- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
HBD KTR: యూత్ ఐకాన్ గా కేటీఆర్ ఎలా మారారు?
తెలంగాణ ఖ్యాతిని అనతికాలంలోనే విశ్వవ్యాపితం చేశారు. 'మేకిన్ తెలంగాణ' నినాదంతో ఐటీ తెలంగాణ విజనరీని ప్రపంచం నలుచెరుగులా విస్తరింపచేశారు. కేటీఆర్ పరిపక్వత గల నాయకుడని, డైనమిక్ మినిస్టర్ అని ప్రత్యర్థులు సైతం ప్రశంసలు కురిపిస్తారు. రాజకీయాలలో ఇలాంటి నేతలు అరుదు. పెట్టుబడులు ఆకర్షించేది, తెలంగాణ పోటీ పడుతున్నది ఈ దేశంలోని రాష్ట్రాలతో కాదు ప్రపంచంలోని 'ది బెస్ట్' దేశాలతో. గట్స్ ఉన్న నాయకుడు గనుకనే కొత్తగా ఏర్పాటు చేసుకున్న నవజాతి శిశువుకు వెలుగు సోకకుండా కేంద్రం 'ఐటీఐఆర్'ను రద్దు చేసినా చలించలేదు. బీజేపీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతోనే జవాబు చెప్పారు. ఎనిమిదేండ్లలో 'ఐటీ' ఎగుమతులను మూడు రేట్లకు పెంచి, 1 లక్ష 83 కోట్లను దాటించి అసాధ్యాలను సుసాధ్యం చేశారు.
రాజకీయ, ఐటీ, పారిశ్రామిక రంగాలలో ఆయన 'ఐకాన్. టీఆర్‌ఎస్ పార్టీలోనూ, తెలంగాణ ప్రభుత్వంలోనూ ఆయన మాటే తారక మంత్రం. తండ్రికి తగిన తనయుడు. కల్వకుంట్ల తారక రామారావు సాధారణ కార్యకర్తలా రాజకీయాలలోకి అడుగుపెట్టారు. పద్మవ్యూహాలను దాటుకుంటూ ప్రజల మనసు గెలుచుకున్నారు. పని ఏదైనా, ఎంత పెద్ద సమస్య అయినా చిటికెలో పరిష్కారం కనుగొనే శక్తియుక్తులు కేటీఆర్ సొంతం. 'ఏదైనా ఒక పని చేయడం వలన ప్రజలకు ఎంత ఉపయోగం, ఏ మేరకు అభివృద్ధికి దోహదం' అన్న రెండు విషయాలే ఆయనకు తెలుసు. విస్తృత ప్రయోజనాలు ఉన్నాయనుకుంటే ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాశుపతాస్త్రం లాంటి వేగంతో పాలనలో వెనుదిరుగని సామర్థ్యం. కేసీఆర్ వారసత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏనాడూ రాజకీయాలు చేయలేదు. గుర్తింపు కోసం పాకులాడలేదు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం జీవిస్తున్నారు. తెలంగాణ ఖ్యాతిని అనతికాలంలోనే విశ్వవ్యాపితం చేశారు.
'మేకిన్ తెలంగాణ' నినాదంతో ఐటీ తెలంగాణ విజనరీని ప్రపంచం నలుచెరుగులా విస్తరింపచేశారు. కేటీఆర్ పరిపక్వత గల నాయకుడని, డైనమిక్ మినిస్టర్ అని ప్రత్యర్థులు సైతం ప్రశంసలు కురిపిస్తారు. రాజకీయాలలో ఇలాంటి నేతలు అరుదు. పెట్టుబడులు ఆకర్షించేది, తెలంగాణ పోటీ పడుతున్నది ఈ దేశంలోని రాష్ట్రాలతో కాదు ప్రపంచంలోని 'ది బెస్ట్' దేశాలతో. గట్స్ ఉన్న నాయకుడు గనుకనే కొత్తగా ఏర్పాటు చేసుకున్న నవజాతి శిశువుకు వెలుగు సోకకుండా కేంద్రం 'ఐటీఐఆర్'ను రద్దు చేసినా చలించలేదు. బీజేపీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతోనే జవాబు చెప్పారు. ఎనిమిదేండ్లలో 'ఐటీ' ఎగుమతులను మూడు రేట్లకు పెంచి, 1 లక్ష 83 కోట్లను దాటించి అసాధ్యాలను సుసాధ్యం చేశారు. ప్రపంచ ఎకనామిక్ ఫోరం చీఫ్ 'బోర్గ్ బ్రెండే' మన్ననలు పొందారు. తెలంగాణ ఐటీ ప్రగతిని బిజినెస్ స్కూల్స్ పాఠాలుగా చెప్పుకోవడం అనిర్వచనీయం.
