- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదీ సంగతి: వారే దేశానికి ఆర్థిక సహాయం చేసేలా పరిస్థితి ఉందా?
నోట్ల రద్దు తర్వాత ముద్రించిన 2000 రూపాయల నోట్లు అయితే ఆరు నెలలుగా కనిపించడం లేదు. బ్లాక్ మనీ వెలికితీసి ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న పీఎం నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ విషయం మీద ఒక్క మాట మాట్లాడడం లేదు. లక్షల నకిలీ నోట్లు వస్తున్నాయి పట్టుబడుతున్నాయి. స్విస్ బ్యాంకుల ఖాతాల లెక్కలు చెప్పరు. అందులో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీ కాదు కదా? అని కొత్తగా సెలవిస్తున్నారు. దేశం ఆర్థిక ఇబ్బందులలో ఉంది. రిజర్వు ఎకానమీ తగ్గుతున్నది. అప్పుల మీద అప్పులు, వడ్డీలతో ఇప్పుడు దేశం ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది. ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో లక్షల కోట్లకు అధిపతులైన అదానీ, అంబానీ లాంటి వారే రేపు దేశానికి ఆర్థిక సహాయం చేయగలిగే సమాంతర శక్తిగా తయారవుతున్నారు. ఇప్పటికే పాలన వ్యవహారంలోనూ వీరి ప్రభ మెరిసిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగాన్ని మొత్తముగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ కబంధ హస్తాలలోకి నెడుతున్నారు.
జాతీయ ఎకనామీతో సమానంగా, సమాంతర ఎకనామీ దేశం నడ్డి విరుస్తోంది. ఇందులో అనుమానపడాల్సిందేమీ లేదు. 2014లో సుప్రీంకోర్టు సూచన మేరకు బ్లాక్ మనీని వెలికి తీసేందుకు, విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసారు. ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటినా సిట్ నివేదిక ఇచ్చిందా? ఇస్తే ఏమిచ్చింది? తెలియదు. స్విస్ బ్యాంకులో మాత్రం దేశానికీ చెందినవారి డిపాజిట్లు పెరిగాయని అంటున్నారు. డిపాజిట్‌లలో దాదాపు పది వేల కోట్ల పెరుగుదల ఉందని అంటున్నారు. వీటి మీద నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇంకా చడీ చప్పుడు లేదు. నోట్ల రద్దు తర్వాత కొత్తగా 13 లక్షల కోట్ల కొత్త నోట్లను ప్రింట్ చేశామని ఆర్‌బీఐ వెల్లడించింది. ఇందులో 9 లక్షల కోట్ల 500 నోట్లు, 2000 నోట్లు కనిపిస్తలేవట. అంటే బ్లాక్ చేయబడ్డాయన్నమాట.
2022 జూలై-సెప్టెంబర్ మధ్యన దేశంలో 191 టన్నుల బంగారం కొనుగోలు జరిగింది. 2021లో ఏక కాలంలో 188 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. మొత్తంగా దీని విలువ 2022 లో రూ.85,000 కోట్లు కాగా, 2021లో దాదాపు రూ. 71,000 కోట్లుగా ఉంది. గోల్డ్ రీ సైకిలింగ్ 2021లో దాదాపు 20 టన్నులు ఉంటే, 2022 లో 16 టన్నులకు తగ్గింది. డ్రగ్స్ మాఫియా విస్తరించి వారి వ్యాపారం వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. నేపాల్ కేంద్రంగా నకిలీ నోట్లు పాకిస్తాన్, దుబాయ్, మలేసియా నుంచి ప్రింట్ అయి మన దేశంలోకి వస్తున్నాయి. ఈ అన్ని వ్యవహారాలకు దేశంలోని పోర్టులు, విమానదారులు అడ్డాలుగా మారాయి. నిందితులు చిక్కడం లేదు. నకిలీ కరెన్సీ చలామణి మాత్రం పెరిగింది. వీటితో కొందరు రాజకీయ నేతలకు, పార్టీలకు, పెద్ద పెద్ద వ్యాపారులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ వేల కోట్లు ఎక్కడివి?
