ఇదీ సంగతి: దేశం అన్నింటా వెనుకబాటే

by Ravi |   ( Updated:2022-10-20 19:00:52.0  )
ఇదీ సంగతి: దేశం అన్నింటా వెనుకబాటే
X

అన్ని రంగాలలోనూ ప్రపంచంలో భారత్ బలహీనపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. వివిధ రంగాలలో ప్రపంచంలో భారత్ నిలబడకుండా, ఆరోగ్యం, రక్షణ, విద్య,ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతి రంగాలలో బలపడకుండా విశ్వగురు అంటే ఎట్లా? ఆర్థిక,సామాజిక సంబంధాలు కూడా ఇందులో ప్రధానం అనేది గుర్తుంచుకోవాలి. కులమతాలకు అతీతంగా జీవిస్తున్న ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను విడదీసి తమ రాజకీయాలను పెంచి పోషించడం కోసం, అధికారం కోసం వెంపర్లాడడం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణంగా పేర్కొనవచ్చు, అధికార, విపక్ష పార్టీల నేతలు విడిపోయి మనుషులను గుడులు, మసీదుల పేరిట విడదీసి పాలన చేసే రాష్ట్రాలు పెరిగాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ సర్కార్ ఉండాలనే పాలసీతో నియంతృత్వ పాలన చేయాలని బీజేపీ భావిస్తున్నది.

విశ్వగురు ఐదు ట్రిలియన్ల ఎకానమీ సంగతి 'సముద్రంలో ఈదినట్లే' ఉండగా, భారతదేశం ప్రస్తుతం అన్ని రంగాలలో బలహీనంగా తయారవుతున్నది. ఎనిమిది సంవత్సరాలలో అసమానతలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం గత 40 యేండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ధరలు చుక్కలనంటుతూనే ఉన్నాయి. తగ్గే అవకాశమే కనబడడం లేదు. ఆకలి ఇండెక్స్ రెడ్ జోన్‌లో కనిపిస్తున్నది. ప్రపంచం లోని 20 దేశాలకు బియ్యం, గోధుమలు ఎగుమతి చేస్తున్న భారత్‌ ఆకలి ఇండెక్స్‌ 107 స్థానంలో ఉండడం ఆందోళనకరం. ఈ లెక్కలు, ర్యాంకులన్నీ ఒక కుట్ర అంటున్నారు కేంద్ర మంత్రులు. నిజానికి భారతదేశాన్ని బద్నామ్ చేయాల్సిన అవసరం, ఈ విషయంలో కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 83.03కు పడిపోయింది. కానీ, 'రూపాయికి ధోకా లేదు, డాలర్ బలపడిందంతే' అని సెలవిచ్చారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

దేశం ఆర్థిక పరిస్థితి చాలా బలహీనపడింది. సామాన్యుడి ఆదాయం పడిపోయింది. కొనుగోలు శక్తి తగ్గింది. ఉత్పత్తి, ఉత్పాదకతలు తగ్గిపోయాయి. కరోనా సమయం ఒక సాకు తప్ప అంతకు ముందు నుంచే ప్రభుత్వ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, ఆచరణలు, విజన్ లేని నీతులతో దేశంలోని అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చితే ర్యాంకులు పడిపోతూ వస్తున్నాయి. సంతోషంలోనూ 117 ఉన్న ర్యాంక్ 140 దాటిపోయింది. మహిళల పరిరక్షణలోనూ, వారికి న్యాయం ఇవ్వడంలోనూ 2017లో 131 స్థానంలో ఉన్న ర్యాంక్ ప్రస్తుతం 135 అయ్యింది. గ్లోబల్ ఎకానమిక్స్ ఇండెక్స్‌లో లేబర్ న్యాయానికి సంబంధించి 2014లో 95వ స్థానం ఉండగా ఇప్పుడు 107 అయ్యింది.

Also read: దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదా?

