స్వరాష్ట్రమొస్తే ఏ కల తీరింది!?

by Ravi |   ( Updated:2022-10-30 11:03:26.0  )
స్వరాష్ట్రమొస్తే ఏ కల తీరింది!?
X

స్వరాష్ట్రమైతే వచ్చింది కానీ, స్వతంత్రం మాత్రం లేదనిపిస్తోంది. ప్రశ్నించిన పాపానికి ఇద్దరు న్యాయవాద దంపతులను నడిరోడ్డుపైనే నరికి చంపిన దుస్సంఘటన మన రాష్ట్రంలోనే జరిగింది. ఈ హత్యకు బాధ్యుడిగా ఒక టీఆర్ఎస్ నేతపై ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారా వాస్తవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకు వస్తున్న ఎందరో ఉద్యమకారులను జైలులో పెట్టిన ప్రభుత్వం మనది. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రగతిభవన్‌లో బందీ అయ్యింది. టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీ ఏ ఒక్కటి కూడా అమలులోకి రాలేదు. కేజీ టు పీజీ విద్య ఏమైంది? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టిండ్రు? ఇంటికో ఉద్యోగం ఎటు పోయింది? ఉచిత యూరియా ఎక్కడ ఇస్తున్నారు? నిరుద్యోగ భృతి రూ.3,016 ముగ్గురి కన్నా ఇచ్చిండ్రా? హాస్టల్ విద్యార్థులకు సన్న బువ్వ పెడతామన్న హామీ ఏమైంది?

పెనం నుంచి నిప్పులలో పడినట్టుగా' ఉంది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో సరైన ప్రాతినిధ్యం లేదని, ఆత్మగౌరవం లేని చోట అభివృద్ధి ఎంత జరిగినా అది నిరర్థకమేనని తెలంగాణ ప్రజానీకం భావించారు. అందుకే ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ ఆనందం ఆరేండ్లు కూడా లేకుండా పోయింది. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురుతుందని ఆశిస్తే అంతా ఒక కుటుంబానికి పరిమితమైపోయింది. రాష్ట్రం భౌగోళికంగా వేరుపడిందే తప్ప అణచివేత, దోపిడీ, అవమానాలు, అపహాస్యాలు అలానే మిగిలి ఉన్నాయి.

అవినీతి అప్పటికంటే పదింతలు పెరిగింది. ఆనాడు తెలంగాణ ఆదాయాన్ని వలసవాదులు, బడా కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నారు. ఇప్పుడు వారికి మరో కుటుంబం తోడైంది. దోపిడీ, అక్రమార్జన ఆగనే లేదు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి శిక్షించే దుష్ట సంస్కృతి తెరపైకి వచ్చింది. 'నాదే రాజ్యం, అంతా నా ఇష్టం' అన్న చందంగా పాలన సాగుతోంది. వందలాది మంది దళితులు, బహుజనులు ప్రాణత్యాగంతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు వారి మనుగడే ప్రశ్నార్థకమైంది. తెలంగాణ వస్తే స్వరాష్ట్రంలో స్వతంత్రంగా జీవించవచ్చని భావించిన వారికి నిరాశే మిగిలింది.

వీటికి జవాబు చెబుతారా?

స్వరాష్ట్రమైతే వచ్చింది కానీ, స్వతంత్రం మాత్రం లేదనిపిస్తోంది. ప్రశ్నించిన పాపానికి ఇద్దరు న్యాయవాద దంపతులను నడిరోడ్డుపైనే నరికి చంపిన దుస్సంఘటన మన రాష్ట్రంలోనే జరిగింది. ఈ హత్యకు బాధ్యుడిగా ఒక టీఆర్ఎస్ నేతపై ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారా వాస్తవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకు వస్తున్న ఎందరో ఉద్యమకారులను జైలులో పెట్టిన ప్రభుత్వం మనది. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రగతిభవన్‌లో బందీ అయ్యింది. టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీ ఏ ఒక్కటి కూడా అమలులోకి రాలేదు. కేజీ టు పీజీ విద్య ఏమైంది? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టిండ్రు?