యువతరానికి కొత్త ప్రేరణ
'ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని, భావితరాలు గుర్తుండే విధంగా అధికారంలో ఉన్నప్పుడు నచ్చినవన్నీ చేసేయాలి' అంటారు సామాజిక శాస్త్రవేత్త మార్క్ ట్వెయిన్. మన కేటీఆర్(KTR) దారి కూడా అదే. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో ఒక నవ శకం సృష్టించారు. టాస్క్ మేనేజర్‌గా పెద్దగా హడావుడి, ఫాన్ ఫేర్ లేకుండానే తనకు అప్పగించిన పనిని కూల్‌గా, పర్ఫెక్ట్‌గా, రిజల్ట్ ఓరియెంటెడ్‌గా పూర్తి చేయడంలో దిట్ట, టార్గెట్ రీచ్ అయ్యేదాకా పట్టు వదలరు, పూర్తయ్యాక దాని గురించి పెద్దగా ఆలోచించరు. 'డూ ఇట్ అండ్ లీవ్' అన్నట్టుగా ఉంటుంది ఆయన పనితనం. నేటి కార్పొరేట్ రంగంలో కంపెనీలు అనుసరించే పద్ధతి ఇదే.
ఇప్పుడు వ్యవస్థలో టీం వర్క్ కీలకం. 'మెనీ బ్రెయిన్స్ టుగెదర్ మేక్ క్యాపిటల్' అనేది ఇప్పటి సిద్దాంతం. కేటీఆర్ దీనిని పూర్తిగా అనుసరించారు. వ్యక్తిగతంగా తన క్రెడిట్, ఇమేజ్ కన్నా ప్రభుత్వానికి, పార్టీకి, నాయకుడికి క్రెడిట్, ఇమేజ్ రావడాన్నే ప్రిఫర్ చేస్తారు. ఒకసారి తెలంగాణ మేధావుల సదస్సులో పాల్గొనేందుకు వేదికపైకి రాగానే కేటీఆర్ తనకోసం ప్రత్యేకంగా వేసిన కుర్చీని తీసేసి ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని మాట్లాడిన తీరు సభికులను మంత్రముగ్ధులను చేసింది. హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్లు హ్యూమన్ రీజాయిస్ డిపార్ట్‌మెంట్లుగా మారిన కాలమిది. నాయకుడు అంటే కడక్, ఖద్దర్ అంగీ వేసుకుని హడావుడి చేస్తూ, ఆర్భాటంగా ఫార్చునర్ కారులోంచి నల్లటి అద్దాలు పెట్టుకొని దిగే వాతావరణంలో కేటీఆర్ యువతరానికి కొత్త ప్రేరణ. యువతకు ఉపాధే లక్ష్యంగా కేటీఆర్ విజనరీ చరిత్రలో మైలురాయి. రాజకీయాలలోకి అనేకమంది మహామహులు వచ్చారు, పోయారు. జనాకర్షణ మాత్రం కొందరికే దక్కింది.
దిగ్గజ సంస్థలకు కేంద్రంగా నిలిపి
దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పాలనానుభవం కలిగిన ఎంతోమంది పాలకులతో కానిది, మనమెందుకు సాధించలేమన్న ప్రోయాక్టివ్ దృక్ఫథంతో ముందుకు నడిచారు కేటీఆర్. ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. టీఎస్-ఐపాస్, వి-పాస్ వంటి వినూత్న పథకాల ద్వారా ప్రపంచ దేశాల కంపెనీల చూపు తెలంగాణపై పడేలా చేశారు. 'భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం సరికొత్త ఆవిష్కరణ' అన్న అబ్రహంలింకన్ మాటలను కోట్ చేస్తూ దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇన్‌క్యుబేటర్ టి-హబ్-2.0ను అవిష్కరించారు. దీంతో పేరు మోసిన ఐటీ దిగ్గజం నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ అభినందనలు చెప్పారు.
బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా గ్లోబల్ టెక్నాలజీలో బెంగళూరు, చెన్నయిని హైదరాబాద్ మించిపోయిందన్నారు. కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా 'కచ్చితంగా ఇది తెలంగాణ భవిష్యత్తేనని' స్పందించారు. ఇక డిస్ ప్లే ఫ్యాబ్ యూనిట్ ప్రారంభంతో పెరిగిన రాష్ట్ర ఇమేజ్ అంతా ఇంతా కాదు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో 2022 మార్చ్, మే నెలలలో అమెరికా, లండన్, స్విట్జర్లాండ్ దావోస్‌లో పర్యటించిన కేటీఆర్ దాదాపు 80 వ్యాపార సమావేశాలు నిర్వహించారు. 11,700 కోట్ల పెట్టుబడులను అలవోకగా సాధించారు. కేటీఆర్ కృషి ఫలితంగా అగ్రశ్రేణి ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్ బుక్, సేల్స్ ఫోర్స్ లాంటి ఎన్నో అగ్రగామి సంస్థలకు హైదరాబాద్ రెండవ కేంద్రంగా నిలిచింది.
(నేడు కేటీఆర్ జన్మదినం)
సంగని మల్లేశ్వర్
జర్నలిజం విభాగాధిపతి
కేయూ, వరంగల్
9866255355