పొలిటికల్ ఫండింగ్ పెరిగింది. ఎన్నికలలో విచ్చలవిడిగా కరెన్సీ చలామణి అవుతున్నది. గత 70 సంవత్సరాలలో ఆర్‌బీఐ ముద్రించిన నోట్లలో 72 శాతం గడచిన ఐదేండ్లలోనే ముద్రించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2016లో 16 లక్షల కోట్లు ముద్రిస్తే, 2022 మార్చ్‌లో 31 లక్షల కోట్లు ముద్రించారు. 30 శాతం టాక్స్‌తో 10 లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ ఇతర దేశాలతో పోల్చితే ఎక్కువే ఉంది. దేశంలో ఆదాయం తగ్గింది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ధరల మీద అదుపు లేదు. అసమానతలు పెరిగిపోయి దేశం అతలాకుతలంగా మారింది. నిరుద్యోగ సమస్య మరింత జఠిలమైపోయింది. దేశంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ల ఆదాయం, ఆస్తులు పెరుగుతున్నాయి. దేశం గాడిలో పడే పరిస్థితి లేదు. అధికారం శాశ్వతం చేసుకునేందుకు బీజేపీ ఏం చేయడానికైనా సిద్ధమైపోతోంది.
135 లక్షల కోట్ల అప్పులలో ఉన్న దేశంలో రిజర్వులు కూడా భారీగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి ఎన్నికల నిధులుగా వేల కోట్లు ఎలా వస్తున్నాయో అంతు చిక్కడము లేదు. దేశంలో సమాంతర ఆర్థిక సామ్రాజ్యం అభివృద్ధి చెందే ప్రమాదం లేకపోలేదు. విపక్షాల ముందు ఈ సవాల్ కూడా ఉంది. ఎనిమిదిన్నరేండ్లలో పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసింది. 80 కోట్ల మంది పేదలు ప్రభుత్వం తాత్కాలికంగా ఇచ్చే ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలే ఆధారంగా జీవించే పరిస్థితికి పాలనను దిగజార్చారు.
Also read: ఇదీ సంగతి: దేశం అన్నింటా వెనుకబాటే
ఆ లెక్కలెందుకు చెప్పడం లేదు?
నోట్ల రద్దు తర్వాత ముద్రించిన 2000 రూపాయల నోట్లు అయితే ఆరు నెలలుగా కనిపించడం లేదు. బ్లాక్ మనీ వెలికితీసి ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న పీఎం నరేంద్ర మోడీ ఇప్పుడు విషయం మీద ఒక్క మాట మాట్లాడడం లేదు. లక్షల నకిలీ నోట్లు వస్తున్నాయి పట్టుబడుతున్నాయి. స్విస్ బ్యాంకుల ఖాతాల లెక్కలు చెప్పరు. అందులో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీ కాదు కదా? అని కొత్తగా సెలవిస్తున్నారు. దేశం ఆర్థిక ఇబ్బందులలో ఉంది. రిజర్వు ఎకానమీ తగ్గుతున్నది. అప్పుల మీద అప్పులు, వడ్డీలతో ఇప్పుడు దేశం ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది. ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో లక్షల కోట్లకు అధిపతులైన అదానీ, అంబానీ లాంటి వారే రేపు దేశానికీ ఆర్థిక సహాయం చేయగలిగే సమాంతర శక్తిగా తయారవుతున్నారు. ఇప్పటికే పాలనా వ్యవహారంలోనూ వీరి ప్రభ మెరిసిపోతున్న పరిస్థితి ఉంది.
ప్రభుత్వ రంగాన్ని మొత్తముగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ కబంధ హస్తాలలోకి నెడుతున్నారు. ఏడాది క్రితమే ఉత్పత్తిని, రవాణాను మొదలుపెట్టిన రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి ప్రధాని మోడీ శుక్రవారం వస్తున్నారు. 'ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి' అని గతంలోనే ఆయన పేర్కొన్న దాఖలాలు ఉన్నాయి. అందుకే కార్మిక సంఘాలు, కార్మికులు, రాజకీయ పార్టీలు ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. నిరసనలకు సిద్ధం అవుతున్నాయి. బొగ్గు బ్లాకులను వేలంలో కాకుండా గతంలో మాదిరిగానే సింగరేణికి కేటాయించాలని, కార్మిక చట్టాలు మార్చడాన్ని ఉపసంహరించుకోవాలని, బొగ్గు గని కార్మికుల 11వ వేజ్‌బోర్డు సమస్యలను పరిష్కరించాలని, ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటి మీద పీఎం మోడీ ప్రకటన చేసాకే రామగుండం రావాలని కోరుతున్నారు.
Also read: దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదా?
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223