పడిపోయిన ర్యాంకులు

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రాపర్టీ, అనుబంధాలలోనూ మహిళలకు సంబంధించిన ఇండెక్స్ 2015లో 75వ స్థానం ఉంటే, ఇప్పుడు 112 స్థానానికి చేరింది ఇండియా. స్వేచ్ఛ ఇండెక్స్ 41 నుంచి 70, అవినీతిలో 25 నుంచి 41 ర్యాంకుకు వచ్చాం. ఎడ్యుకేషన్, క్వాలిటీ, బిజినెస్‌లో 76 నుంచి 48 అయ్యింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్‌లో 48 నుంచి 67కు పోయింది. ఇందులో పొల్యూషన్, ఆరోగ్యం సేఫ్టీ తదితరములు ఉంటాయి. ఇంకా చాలా అంశాలకు సంబంధించి బంగ్లాదేశ్, శ్రీలంక కన్నా కూడా భారత్ వెనుకబడి ఉందంటే కేంద్రం ఒప్పుకోవడం లేదు. అంతా గలత్ రిపోర్ట్ అంటారు మన పాలకులు. రిచ్ అండ్ పూర్ లోని 54 దేశాలలో మన దేశం పేదరికం ర్యాంక్ 50 గా ఉంది. ఎకనామిక్ పీస్, సామాజిక, ఆర్థిక విషయానికి సంబంధించి భారత్ ర్యాంక్ 51 దేశాలలో 50 గా ఉంది. ఇలా అన్ని రంగాలలోనూ ప్రపంచంలో భారత్ బలహీనపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. వివిధ రంగాలలో ప్రపంచంలో భారత్ నిలబడకుండా, ఆరోగ్యం, రక్షణ, విద్య,ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతి రంగాలలో బలపడకుండా విశ్వగురు అంటే ఎట్లా? ఆర్థిక,సామాజిక సంబంధాలు కూడా ఇందులో ప్రధానం అనేది గుర్తుంచుకోవాలి. కులమతాలకు అతీతంగా జీవిస్తున్న ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను విడదీసి తమ రాజకీయాలను పెంచి పోషించడం కోసం, అధికారం కోసం వెంపర్లాడడం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణంగా పేర్కొనవచ్చు, అధికార, విపక్ష పార్టీల నేతలు విడిపోయి మనుషులను గుడులు, మసీదుల పేరిట విడదీసి పాలన చేసే రాష్ట్రాలు పెరిగాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ సర్కార్ ఉండాలనే పాలసీతో నియంతృత్వ పాలన చేయాలని బీజేపీ భావిస్తున్నది.

Also read: దేశంలో రాజకీయ ఆరాచకం..

సంతోషమంతా ఆవిరి

దేశంలో మైండ్ గేమ్ రాజకీయం పెరిగింది. నిజానికి దేశ ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. ఇప్పుడున్న దేశ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులలో ఎవరు సంతోషంగా ఉంటారు. అంబానీ, అదానీలాంటి కార్పొరేట్‌ల ఆస్తులు ఈ ఎనిమిదేండ్లలో లక్షల కోట్లు పెరిగాయి. రూ.12 లక్షల కోట్లకు పైగా రుణాలు వారికే మాఫీ అయ్యాయి. రుణభారంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారికి ఎంఎస్‌పీ లేదు. పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా నష్టపోతే పరిహారం లేదు. కార్పొరేట్‌లకు సహకరించే ప్రభుత్వాలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజల కష్టనష్టాలను పట్టించుకునే పరిస్థితులలో లేవు.

ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు నిలబడి పోరాడాల్సిన, ఉద్యమం చేయాల్సిన, ప్రజలకు వెన్నుదన్నుగా ఉండి మార్గదర్శనం చేయాల్సిన, నాయకత్వం వహించాల్సిన కమ్యూనిస్టులు పార్లమెంటరీ పంథా వెంటే తమ అస్తిత్వాన్ని వెతుక్కునే పరిస్థితి వచ్చింది. బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో అధికారం కోల్పోయినా కమ్యూనిస్టులకు బుద్ధి రాలేదు. వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. కార్పొరేటీకరణ చేస్తూ కోట్ల మంది ఉపాధికి ఎసరు పెడుతున్న పరిస్థితిని, పీ‌ఎస్‌యూలను అమ్ముతూ, లీజుకిస్తూ దివాలాకోరు విధానాలను అమలు చేస్తున్న కేంద్రానికి సంబంధించి ఏం చేయాలనే విజన్ వారికి లేకుండా పోవడం ఆందోళనకరమే. కనీసం 2024 లో నైనా మార్పు కోసం విపక్షాలు ఒక్కటై ఇప్పటి నుంచే కృషి చేయాలి.


ఎండీ మునీర్

జర్నలిస్ట్,కాలమిస్ట్

99518 65223

Advertisement

Next Story