అహింసకు, హింసకు మధ్య..

by Vinod kumar |
అహింసకు, హింసకు మధ్య..
X

పల్లెటూరులో వ్యవసాయ చేసుకుంటూ జీవిస్తున్న యువకుడు, అతడి మరదలు మధ్య ఉన్న ప్రేమ సాఫీగా సాగిపోతున్న కుటుంబంలోకి అనుకోని సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అధిగమించడానికి హింసా మార్గం కూడా అవసరమని చెబుతుందీ చిత్రం.

నేడు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం చాలా వరకు తగ్గింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఓటీటీలోనే అధికంగా వీక్షిస్తున్నారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన చిత్రం "అహింస". జయం, నువ్వు నేను, ధైర్యం వంటి సినిమాలను తెరకెక్కించిన తేజ దర్శకత్వంలో ఈ ఏడాది జూన్ రెండో తేదీన విడుదల అయిన చిత్రం.

ఇందులో కథను పరిశీలిస్తే..

ముఖ్యంగా గాంధీ సిద్ధాంతాలు, బుద్ధిని బోధనలతో అహింస వాదిగా పెరుగుతున్న వ్యవసాయధారుడైన యువకుడు హింసవాదిగా మారటమనేది కథా నేపథ్యం తప్పని పరిస్థితుల్లో హింసకు పూనుకోవడం మంచితనంతో బతుకుతున్న వారికి జీవితాల్ని ప్రభావితం చేస్తూ వారి జీవన విధానాలను చేతగానితనంగా భావిస్తున్న వ్యక్తులు తమపై ఆధిపత్యం చేలాయిస్తూ హింసిస్తున్నప్పుడు, ప్రాణాలకే హాని కలిగిస్తున్నప్పుడు అహింస సిద్ధాంతాలను పక్కన పెట్టుకోవాలి ముల్లును ముల్లుతోనే తీయాలి అనే మాట ప్రకారం కుటుంబానికి, ప్రాణాలకే ముప్పున్నప్పుడు మనల్ని మనం కాపాడుకునే క్రమంలో ఎదురుదాడి తిరగడం తప్పుకాదని చెప్పేదే ముఖ్యసందేశం.

'అహింస' సినిమాలో ప్రధాన పాత్రధారులైన రఘు, అహల్య, దుశ్యంత, చటర్జీ పాత్రలతోపాటు న్యాయవాది పాత్ర కీలకమని చెప్పవచ్చు. రఘు పాత్ర పోషించిన దగ్గుబాటి అభిరామ్ తనకు తొలి సినిమా అయినప్పటికీ మంచి నటన కనబరిచారు ఈ సినిమా మొత్తం కూడా ఆధారపడిన పాత్ర అహల్య. ఈ పాత్ర పోషించిన గీతికా తివారి అద్భుతంగా, అందంగా సినిమాకు బలాన్ని చేకూరుస్తుంది. ఒక పల్లెటూరులో వ్యవసాయ చేసుకుంటూ జీవిస్తున్న యువకుడు వారి మరదలు మధ్య ఉన్న ప్రేమ సాఫీగా సాగిపోతున్న కుటుంబంలోకి అనుకోని సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అధిగమించడానికి హింస తప్పదనేది ఈ చిత్రం ద్వారా తెలుస్తోంది. పల్లెటూరి మధ్యతరగతి అమ్మాయిని ఇద్దరు అగ్రకులాల వారు, ధనవంతులైన యువకులు అత్యాచారం చేయడం ఆ అత్యాచారాన్ని కప్పిపుచ్చు కోవడానికి దాని నుండి తప్పించుకోవడానికి చేసే విశ్వప్రయత్నాల మధ్యన జరుగుతున్న పరిణామాలు ఆలోచింపజేస్తాయి.

డబ్బున్న వారు సాక్ష్యాలను తారుమారు చేయడం, అత్యాచారానికి గురైన కుటుంబానికి మద్దతుగా కొట్లాడుతున్నటువంటి న్యాయవాది దంపతులను దుశ్యంత పాత్రధారుడు అతి కిరాతకంగా చంపడం చూస్తే కొన్నేళ్ల క్రితం హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతులను ఘోరంగా హత్య చేసిన సందర్భం గుర్తుకు వస్తుంది. అహింసా మార్గంలో ఉన్నప్పటికీ మన ప్రాణానికి హాని కలుగుతుంది అని తెలిసినప్పుడు, ప్రాణానికి ముప్పు ఉందని అనిపించినప్పుడు హింసించడం తప్పు కాదని ఈ సినిమా చెబుతోంది. రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ అహింస చిత్రం అత్యాచారానికి గురవుతున్న ప్రతిఒక్కరూ సమస్యను ఎదుర్కోవడానికి మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలి అనే సందేశం అందించింది.

సినిమా : అహింస

దర్శకుడు : తేజ

నటీనటులు : అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా

విడుదల : అమెజాన్ ప్రైమ్

ఎజ్జు మల్లయ్య,

96528 71915


Advertisement

Next Story

Most Viewed