విశ్రాంత కార్మికులను సన్మానించాలి!

by Ravi |   ( Updated:2024-12-19 00:30:56.0  )
విశ్రాంత కార్మికులను సన్మానించాలి!
X

దక్షిణ భారతదేశంలో ఏకైక బొగ్గు పరిశ్రమగా పేరు ప్రఖ్యాతలు కలిగిన సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. 1956 కంపెనీస్ చట్ట ప్రకారం భారతదేశంలో మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థగా పేరు గడించింది. 1989లో దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది కార్మికులతో ఉన్న సంస్థ నేడు కేవలం నలభై వేల మంది కార్మికులతో మాత్రమే సంస్థ నడుస్తుంది.

సింగరేణి డే రోజున..

ప్రతి సంవత్సరం దేశంలో ఏ కంపెనీలో లేని విధంగా సింగరేణి కార్మికులకు లాభాల వాటా పంచడంలో ప్రముఖ కమ్యూనిస్టు కార్మిక నాయకుడు కె.ఎల్.మహేంద్ర కృషి ఎంతో గొప్పది. 1992లో కంపెనీ నష్టాలలో ఉండి మూసివేసే దశలో కార్మికులు కష్టపడి లాభాల బాటలో పయనింప జేసింది కార్మికులే అనే విషయాన్ని మరువరాదు. ఇది ఇలా ఉండగా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం అన్ని గనులు, కార్యాలయాల వద్ద ఘనంగా నిర్వహిస్తూ ఉత్తమ కార్మికులు, అధికారులకు సన్మానం చేస్తున్నారు. అయితే ఇందులో విశ్రాంత ఉద్యోగులను సన్మానించకపోవడం బాధాకరం. కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలలో రిటైర్డ్ కార్మికులకు 70 సంవత్సరాలు నిండిన వారికి 70,000 రూపాయలు, 75 సంవత్సరాలు నిండిన వారికి 90,000 రూపాయలు ఈ విధంగా వంద సంవత్సరాలు నిండిన వారికి 2,50,000 రూపాయలు గౌరవంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అదే విధంగా సింగరేణి విశ్రాంత కార్మికులకు వారి త్యాగాలు గుర్తించి వీరిని సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నాడు సన్మానించి ఆర్థిక సహాయం అందించాలని విన్నవించుకుంటున్నారు. తమ మాతృ సంస్థపై మమకారం చంపుకోలేక, యాజమాన్యం వీరి పట్ల చిన్న చూపు చూసినప్పటికీ, తమకు తామే సింగరేణి విశ్రాంత కార్మిక సంక్షేమ సంఘాలు ఏర్పర్చుకుని "సింగరేణి డే" రోజున వయోధిక విశ్రాంత కార్మికులను సన్మానించుకోవడం గర్వకారణం.

ఆళవందార్ వేణు మాధవ్

సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

86860 51752

Advertisement

Next Story