- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి కడుపుకోత పట్టించుకోరా!
తెలంగాణ వచ్చిందని సంబరాలు చేస్తున్న ప్రజలారా, ఒకసారి ఆలోచించండి.. రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలు జరుపుతుంటే కొంత మంది స్వీట్లు పంచుకుంటున్నారు, ఇంకా కొంతమంది ధావత్‌లు చేస్తున్నరు. కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ మేమే ఇచ్చినం అంటున్నారు! బీఆర్ఎస్ వాళ్ళు మేమే తెచ్చినం అంటున్నారు! మరి స్వరాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరులు ఎవరు? ఎవరైనా ఆ అమరవీరుల గోస చూశారా? ఊర్లో ఎవరైనా చనిపోతేనే ఊరు ఊరంతా బాధపడుతుంది. అలాంటిది వందల మంది వీరుల రక్తంతో ఏర్పడిన తెలంగాణలో అమరవీరుల తల్లుల గోస ఎవరైనా చూస్తున్నారా? తెలంగాణ తెచ్చామనో, ఇచ్చామనో, సపోర్ట్ చేశామనో ర్యాలీలు చేసుకుంటున్న నాయకులారా, ఇంత మంది అమరవీరులు ప్రాణాలు ఇవ్వనిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందా?
కొందరికే న్యాయమా?
అమరవీరుల త్యాగం తో ఏర్పడిన తెలంగాణను చూసి సంతోషపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. అమ్మ కడుపులో నుంచి బిడ్డ బయటకి రావడానికి కూడా పురిటి నొప్పులు కొద్దిసేపు ఉంటాయి. కానీ ఆ బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ పదేండ్లుగా ఉంది. వారికి ఓదార్పు ఇవ్వడానికి ఎవరైనా ప్రయత్నించారా? ఎవరివల్ల తెలంగాణ ఏర్పాటైంది? ఖద్దరు బట్టలు వేసుకొని అడిగితే ఇచ్చారా తెలంగాణ? మీరు అలా వెళ్ళినప్పుడల్లా అవమానాలే కదా వచ్చింది. నా బిడ్డలు 1200 మంది ప్రాణాలు పోగొట్టుకుని రాష్ట్రం ఏర్పడగానే మాట్లాడిన మీరు తర్వాత మేము ఎందుకు గుర్తులేమో అర్థం కాలేదు. మీ నుండి అమరవీరులు కోరుకునేది కేవలం ఓదార్పు, అమరవీరుల సంస్మరణ, ప్రభుత్వం ఇచ్చిన 80 జీఓ హామీని నిర్వర్తించడం మాత్రమే!
అసలు ఈ అమరవీరుల స్తూపం ఎలా ఉంటుంది? అందులో అమరవీరుల ఆల్బమ్ ఉంటుందా? 1200 మంది బలిదానం చేసుకుంటే 600 మందిని మాత్రమే గుర్తించిన ప్రభుత్వం వారి వివరాలైనా అందులో ఉంచుతుందా? అమరవీరుల తరఫున కేవలం కొంతమందికే న్యాయం చేస్తే ఎలా? వారి బిడ్డల లాగానే ఇతరులవి ప్రాణాలే కదా! అమర వీరులందరికీ న్యాయం జరిగితేనే న్యాయం కదా? కొందరికే జరగడం అన్యాయం కాదా? అసలు రాష్ట్రం ఏర్పడి మీరు ముఖ్యమంత్రి అయ్యే సమయం నుండి అమరుల కుటుంబాలకు ఏం కావాలని ఎప్పుడైన సంప్రదించారా?
ఒక్కరిని సంప్రదించకుండా..
అమరవీరుల కుటుంబాలు అడిగేదేంటి, ప్రతి వీరునికి న్యాయం చేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం 80 జీఓను అమలు చేయడం, విద్య, వైద్యం, 300 గజాల గృహం, ప్రతిజిల్లా క్వార్టర్‌లో అమరుల స్తూపం, ప్రతి వీరుని పేరు మీద ప్రభుత్వం నివాళి అర్పించడం మాత్రమే కదా? వారి కుటుంబాలను ఆదుకుంటేనే కదా, వారు చేసిన త్యాగానికి ఒక అర్థం, పరమార్థం.. అందుకే మమ్మల్ని అర్థం చేసుకోని మాకు న్యాయం చేయండి..
170 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ స్తూపం కనీసం 20 మంది సందర్శనకు వెళితే కూర్చోవడానికి లేదు, నివాళి అర్పించడానికి స్థలం లేదు, అందులో అమరుల కుటుంబాలకు కూడా అధికారం లేదా? మేము ఆ స్తూప సందర్శనకు వెళితే ఎవరు మీరు అంటున్నారు! ఇదేమి కర్మ! మీరు అధికారం చేపట్టాక మీ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేము అన్నారు. కానీ అమరులకు గుర్తింపు ఉండేలా ఒక్క చర్య తీసుకోలేదు.. ఒక వీరుని పేరు లేకుండా, ఒక్క కుటుంబాన్ని సంప్రదించకుండా, కనీసం అమరుల కుటుంబాల అభిప్రాయం అడగకుండా అమరుల స్తూపం కట్టారు. ఆకృతి రూపం ఉన్న స్తూపం కనపడుతుంది సరే, కానీ త్యాగం ఏ రూపంలో కనబడుతుంది! ఇందులో మా త్యాగం ఏది? మాకు రాజకీయ పదవులు వద్దు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయే కుటుంబాలు కావు మావి. యూనిటీ లేక అమరుల కుటుంబాలే సగం సగం విడిపోయాయి. అలా విచ్ఛిన్నం అయిపోయిన తెలంగాణ అమరుల కుటుంబాలను పిలిపించి ఆ కుటుంబాలకు కాస్త ధైర్యం ఇవ్వండి!
నరేష్ నాయక్
తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక
85005 85982