పశువుల పండుగ 'దాటుడు'

by Ravi |   ( Updated:2022-09-03 14:34:35.0  )
పశువుల పండుగ దాటుడు
X

దివి నుంచి భువికి వచ్చిన దేవతలు మేరమా, తోళ్జా, మంత్రళ్, కంకాళి, హీంగ్లా, ద్వాళంగర్‌ తరువాత చిన్నవారు సీత్లా భవానీ. ఈ ఏడుగురు అక్కచెల్లెళ్లకు ఒక తమ్ముడు లుంక్డియా. ఏడుగురిలో ఆరుగురిని ఇంటిలో పూజిస్తారు గిరిజనులు. సీత్లామాతను మాత్రం అడవిలో ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తారు. దానికి కారణం సీత్లామాత, లుంక్డియా ఒకసారి అడవిలో పశువులను మేపేందుకు తీసుకెళ్లి దారి తెలియక మాయమైపోయారు. సీత్లామాత అక్కడే రాయిగా మారిందని పూర్వీకుల కథనం. అందుకే ఆమెను అక్కడే పూజిస్తారు. ఇలా రెండు మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగను వానాకాలం సీజన్ ప్రారంభంలో జరుపుకుంటారు.

ప్రాచీన కాలంలో లంబాడీలు సంచార జీవనం చేసేవారు. రాజవంశీయులైన వీరి ప్రధాన వృత్తి వ్యాపారం. వీరి ఆచార వ్యవహారాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఒకచోటు నుంచి మరో చోటికి ముత్యాలు, రత్నాలు, ఉప్పు, జొన్నలు రవాణా చేసుకుంటూ అమ్ముతుండేవారు వాహనాలు లేకపోవడంతో ఎడ్లబండినే ఉపయోగించేవారు. వీరి సంచార జీవనంలో ముఖ్య భూమిక పోషించే పశువులు తరచుగా రోగాల బారిన పడి మృతిచెందేవి. ఒకరోజు తండా పెద్ద (నాయక్) కలలో సీత్లామాత ప్రత్యక్షమై తనను ప్రతిష్ఠించి పూజలు చేస్తే పశువులకు రోగాలు రాకుండా కాపాడుతానని వాగ్దానం చేస్తుంది. అప్పటి గిరిజనులు సీత్లా భవానీని భక్తితో పూజించడం మొదలుపెట్టారు.

రోగాల నుంచి కాపాడమని

దివి నుంచి భువికి వచ్చిన దేవతలు మేరమా, తోళ్జా, మంత్రళ్, కంకాళి, హీంగ్లా, ద్వాళంగర్‌ తరువాత చిన్నవారు సీత్లా భవానీ. ఈ ఏడుగురు అక్కచెల్లెళ్లకు ఒక తమ్ముడు లుంక్డియా. ఏడుగురిలో ఆరుగురిని ఇంటిలో పూజిస్తారు గిరిజనులు. సీత్లామాతను మాత్రం అడవిలో ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తారు. దానికి కారణం సీత్లామాత, లుంక్డియా ఒకసారి అడవిలో పశువులను మేపేందుకు తీసుకెళ్లి దారి తెలియక మాయమైపోయారు. సీత్లామాత అక్కడే రాయిగా మారిందని పూర్వీకుల కథనం. అందుకే ఆమెను అక్కడే పూజిస్తారు. ఇలా రెండు మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ పండుగను వానాకాలం సీజన్ ప్రారంభంలో జరుపుకుంటారు. తొలకరి చినుకుకు మొలిచిన పశుగ్రాసం తినడం వలన జీవాలు రోగాల బారినపడతాయి. అందుకే పశువులను కాపాడి, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు, పశుపక్షాదులు, పిల్లజెల్ల ఆరోగ్యంగా ఉండాలని యేటా జూలై నుంచి ఆగస్టు మాసంలో వచ్చే పెద్దపుసాల (పునర్వసు) కార్తె ఆరంభంలో వచ్చే తొలి మంగళవారం రోజు సీత్లామాతను పూజిస్తారు.

పండుగ జరిపే విధానం

ఈ పండుగ రోజు ఊరికి దూరంగా ఏర్పాటు చేసిన ఏడు రాళ్లకు ఒక ప్రత్యేక రంగు పూసి తూర్పు వైపు చూసేలా ప్రతిష్ఠిస్తారు. వీటికి ఎదురుగా పడమర వైపు చూసేలా లుంక్డియాను నెలకొల్పుతారు. ఈ రాళ్లను పూలతో అలంకరించి తమ ఇళ్లలో ముందు రోజు నానబెట్టిన జొన్నలు, పప్పు ధాన్యాలు గుగ్గిళ్లు వంటి నైవేద్యం పెడతారు. ఇంటిలో వండిన బెల్లం అన్నం, గంగాజలంతో పూజలు చేస్తారు. ఉల్లిపాయ, ఎండుమిర్చి, కానుకలు సమర్పిస్తారు.

లాంబాడీ మహిళలు గుంగ్టో, పూల్యగోణ్ణో ధరించి డప్పు చప్పుళ్లతో నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సీత్లామాతను పూజిస్తారు. అనంతరం గొర్రెను బలిచ్చి దాని పేగును సీత్లాభవాని నుంచి లుంక్డియా వరకు సాగదీసి కట్టి దానిపై నుంచి ఆవులను, ఎడ్లను, గొర్లను దాటిస్తారు. ఆ సమయంలో నైవేద్యంగా తెచ్చిన గుగ్గిళ్ళను పశువులపై చల్లుతారు. ఇలా చల్లడం వలన పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా సీత్లామాత కాపాడుతుందని గిరిజనుల నమ్మిక. అలాగే అటవీ సంపదను కాపాడమని వేడుకుంటారు. ఆ రోజు సాయంకాలం బంధువులు, స్నేహితులు, తోబుట్టువులతో గిరిజన తండాలలో పండుగ సందడి నెలకొంటుంది.

ఇస్లావత్ దేవేందర్

వరంగల్

9652249371

Advertisement

Next Story

Most Viewed