- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ మార్పునకు ఓ కారణం
స్వరాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత పాత్ర మరువలేనిది. మన ఉద్యోగాలు మనకే వస్తాయని అప్పటి ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ విద్యార్థులు, యువతలో భారీగా ఆశలు రేకెత్తించారు. ప్రత్యేక రాష్ట్రం అనంతరం కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగార్ధులు అనేక రూపాల్లో అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా సమయానికి ఉద్యోగ ప్రకటనలు రాకపోవడం ఒకటైతే ...నియామకాల్లో టీఎస్పీఎస్సీ వైఫల్యం ప్రధాన కారణంగా నిలిచింది. తరచు కోర్టు కేసులతో నియామకాలు ఆగిపోవడం, పరీక్ష పేపర్లు లీకేజీ కావడం, పరీక్షల వాయిదా వంటివి యువతను విస్మయానికి గురిచేసింది. పేపర్ల లీకేజీల పై వేసిన సిట్ విచారణలో వందకు పైన నిందితులుగా తేలడం గమనార్హం. అసలు ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. తీవ్ర అసహనానికి గురైన యువత టిఎస్పిఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులు వెంటనే రాజీనామా లేదా బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థులు ఆ బోర్డు నిర్వహించే పరీక్ష రాయబోమని నిరసన సైతం వ్యక్తం చేయడం పలువురిని ఆలోచింపజేసింది. బోర్డుపై ఇంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలకే పరిమితమయింది. దీంతో నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య అంతరాలు పెరిగాయి. ఆ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలు ప్రయత్నించాయి. ఈ నిరుద్యోగులే గ్రామాలకు చేరి ఓటుపై చైతన్యం కలిగించారు. తమకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీలకే ఓటు వేయాలని తల్లిదండ్రులను అభ్యర్థించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 'నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర' కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించదనవచ్చు. మొత్తంగా టీఎస్‌పీఎస్సీ బోర్డు తీరే ప్రభుత్వ మార్పుకు కారణమైనది చెప్పవచ్చు. దీంతో తెలంగాణ రాజకీయ క్షేత్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది పడింది.
బోర్డుపై ఉన్న ఆరోపణ నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను నిరుద్యోగులు, మేధావి వర్గాలు ఆహ్వానించాయి. ఇప్పటికైనా నూతన బోర్డును జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ఇంతవరకు ఉద్యోగ నియామక ప్రక్రియ సజావుగా సాగపోవడంతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. సంవత్సరం క్రితమే బోర్డు చైర్మన్, సభ్యులు రాజీనామా చేసి ఉంటే ప్రవళిక లాంటి నిరుద్యోగుల ప్రాణాలు పోయేవి కావేమో. పలు అనుమానాలతో కొనసాగుతున్న సిట్ దర్యాప్తును పూర్తిస్థాయిలో సమీక్షించాలి. నిందితులను పట్టుకొవాలి. బోర్డులో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి. ఇప్పుడు నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం గంపడాశతో ఎదురుచూస్తున్నారు. కావున నీతి నిజాయితీ గల వ్యక్తులను, రాజకీయాలకు అతీతంగా టీఎస్పీఎస్సీ బోర్డులో తీసుకోవాలి. ప్రతిభావంతులను ఎంపిక చేసే బోర్డులో ప్రతిభావంతులనే నియమించాలి. అప్పుడే పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరిగి, నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.
సంపతి రమేష్ మహారాజ్,
79895 79428