- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ సవాళ్లకు మీ'రేవంతు'
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నప్పటికీ రేవంత్ రెడ్డి పాత్రను ఎవరం కాదనలేం. నిజానికి కాంగ్రెస్ పార్టీ మొదట్లో అసలు రేసులోనే లేదు. కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేస్తే బీఆర్ఎస్‌కు వెళ్లిపోతారన్న అనుమానం ప్రజల్లో ఉంది. దీనికి కారణం గతంలో నేతల మధ్య ఐక్యత లేకపోవడం ఒక కారణమైతే, రేవంత్ నాయకత్వం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కొంత పుంజుకుందనే చెప్పాలి. కాంగ్రెస్‌లోకి వచ్చి త్వరగానే రాజకీయ పరిణితిని సాధించారు. తొలి నుంచి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ అయితేనే పార్టీని అధికారంలోకి తేగలరన్న నమ్మకం హైకమాండ్‌కు కూడా కలిగింది.
నమ్మకాన్ని నిలబెట్టిన రేవంత్
ఆ నమ్మకాన్ని రేవంత్ కూడా వమ్ము చేయలేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఆయన అందరినీ కలుపుకుని పోయాడు. చివరకు తనను వ్యక్తిగతంగా వ్యతిరేకించి బీజేపీలో చేరి, మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఆయన అడ్డు చెప్పలేదు. అలా ఆయన అందరినీ కలుపుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇది గెలుపునకు ఒక కారణంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అంత సులువుగా సాగలేదు. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా...ఎంపీగా గెలిచి చివరకు కాంగ్రెస్‌ను గెలిపించే స్థాయికి ఎదిగాడంటే.. లీడర్ కానే కాదు... ఆయన ఫైటర్ అని చెప్పాలి. సుదీర్ఘంగా అధికార పార్టీతో పోరాడిన నేత. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ముందు ఉందేమీ పూల బాట కాదు. ఎన్నో అవరోధాలు దాటుకొని, అవమానాలు దిగమింగుకొని.. అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న రేవంత్ రెడ్డికి సమస్యల తోరణం స్వాగతం పలుకుతోంది. ఇంటా బయటా పలు సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను అధిగమించడం రేవంత్‌కు కత్తి మీద సాము కానుంది.
హామీల అమలే ప్రధానం
కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు ఏమిటంటే, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేటప్పుడు ఆర్థిక వివేకాన్ని కొనసాగించడం. ఆరు గ్యారెంటీల అమలు.. ఆర్థిక భారం..కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరు గ్యారెంటీలు గురించి జోరుగా ప్రచారం చేసింది. . ఇలాంటి పరిస్థితుల్లో.. సంక్షేమం, సంపద సృష్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. ముందుకు సాగడం రేవంత్‌కి కత్తి మీద సాము వంటిదే. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిలో దేన్ని నిర్లక్ష్యం చేసినా.. బీఆర్ఎస్‌కు ఎలాంటి ఫలితాలు వచ్చాయో.. కాంగ్రెస్‌కు కూడా అదే పరిస్థితి వస్తుంది అంటున్నారు. వీటి అమలు వల్ల పడే అదనపు భారాన్ని ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించడం.. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం వెనక కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశం.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మ్యాగ్జిమం సీట్లను గెలవడం. ఇందుకోసం మిత్ర పక్షాలను కలుపుకుని పోవాలి. దానికి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారనేది కీలకం కానుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించకపోతే.. ఆయన వ్యతిరేక వర్గం దీన్ని ఒక సాకుగా చూపి.. అసమ్మతి వెలిబుచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ప్రభుత్వ కార్యాచరణ ఇలా..!
రాష్ట ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలి. ఆరు గ్యారంటీల అమలు పరివేక్షణ కోసం ప్రత్యేక కార్పోరేషన్‌ను స్దాపించాలి. పథకాల అమలు లబ్ధిదారుల ఎంపిక అర్హులైన వారికే పథకాలు వర్తింపజేసేలా పారదర్శకతను పాటించడానికి ప్రత్యేక మైన విధి విధానాలను రూపొందించాలి. ప్రతి నియోజకవర్గానికి ఓ ఆధికారిని నియమించి పర్యవేక్షించాలి. జిల్లా కలెక్టర్ స్దాయిలో ప్రతి జిల్లాలో ఓ ఆధికారిని నియమించితే ప్రస్తుత కలెక్టర్‌లు సాధారణ పరిపాలనపై దృష్టి సాగిస్తారు. ఆర్టీసిలో విద్యుత్ వాహనాల వినియోగం పెంచితే ఇందనపై ఖర్చు అదావుతుంది, ప్రభుత్వ రోజూ వారి ఖర్చులను ఆడంబరాలను నియంత్రించాలి ప్రచార ఆర్భాటం తగ్గించాలి. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని అమ్మకుండా అదాయ మార్గంగా మలచుకోవాలి. ఐ.టి రంగంపై నే కాకుండా భారీ పరిశ్రమల స్థాపన దిశగా పెట్టుబడులు ఆకర్షించాలి. అలాగే ఇతర ఉపాధినిచ్చే పరిశ్రమలను ప్రోత్సహించాలి. పరిశ్రమలను విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి మితిమీరిన రాయితీలు ఇవ్వకుండ విధివిధానాలు మార్చాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను విద్యుత్ ఉత్పాదనకు వినియోగించుకోవాలి. పర్యాటక నినిమా రంగాలని ప్రోత్సహిస్తే రాబడి వస్తుంది.. గనులు, అటవీ సంపదపై దృష్టి పెట్టి వాటి ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చు, .
విభజన హామీల అమలు ఆస్తుల పంపకంపై దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని వీడితే కేంద్ర నిధులు, పన్నులవాటాల విడుదలలో జాప్యం నివారిస్తే కొంతవరకు మేలు జరుగుతుంది. పాత, కొత్త మేలు కలయికతో పార్టీని పటిష్ట పరుచుకుంటూ ఇచ్చిన హామీలను అమలు పరచటానికి కృషి చేయాలి. నేతలు రానున్న ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు నామినేటెడ్ పదవులు, సలహాదారుల కొలువులు, కోటరీలు, గ్రూప్ రాజకీయాలను తెరపై తీసుకురాకుండా అధిష్టానం చర్యలు తీసుకోవాలి. కార్యకర్తలు సంయమనంతో మెలగాలి. ప్రతిపక్ష విమర్శలకు సకారాత్మక సమాధానమిచ్చి కాంగ్రెస్‌పై ఉన్న అపప్రధను తుడిచేసి రానున్న పార్లమెంట్, పంచాయితీ, స్దానిక సంస్దల ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే సంస్థాగతంగా మరింత బలోపేతం కాగలదు.
- వాడవల్లి శ్రీధర్
99898 55445
- Tags
- cm revanth