- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింధు నాగరికత కంటే ముందే ఉన్న లిపి గురించి తెలుసా!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అత్యంత వైభవం కలిగిన సింధు నాగరికత చిత్రలిపి బొమ్మలలోని కొన్ని ఇక్కడి బొమ్మలలో కనిపిస్తున్నాయి. సింధు నాగరికతనే కొయతూర్ ప్రజల గోండి నాగరికత అని గోండి సాహిత్యంలో చెప్పబడుతుంది. దీని గురించి నాగ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన డా. మోతిరావన్ కంగాలి 'decipherment of indus script in gondi' అనే పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించారు. ఇది ఈ దేశంలోకి వచ్చిన వలస ఆర్యులు ఏర్పాటు చేసిన నాగరికత కాదు, ఈ దేశ మూలవాసుల నాగరికత అని చెప్పటానికి బలమైన ఆధారం అవుతుంది. పరిశోధనలు జరగాలి.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదివాసీలు నివసించేది గోదావరి పరీవాహక ప్రాంతంలోనే. దట్టమైన అడవులు, కొండలు, జలపాతాలు, వాగులు, ఊట గడ్డెలు వారి ఆవాస కేంద్రాలు. విభిన్న రకాల జంతు సమూహం, జీవరాశి, పక్షులు, క్రూర మృగాలకు నిలయం. ఆసియాలోనే అతి పెద్దది 'సమ్మక్క సారలమ్మ-మేడారం జాతర' 1,100 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మధ్యన ఉండే పెద్ద గుట్ట అటవీ కేంద్రానికి ఇటు తాడ్వాయి, కామారం అటు భూపతిపూర్, వెంకటాపూర్ ఆదివాసీ గ్రామాల సరిహద్దు ప్రాంతంలోని 'గొంతెమ్మ వాగు' జల మొదలయ్యే చోట ఉన్న ఒక గ్రానైట్ రాయి మీద పురాతన చిత్రలిపి ఉంది.
ఈ సమాచారం తెలుసుకున్న బిరసముండా యూత్ పరిశోధన బృందం అక్కడికి చేరుకుంది. 2017 లో మొదటిసారి దీనిని పరిశీలించి వివరాలను 'ఇండీజినస్ నాలెడ్జ్ ఆఫ్ ది కొయాతూర్ ఆఫ్ కామారం' పుస్తకంలో నమోదు చేసింది. రెండోసారి క్షేత్ర పరిశోధన అంశాలను, విశ్లేషణ అంశాలను తెలుపటమే ఈ వ్యాసం ఉద్దేశం.
విస్తుగొలిపే నిజాలు
ఈ పరిశోధన ప్రాంతాన్ని నేటికీ భారత పురావస్తు శాఖ గుర్తించలేదు, గుర్తించడానికి కూడా వీలులేని దట్టమైన అడవిలో ఉండటం ఒక కారణం. మా బృందం దేశవ్యాప్తంగా ఆదివాసీల అస్థిత్వంపై అనేక ప్రత్యక్ష పరిశోధనలు చేసింది. ఇలాంటి లిపి అరుదుగా కనిపించింది. దేశంలో రాక్ పెయింటింగ్స్, సింధు నాగరికత చిత్రలిపి పై పురావస్తు శాఖ దగ్గర సమాచారం ఉంది. కానీ, ఇది మానవ జన్మ పుట్టుక అనంతరం భవిష్యత్ తరాలకు ఆదిమానవుడు అందించిన తొలి అక్షర లిపి.
ఈ చరిత్రను అందించటానికి ఆదిమానవులు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. పదునైన రాళ్లను కత్తి ఆకారంలో తయారు చేసి దానిని ఉపయోగించి చిత్రలిపిని చెక్కారు. 40 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో 101 బొమ్మలను వేశారు. ఇటువంటి స్లాట్ దేశంలో ఎక్కడా కనిపించదు. కేవలం ఒడిశాలోని నీలగిరి అటవీ ప్రాంతంలో మాత్రమే ఉంది. వీటిపై పరిశోధనలు జరిగితే ఇంకా అనేక పురాతన ఆదిమవాసుల మూలాలు బయటికి వస్తాయి.
అత్యంత ప్రాచీన లిపి
మధ్య శిలాయుగంలో రాతి చిత్రాల వయస్సు క్రీ.పూ లక్ష సంవత్సరాలు అయితే, ఇక్కడి చిత్రలిపి ప్రాచీన యుగంలోని చివరిదశ అనగా క్రీ.పూ 1,50,000 సంవత్సరాల నాటి దిగువ ప్రాచీన యుగానికి చెందినదిగా అర్థమవుతోంది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 'డా. వీకే జైన్ రాసిన 'ప్రీ హిస్టరీ అండ్ ప్రొటో హిస్టరీ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో ప్రాచీన యుగంలో పదునైన బండ రాయిని ఉపయోగించి చిత్ర లిపిని సృష్టించారని ఉంది. దాని ఆధారంగా ఇక్కడ పదునైన బండ రాయితో చెక్కిన బొమ్మలను చూడవచ్చు. మహిళలు, పురుషుల పాదాల గుర్తులు ఇక్కడ స్పష్టంగా ఉండటం దానికి నిదర్శనం.
మహిళలు, పురుషుల కలయిక-మానవ జన్మ, యుద్ధ వీరుల చిత్రాలు, చంద్రుడు, నెలవంక, సూర్యుడు కూడా ఈ లిపిలో ఉన్నాయి. అంటే, అప్పటికే వాళ్లు కాలాన్ని అంచనా కూడా వేసి, రేయి-పగలును గుర్తించి, పకృతిని ఒడిసి పట్టుకున్నారని అర్థమవుతున్నది. ఏనుగు, పులిని తోక పట్టి బండకి కొట్టడం, తాబేలు, ఉడుము, జింక, ఖడ్గమృగం బొమ్మలు కూడా ఇందులో ఉన్నాయి. కోయతూర్ ప్రజల, గోండుల ధర్మ గురువు లింగో ధర్మ చిహ్నం (శివలింగాన్ని పోలిన గుర్తు) కూడా కనిపిస్తాయి. పడుకోబెట్టిన చిన్న పాపల బొమ్మలు కూడా కనిపిస్తాయి.
మన మూలవాసుల లిపి
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అత్యంత వైభవం కలిగిన సింధు నాగరికత చిత్రలిపి బొమ్మలలోని కొన్ని ఇక్కడి బొమ్మలలో కనిపిస్తున్నాయి. సింధు నాగరికతనే కొయతూర్ ప్రజల గోండి నాగరికత అని గోండి సాహిత్యంలో చెప్పబడుతుంది.
దీని గురించి నాగ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన డా. మోతిరావన్ కంగాలి 'decipherment of indus script in gondi' అనే పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించారు. ఇది ఈ దేశంలోకి వచ్చిన వలస ఆర్యులు ఏర్పాటు చేసిన నాగరికత కాదు, ఈ దేశ మూలవాసుల నాగరికత అని చెప్పటానికి బలమైన ఆధారం అవుతుంది. పరిశోధనలు జరగాలి.
కాక నవ్య
టీయూ హైదరాబాద్
93922 83453