- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులలో ఐక్యత రావాలి..!
రైతులకు రాజకీయ పార్టీలలో పదవులు, ప్రజా ప్రతినిధులుగా అవకాశాలు కల్పిస్తూ రైతుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడంలో రాజకీయ నాయకులు సఫలీకృతమైతున్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతున్నప్పటికీ పదవులు అనుభవించే రైతులు నోరు మెదపకపోగా, వారి పార్టీకి సంబంధించిన రైతులను కూడా అన్యాయంపై జరిగే నిరసనకు దూరం ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలా రైతుల జీవితాలతో రాజకీయ పార్టీలు చెలగాటం ఆడుతున్నాయి. రైతుల సమస్యలు తీర్చే వారే కరువయ్యారు. ప్రస్తుతం వ్యవసాయం చేయడం అంటే జూదం అనేలాగా తయారయ్యింది పరిస్థితి.
సమాజంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న అందరూ రైతులు ఏకమై ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. కొందరు రాజ కీయ నాయకులు రైతులకు పదవులు అంటగడుతూ రైతులను విచ్ఛిన్నం చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టాలు వాటిల్లుతున్నా వాటిని ఎదురించలేని పరిస్థితులలో వారు ఉన్నారు. అలాంటి వాటి నుండి విముక్తి కలిగి రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా మూకుమ్మడిగా అందరు ఏకమై ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు రైతు సంఘాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ సంఘంలోని సభ్యులకు పంట నష్టంలో, పంట అమ్ముకోవడంలో గాని ఇబ్బందులు తలెత్తితే ఆ రైతు సంఘం ముందుండి ఆ రైతు సమస్యను తొలగించాలి. నేడు రైతులు విత్తనాల నుండి మొదలు పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకునేసరికి రైతుకు మిగిలేది నష్టం మాత్రమే అని ప్రస్తుత పరిస్థితులలో అర్థమవుతుంది. దళారీ వ్యవస్థ రాజ్య మేలుతోంది. మార్కెట్లో పంటకు డిమాండ్ ఉన్న దళారీలు అందరూ ఒకటై, రైతు చేతికి వచ్చిన పంటను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దళారీలలో ఉండే ఐక్యత రైతులలో మాత్రం కనబడడం లేదు.
పెస్టిసైడ్స్ మాయజాలం...
మనదేశంలో వ్యవసాయ భూములు మొత్తం పెస్టిసైడ్స్ రసాయనాలకు ఇమిడిపోయాయి. పెస్టిసైడ్స్ మందులు పిచికారి చేయనిదే పంట చేతికి వచ్చే పరిస్థితులు లేవు. పెస్టిసైడ్స్ మందులలో ఏది ప్రభుత్వం ధృవీకరించినది? ఏది నకిలీదో రైతులకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. కొత్త కొత్త కంపెనీలను మార్కెట్లోకి వదిలి అక్రమార్కులు రైతులను మోసాలు చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. రైతులు వాడే ఎరువులు క్రిమిసంహారక మందులు ఎలా పని చేస్తాయి? ఏ కంపెనీ తీసుకోవాలో, ఏ కంపెనీలో ఎంత రేటు ఉంటుందో రైతులకు తెలియడం లేదు. షాప్ యజమానులు చెప్పినది రేటుగా ప్రస్తు తం కొనసాగుతుంది. పంటకి పురుగు ఆశించినప్పుడు అధికారులు రైతులకు ఏ ఫార్ములా గల మందులు వాడాలో తెలుపుతున్నారే తప్ప కంపెనీల పేర్లు చెప్పడం లేదు. మార్కెట్లో ఒకే ఫార్ములా గల పెస్టిసైడ్స్ అనేక కంపెనీలలో లభించడం రైతులకు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటో తెలుసుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. విచ్చలవిడిగా కంపెనీలు పుట్టుకొచ్చి నాణ్యతలేని మందులను విక్రయిస్తూ రైతుల డబ్బులను కొన్ని కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారులు ప్రభుత్వం స్పందించి మార్కెట్లో ఏ ఫార్ములా గల పెస్టిసైడ్స్ మందులు ఒరిజినలో.. వాటిని సరఫరా చేసి నకిలీ పెస్టిసైడ్స్ మందులను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులు టెక్నాలజీ వాడాలి..
రైతులలో చైతన్యవంతం పెరిగి ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగు చేసుకుంటే మంచి ఫలితాలను ఆశించే అవకాశాలు ఉన్నాయి. సీడ్ విత్తనాలను ప్రతి గ్రామంలో సీడ్ కంపెనీ వాళ్లు సరఫరా చేస్తున్నారు. వాటిలో కొన్ని కొన్ని గ్రామాలలో అగ్రిమెంట్‌తో పాటు క్వింటాల్‌కు ఇంత రేటు అని ఎకరానికి ఇంత దిగుబడి వస్తుందని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ద్వారా పంట దిగుబడి రాకపోయినా సీడ్ విత్తనాలలో ప్రాబ్లం ఉన్న రైతు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉంటాయి. కానీ అన్ని గ్రామాలలో ఇలా జరగడం లేదు. ప్రతి గ్రామంలో సీడ్ విత్తనాలు తీసుకునే రైతులు ఆ సరఫరా చేసే కంపెనీల నుండి అగ్రిమెంట్ చేసుకుని తర్వాత పంట సాగు చేస్తే ఆ పంట నష్టపోయిన ఆ పంట కొనుగోలుకు ఇబ్బం దులు తలెత్తకుండా ఉంటాయి. సీడ్ విత్తనాలు సాగు చేసే రైతులు అందరూ ఏకమై ఆ కంపెనీ నుండి అగ్రిమెంట్ పేపర్ రాయించుకున్నాకే సీడ్ పంటను సాగు చేస్తే రైతులకు నష్టం వాటిల్లిన ఆ కంపెనీ నష్టపరిహానాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. దిగుబడి వచ్చాక కొనుగోలులో కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కంపెనీవారే కొనుగోలు చేస్తారు. అగ్రిమెంట్ లేకపోవడంతో రైతులకు పంట దిగుబడి తక్కువ వచ్చిన కొనుగోలులో కూడా బెరుకులు ఉన్నాయని కుంటి సాకులు చెబుతూ కొన్ని కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయి.
వ్యవసాయమే జీవనాధారం..
మన దేశంలో చాలావరకు వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. కానీ వ్యవసాయ రంగంలో చాలావరకు నకిలీ ఎరువులతో పాటు నకిలీ విత్తనాలు నకిలీ పెస్టిసైడ్స్ చలామణి అవు తున్న ప్రభుత్వాలు ఎందుకు అరికట్టలేకపోతున్నా యి. రైతులందరూ ఏకమై సర్టిఫైడ్ చేసిన విత్తనాలతో పాటు పెస్టిసైడ్స్ కూడా వినియోగిస్తే పంటలు రైతుకు ఖర్చు తక్కువతో పాటు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి అన్యాయం జరిగితే ఉద్యోగ సంఘాలు అందరూ ఏకమై ఎలా అయితే పోరాడుతారో అలాగా రైతు లలో కూడా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగిన అందరూ రైతులు ఏకమై ఆ నష్టపరిహారాన్ని ఆ కంపెనీల నుండి గాని ఆ దళారీల నుండి గాని వచ్చే విధంగా చేస్తే గాని వ్యవస్థలో మార్పు రాదు.
సింగిరెడ్డి అశోక్ రెడ్డి
76618 01107