ఇంటికో ఉద్యోగం ఎటు పోయింది? ఉచిత యూరియా ఎక్కడ ఇస్తున్నారు? నిరుద్యోగ భృతి రూ.3,016 ముగ్గురి కన్నా ఇచ్చిండ్రా? హాస్టల్ విద్యార్థులకు సన్న బువ్వ పెడతామన్న హామీ ఏమైంది? ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్న హామీ గంగలో కలిసింది. ధరణి పేరుతో ఓ దరిద్రపు పథకాన్ని తీసుకొని వచ్చి పేదల భూములను పెద్దలకు ధారా‌దత్తం చేసే కార్యక్రమం యథేచ్చగా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి పేరుతో పథకాలను ప్రవేశపెట్టి ఒక్కటి కూడా అమలులో పెట్టని ప్రభుత్వం ఇది.

Also read: మునుగోడులో కౌరవ పతనం ఖాయమేనా?

అక్కడి అభివృద్ధే చాలా?

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి బాట పడితే చాలా? తెలంగాణ అంతా తెరలైపోయినా పట్టించుకోరా? తెలంగాణ ప్రజానీకం కట్టిన పన్నులే ఖజానాను నింపుతున్నాయి. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని సమదృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రి పక్షపాతం చూపడం ఎంతవరకు సమంజసం? తమ నియోజకవర్గాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని గళమెత్తాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో కలిశారు.

గళం ఎత్తి, అక్రమాలను ప్రశ్నించి, వివక్షతను ఎత్తిచూపుతూ పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారా? ఆగ్రహించారా? ఇప్పుడు ఆలోచించాల్సింది ఇదే. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోవాలనుకుంటే, కేసీఆర్ ఆశ చూపించినప్పుడే టీఆర్ఎస్‌లో చేరి హోం మంత్రి అయ్యేవారు. రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ ఆయన కంపెనీకి ఇప్పించుకునేవారు. లక్షల కోట్ల కాంట్రాక్టులు ఆయనకే దక్కేవి. కానీ, ఆయన ఇతర ఎమ్మెల్యేల మాదిరి నీతి నియమం లేకుండా ప్రవర్తించలేదు. కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన పదవిని త్యాగం చేసి ప్రజల ముందు అగ్నిపరీక్షకు నిలబడ్డారు.

Also read: మరోకోణం: మునుగోడులో ఏం జరగబోతుంది? దిశ ఎడిటర్ గ్రౌండ్ రిపోర్ట్

అలా అయితేనే నిధులు

ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని దుబ్బాక, హుజురాబాద్, ఎన్నికల ద్వారా స్పష్టం అయ్యింది. తన నియోజకవర్గం కూడా అభివృద్ధి కావాలంటే రాజీనామా ఒక్కటే మార్గమని ఆయన భావించారు. కాంగ్రెస్ పోరాట పటిమను పూర్తిగా కోల్పోయింది. మళ్లీ ఆ పార్టీ ద్వారానే టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం 'కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే' అవుతుందని భావించి బీజేపీలో చేరారు. రాజీనామా ప్రకటన వెలుపడంతోనే ప్రభుత్వంలో కదలిక మొదలైంది. గట్టుప్పల్ మండల కేంద్రమైంది. గొర్రెలకు బదులు లబ్ధిదారులకు 96 కోట్ల రూపాయల నగదు ఖాతాలలో జమ అయింది. రహదారుల కోసం కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. ఆగిపోయిన 30 పడకల ఆసుపత్రిని అగమేఘాల మీద పూర్తి చేశారు.పెండింగు ఫైళ్ల దుమ్ము దులిపారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ప్రారంభమైంది. గిరిజనబంధు మొదలైంది.

ఓటు అవసరం ఏర్పడితే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదన్న నగ్న సత్యం రుజువు అవుతున్నది. ఫామ్‌హౌస్‌ను, ప్రగతిభవన్‌ను వీడని ముఖ్యమంత్రి స్వయంగా ఒక గ్రామ బాధ్యుడిగా పని చేస్తున్నారు. మంత్రివర్గమంతా మునుగోడులోనే మకాం వేసింది. శాసనసభ్యులందరూ ఇక్కడే ఉంటూ రోజూ ప్రజలకు దర్శనమిస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే ఇంత పెద్ద ఎత్తున యంత్రాంగమంతా మునుగోడుకు రావలసిన అవసరం ఏమున్నది? ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదు కాబట్టే తిరుగుబాటు మొదలైంది. దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలే మునుగోడులోనూ ప్రస్ఫుటించే అవకాశాలున్నాయి.

కప్పర వరప్రసాద్

ప్రెసిడెంట్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్

96767 76622

Advertisement

Next Story