- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastar Chiranjeevi: ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్
ఏం రాసినా ‘ఓం’ రాసి మొదలెట్టమంటారు పెద్దలు, అలాగే ప్రపంచంలో సినిమా అనేది ఒకటి ఉందని మా జనరేషన్‌కి ఓం రాసి పరిచయం చేసింది మాత్రం ఆయనే. ప్రపంచాన్ని అమ్మ పరిచయం చేసినట్టే, సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది, కొంతమందికి దాన్ని పిచ్చిగా మార్చేసింది మాత్రం ఆయనే..
చిన్నపుడు కాస్త కుప్పిగంతులు ఏసినా, చిన్నపాటి డాన్స్‌లు ఏసినా, ఎవడితో అయినా దెబ్బలాడటానికి వెళ్లినా... అందరూ ఒకే మాట “నువ్వేమైనా పెద్ద చిరంజీవి అనుకుంటున్నావారా?” అని
చిరు.. చెరపలేని జ్ఞాపకం!
ఇంకా సరిగ్గా ఊహ కూడా తెలియని టైంలో, చిన్నప్పుడు ఏదో సినిమాకి వెళ్తే, లోపల హాల్‌లో అయిదు వందల మంది, స్క్రీన్ మీద ఒక్కడు... ఆ ఒక్కడు కనిపించిన ప్రతిసారీ అవే అరుపులు, అవే కేకలు... ఆరోజు అర్థమయింది ఆయన పేరు చిరంజీవి అని, ఆ అరుపులు, కేకలకి కార ణం అభిమానం అని, ఆ 500ల మంది ఆయనకీ ఫాన్స్ అని, ఆ క్షణం నుండి నేనూ అందులో ఒకడిని అని. 150కి పైగా సినిమాల వల్ల ఆయ న ఇచ్చింది కేవలం ఆనందం మాత్రమే కాదు, జ్ఞాపకాలు. అందరికీ అవి కేవలం సినిమాలు మాత్రమే కావచ్చు, నాకు మాత్రం జ్ఞాపకాలు. ఒక్కటీ, రెండు కాదు... మర్చిపోలేనన్ని. లైఫ్‌లో ఫస్ట్ టైం న్యూ ఇయర్‌కి ఎవడు గ్రీటింగ్ కార్డు ఇచ్చాడో గుర్తులేదు కానీ, ఆ కార్డు మాత్రం గుర్తుండిపోయింది... దాని మీద ఉంది ఆయన ఫొటోనే. ఎవరెవరితో ఆడానో గుర్తులేదు కానీ, చిరంజీవి 1000, బాలక్రిష్ణ 750, నాగార్జున 500, వెంకటేష్ 250... అని ఆడిన చీటీల ఆట గుర్తుండిపోయింది... ఆయన పేరు వల్లే.
ఈ అభిమానం ఈజీగా పోదు!
ఇంటర్‌లో హాస్టల్‌లో జాయిన్ అయ్యేవరకి తెలీదు వేరే హీరోస్‌కి కూడా ఫాన్స్ ఉంటారని, వాళ్లతో చేసిన ప్రతి ఫ్యాన్ వార్ గుర్తుంది... ఆయన వల్లే. స్కూల్, కాలేజ్‌లో చదివిన చదువు గుర్తులేదు, కానీ అప్పుడు కొట్టిన బంకులు గుర్తుండిపోయాయ్... ఆయన సినిమా రిలీజ్ డేస్‌ల వల్లే. పెద్దయ్యాక కూడా twinkle twinkle రైమ్ గుర్తుండిపోయింది... twinkle twinkle little star, Chiranjeevi Megastar స్లోగన్ వల్లే. రాజకీయాల్లో రాణించలేదు కదా, ఈ మధ్య ప్లాప్స్ పడ్డాయ్ కదా ఇంకా ఉందా? ఆ అభి మానం అంటే... తెల్లవారకముందే, ఊపిరి కూ డా ఆడని లైన్‌లో నిలబడి, చిరిగిన చొక్కాలతో, లాఠీ దెబ్బలు తిని, సంపాదించిన టికెట్‌తో చూస్తే వచ్చిన అభిమానం అది, అంత ఈజీగా పోదు.
అన్నింటికీ ఒకే ఒక్కడు
ఈ జనరేషన్ పిల్లలకు చిరంజీవి మానియా అంటే తెలియకపోవచ్చు, వాళ్లని ఇప్పుడు No1 హీరో ఎవరంటే ఒకరి పేరు చెప్తారు, యాక్టింగ్‌లో బెస్ట్ ఎవరంటే ఒకరి పేరు చెప్తారు, ఫైట్స్‌లో బెస్ట్ ఎవరంటే ఒకరి పేరు చెప్తారు, డాన్స్‌లో బెస్ట్ ఎవరంటే ఒకరి పేరు చెప్తారు... కానీ ఒకప్పుడు వీటిలో ఏది అడిగినా ఒక్కడి పేరే చెప్పారు. ఇప్పుడు ఒక్కోదానికి ఒక్కొక్కరు ఉన్నారు, అప్పుడు అన్నిటికి ఒక్కడే ఉండేవాడు.
మధ్యతరగతి ఆశల ప్రతిరూపం..
పాతికేళ్లు వేరే హీరోస్‌కి నంబర్ వన్ పొజిషన్ అనే ఆలోచన కూడా రాకుండా చేసిన హీరో. ఒక పదేళ్లు ఆ సీట్ నుండి పక్కకి జరిగితే ఇప్పటికీ ఎవరూ అందులో సరిగ్గా కూర్చోలేకపోయిన రేంజ్ హీరో, పాటలని బ్రేక్స్ కింద వాడుకునే జనాల్ని కేవలం పాటల కోసమే థియేటర్స్‌కి రప్పించిన హీరో. చిన్నప్పుడు నాన్న తర్వాత ఇంకో హీరో అంటే చిరంజీవే, For 90’s kids chiranjeevi is not just a hero, he is an emotion. గట్టిగా అనుకుంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంత దూరం వెళ్లగలరో.. ఎంత ఎత్తుకు ఎదగగలరో చూపించిన, నేర్పించిన మీకు Thank you for all the memories & inspiration... love you always and Happy Birthday Megastar.
(నేడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం)
శ్రీనివాస్ బత్తిని
అసోసియేట్ డైరెక్టర్
90005 87077