ఇత‌రులూ దుర్మరణం పాల‌య్యారు. రెండు సౌధాలు అంద‌రూ చూస్తుండ‌గానే కుప్పకూలి పోయాయి. స‌మీపంలోని భ‌వనాలూ ధ్వంసమయ్యాయి. మ‌రికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని ప్రయాణికులు, సిబ్బంది నియంత్రించేందుకు ప్రయత్నం చేయడంతో పెన్సిల్వేనియాలోని షాంక్స్‌ విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో కుప్పకూలింది. విమానాలలో ప్రయాణించిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయట పడలేదని తేలింది.

2001 సెప్టెంబ‌రు 11 దాడులలో 2,763 మంది ప్రయాణికులు, పౌరులు, ప్రభుత్వ సిబ్బంది, 19 మంది హైజాక‌ర్లు మ‌ర‌ణించారు. న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం జూన్ 2019 నాటికి అగ్నిమాప‌క ద‌ళ సిబ్బంది, పోలీసులు స‌హా రక్షణ చ‌ర్యలలో పాల్గొన్న 836 మంది మ‌ర‌ణించారు. రెండు భ‌వ‌నాలలో దుర్మర‌ణం చెందినవారిలో 343 మంది అగ్నిమాప‌క ద‌ళ సిబ్బంది, 23 మంది న్యూయార్క్ పోలీసులు, 37 మంది పోర్ట్ అథారిటీ కి చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. పెంట‌గాన్ భ‌వ‌నంపై జ‌రిగిన దాడిలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 64 మంది, 77 మంది ప్రయాణికులు సహా 189 మంది ప్రాణాలు కోల్పోయారు. పెన్సిల్వేనియాలో కుప్పకూలిన విమానంలోని 44 మంది ప్రాణాలు కోల్పోయారు.

ముందే సమాచారం ఉన్నా

ఈ మూడు ఘటనలలోనూ మ‌ర‌ణించినవారిలో అత్యధికులు సాధార‌ణ పౌరులే. వారిలో 78 మందికి పైగా ఇత‌ర దేశాల‌కు చెందినవారూ ఉన్నారు. సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్‌. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. ఆ సమయంలో బిన్ లాడెన్, అల్‌‌ఖైదా మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి అప్ఘానిస్తాన్‌కు మకాం మార్చు కున్నారు. 1998లో ఆఫ్రికన్ దౌత్య కార్యాలయం పై బాంబు దాడులు, అదే యేడు బిన్ లాడెన్ జారీ చేసిన ఫత్వా ద్వారా ఒక మలుపును గుర్తించారు. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో బిన్ లాడెన్ ఉన్నట్లు అర్థమైంది.

విమానాల దారి మళ్లింపు గురించి కొందరికి శిక్షణ ఇస్తున్నారని, యూఎస్ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌కు 'డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధక కేంద్రం' సమాచారం కూడా అందించింది. దీంతో అమెరికా అప్రమత్తం అయ్యింది. అక్కడి ర‌క్షణ శాఖ ఎంతో శ‌క్తివంత‌మైంది, సీఐఏ ఎంతో ముందు చూపు క‌లిగి, చురుకుగా ఉంటుంది. అయినా, ఆల్‌ఖైదా టీమ్ ప‌క్కా ప్రణాళిక‌తో అనుకున్న విధంగా వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పైన దాడులు జ‌ర‌ప‌గ‌లిగింది.

మరపురాని రోజుగా

ఘటన అనంతరం అమెరికా ప్రభుత్వం దీని మీద విచారణకు ఒక కమిషన్ ను నియమించింది. 2004 జూలై 22న ఈ కమిషన్ తన నివేదికను సమర్పించింది. దాడులకు ప్రధాన సూత్రధారి, వ్యూహకర్త ఖలీద్ షేక్ మహ్మద్‌ అని వెల్లడించింది. ఈ సంఘటనకు బాధ్యుడనని ప్రకటించుకున్న బిల్ లాడెన్‌ను 2 మే 2011న యూఎస్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో గుర్తించి హతమార్చాయి.

సెప్టెంబర్ 11 బాధిత కుటుంబాలకు 2001 నుండి 2004 వరకు ఏడు బిలియన్ డాలర్‌ల పరిహారం అందజేశారు. 2001 డిసెంబర్ 18న అమెరికన్ కాంగ్రెస్ సెప్టెంబర్ 11వ తేదీని ఆనాటి మృతుల జ్ఞాపకార్థం 'దేశ భక్తుల దినం'గా ఆమోదించింది. 2009లో అమెరికన్ కాంగ్రెస్ దీనిని 'సేవా, జ్ఞాపక దినం'గా ప్రకటించింది.

రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

Advertisement

Next Story