- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదా?
మాంద్యం ఎదుర్కొవడానికి ప్రభుత్వం చూపించే కారణాలు పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద శక్తిగా భారత్ ఐదు ట్రిలియన్ డాలర్లకు వెళుతుందని దీంతో ప్రపంచ వృద్ధి గణనీయంగా తగ్గినా దాని ప్రభావం మనపై ఉండదని ప్రభుత్వ వాదన. వీటితో పాటు బ్లూంబెర్గ్ సర్వే, ప్రపంచ ఆర్థిక పర్యవేక్షణ సంస్థ మెకిన్సీ సీఈఓ కూడా భారత్ పై ఈ మాంద్యం ప్రభావం చూపదని పేర్కొనడం మనకు మరోసారి వెలుగులు నింపాయి. ఇప్పటికే ప్రవేశపెట్టిన జీఎస్టీ వలన రికార్డు వృద్ధి దేశంలో కనిపించింది. నిరుద్యోగిత రేటు తగ్గింది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ప్రవేశపెట్టి నగదు ప్రవాహాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. 2008లో దేశాన్ని కాపాడిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగం నేడు బలహీన పడింది. నేడు ఆ రంగానికి మాంద్యాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉందా? అనేది ప్రధాన ప్రశ్న.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా కుప్పకూల్చడంతో ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలను ప్రకటించాయి. దీని నుంచి బయటపడి ఊపిరి తీసుకుంటున్న సమయాన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రెండు పరిణామాల వలన ఆహార ధాన్యాలు, చమురు ధరలు పెరిగి అన్ని దేశాలలో ద్రవ్యోల్బణం విజృంభించింది. దీంతో ప్రజల ఆదాయం పడిపోయి ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించిందని విభిన్న నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం 2022 మొదటి భాగంలో చాలా దేశాలలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని 1980 తర్వాత ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇప్పుడేనని 'ఎకనామిక్ అవుట్ లుక్' నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా తర్వాత పరిస్థితి చక్కబడుతుండడంతో మాంద్యం ముప్పు మరోసారి ముంచుకొచ్చింది. దీని కట్టడి కోసం అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి.
ఆ మార్కెట్‌పై ఆధారపడడంతో
ఈ ఆర్థిక మాంద్యం తీవ్రత పెరిగి 2023 నాటికి అన్ని దేశాలను చుట్టుముట్టనుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు వచ్చే మాంద్యం సామాన్యమైనది కాదని దీని తీవ్రత దీర్ఘకాలం ఉండబోతోందని, ఈ ఏడాది చివరిలోగా అమెరికాలో ప్రారంభమవుతుందని ఆర్థికవేత్త 'రోబోని' హెచ్చరించారు. ఆర్థిక మాంద్యం కంటే ముందు శరవేగంగా పడిపోతున్న ప్రస్తుత వృద్ధి రేటు మున్ముందు ఇలాగే కొనసాగితే ప్రపంచంలోనే అత్యధిక దేశాలు మాంద్యంలో కూరుకుపోయి వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోవడం ఖాయమనే హెచ్చరికలు వస్తున్నాయి. భారత్‌లో మాత్రం ఈ మాంద్యం ప్రభావం పెద్దగా ఉండబోదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనికి కారణం 2008లో భారత్ ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురయ్యింది.
అప్పుడు అది పెద్దగా దేశంలో ప్రభావం చూపకపోగా, దాని నుండి త్వరగా బయటకు రాగలిగాం. ఎందుకంటే భారత్ చైనా, శ్రీలంక దేశాల వలే ఎగుమతులపై ఆధారపడే దేశం కాదు. దేశీయ మార్కెట్ పైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. పైగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వలన భారత్ ఎక్కువ ఆధారపడే చమురు ధరలు తగ్గుతాయి ఇది మనకు అనుకూల ప్రభావం చూపి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని కొందరి వాదన. కానీ, వాస్తవాలు పరిశీలిస్తే ఆనాటి మాంద్యం ఎదుర్కొవడానికి నాడు దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.కానీ నేడు ఆ పరిస్థితి లేదనేది మరికొందరి వాదన.
వాటికి ఆ సామర్థ్యం ఉందా
మాంద్యం ఎదుర్కొవడానికి ప్రభుత్వం చూపించే కారణాలు పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద శక్తిగా భారత్ ఐదు ట్రిలియన్ డాలర్లకు వెళుతుందని దీంతో ప్రపంచ వృద్ధి గణనీయంగా తగ్గినా దాని ప్రభావం మనపై ఉండదని ప్రభుత్వ వాదన. వీటితో పాటు బ్లూంబెర్గ్ సర్వే, ప్రపంచ ఆర్థిక పర్యవేక్షణ సంస్థ మెకిన్సీ సీఈఓ కూడా భారత్ పై ఈ మాంద్యం ప్రభావం చూపదని పేర్కొనడం మనకు మరోసారి వెలుగులు నింపాయి. ఇప్పటికే ప్రవేశపెట్టిన జీఎస్టీ వలన రికార్డు వృద్ధి దేశంలో కనిపించింది. నిరుద్యోగిత రేటు తగ్గింది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ప్రవేశపెట్టి నగదు ప్రవాహాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. 2008లో దేశాన్ని కాపాడిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగం నేడు బలహీన పడింది.
నేడు ఆ రంగానికి మాంద్యాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉందా? అనేది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న గణాంకాలను సంఘటిత రంగానివే కానీ దేశంలో అసంఘటిత రంగం పరిస్థితి నానాటికీ క్షీణిస్తుంది. జీఎస్టీ వలన కొనుగోలు శక్తి క్షీణీంచలేదు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మాంద్యం వేల ప్రజలపై పన్నుల భారం తగ్గించగలుగుతేనే మాంద్యం ప్రభావం నుండి మనం బయటపడినట్టు.దీనికి ప్రభుత్వ వ్యయం పెరగాలి, సరఫరాలు పెంచాలి ,ఉత్పత్తి పెంచాలి ,పేద ప్రజలలో కొనుగోలు శక్తి పెంచాలి.కానీ ఇవేవీ చేయకుండానే ప్రతికూలతలు గుర్తించి కట్టడి చేయకపోతే ఆర్థిక వేత్తలు చెబుతున్నట్టు మన దేశాన్ని మాంద్యం చుట్టుముట్టడం ఖాయం.
రుద్రరాజు శ్రీనివాసరాజు
లెక్చరర్, ఐ.పోలవరం
9441239578.