ఓట్లు వద్దనుకుంటే..

by Ravi |   ( Updated:2024-02-08 00:15:38.0  )
ఓట్లు వద్దనుకుంటే..
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు బంద్ చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రియల్టర్స్ ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని ధర్నాలు చేయడంతో పాటు, ఇందిరాపార్క్ వద్ద దాదాపు 10వేల మంది ధర్నాకు దిగడంతో అప్పటి ప్రభుత్వం వెనకకు తగ్గి ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్‌లు చేయడం మొదలుపెట్టింది. దీనివలన సుమారు 26 లక్షల మంది దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగింది. ఎల్ఆర్ఎస్ కడితే ప్లాట్లు లీగల్ అవుతాయి లేకుంటే లీగల్ కావనే ప్రచారం చేశారు అలాంటప్పుడు రూపాయో, రెండు రూపాయలో తీసుకుని రెగ్యులరైజ్ చేయాలి.

ప్రజలు గ్రామ పంచాయితీ లే అవుట్లలో ప్లాట్లు కొనడానికి ముఖ్య కారణం తక్కువ ధర! అందుకే కొంటారు. ఇప్పటికే దీని రిజిస్ట్రేషన్ కోసం గ్రామ పంచాయితీ సెక్రటరీ, సర్పంచ్ సంతకాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసారు. ఈ రిజిస్ట్రేషన్‌లకు ఫీజు కూడా చెల్లించారు. కానీ ప్రభుత్వానికీ ఆదాయం కావాలనుకున్నప్పుడల్లా ఎల్ఆర్ఎస్‌ను ముందుకు తీసుకువస్తున్నారు ఇది అన్యాయం. ప్రస్తుతం ఇంటి పర్మిషన్ కోసం వెళ్ళినా ఎల్ఆర్ఎస్ వసూల్ చేస్తున్నారు. ఇలా బలవంతపు వసూళ్లకు పాల్పడితే 26 లక్షల దరఖాస్తుదారులు భవిష్యత్‌లో జరగబోవు ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి ఓటు వేయరని గమనించాలి.

నారగొని ప్రవీణ్ కుమార్

ప్రెసిడెంట్, రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Advertisement

Next Story