- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 ఏండ్ల పీడీఎస్‌యూకు విప్లవ జేజేలు
శాస్త్రీయ విద్యా, కామన్ విద్యా విధానం,సమసమాజం, నూతన ప్రజాస్వామిక విప్లవం లాంటి ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన సంస్థ పీడీఎస్‌యూ. 50 ఏళ్ల పీడీఎస్‌యూ విప్లవ ప్రస్థానంలో అనేకమంది విద్యార్థి రత్నాలు బిగి పిడికిలి జండా కొరకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. కామ్రేడ్ జార్జి రెడ్డి మతోన్మాద విచ్చుకత్తులకు ఉస్మానియా యూనివర్సిటీలో నేల కోరిగాడు. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి ఎమర్జెన్సీ చీకట్లో నాటి నియంతృత్వ పాలకుల దోపిడీ తూటాలకు తమ ప్రాణాలను అర్పించారు. కోలా శంకర్, చేరాలు,రంగవల్లి, స్నేహలత, మారోజు వీరన్న, మధుసూదన్ రాజు యాదవ్, యానాల వీరారెడ్డి, రమణయ్య, సాంబన్నలు తమ విలువైన ప్రాణాలను ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఇచ్చి మన సంస్థను సమున్నతంగా నిలబెట్టారు. రాజ్యం, దోపిడీ వర్గాలు ప్రయోగిస్తున్న అణచివేత నిర్బంధాలను ఎప్పటికప్పుడు తట్టుకుంటూ, కత్తుల వంతెన పై కవాతు చేస్తూ నిత్యం పాలకవర్గాలకు సవాలను విసురుతూనే ఉంది.
శాస్త్రీయ విద్యా, కామన్ విద్యా విధానం,సమసమాజం, నూతన ప్రజాస్వామిక విప్లవం లాంటి ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన సంస్థ పీడీఎస్‌యూ. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పడి అక్టోబర్ 12, 2024 నాటికి 50 ఏళ్ళు నిండింది. ఈ 50 ఏళ్ల విప్లవ ప్రస్థానంలో విద్యార్థుల పక్షాన బాధ్యతగా కొట్లాడుతూనే విద్యా ప్రవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిరది. సాంప్రదాయ, సంస్కరణవాద విద్యార్థి సంఘాలను తుత్తినీయలు చేస్తూ విద్యార్థులందరికీ విప్లవ చైతన్యాన్ని అందించింది, వారందరినీ ఉద్యమాల బాట పట్టించింది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇచ్చిన స్ఫూర్తితో విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం నిత్యం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూనే సమాజ మార్పు కోసం సాగే ఉద్యమాలు భాగస్వామ్యం అవుతున్నారు. కాలం పెట్టిన ప్రతిపరీక్షలో దృఢంగా పీడిత విద్యార్థుల వైపు నిలబడుతూ ప్రతి చారిత్రాత్మక సందర్భంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. తెలుగు సమాజంలో వచ్చిన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, స్త్రీవాద ,దళితవాద, అస్తిత్వ ,కార్మిక కర్షక, యువజన, ప్రజాస్వామిక, విప్లవ పోరాటాలలో తనదైన పాత్రను పోషించింది. ఉద్యమాలు వెనకపట్టు పట్టినప్పుడు, కొంత నిస్తేజం ఆవరించినప్పుడు ప్రగతిశీల విద్యార్థులు ఇంధనమై మండారు. సంస్థ విద్యార్థులు నిత్యం సమాజాన్ని చైతన్యంగా ఉంచడానికి సర్వసాన్ని ధారపోశారు. ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారు.
సకల ఉద్యమాలకూ మద్దతు
పీడీఎస్‌యూ కేవలం విద్యారంగ సమస్యల పరిష్కార సాధనకి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభం నుండి నేటి వరకు అనేక పౌర, ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాల్గొంటుంది. తెలుగు నాట సాగిన భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన నక్సల్‌బరీ శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాలకు తన క్రియాశీలక మద్దతునిచ్చింది. అంతేకాదు 1974లో ప్రతిష్టాత్మక రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతిచ్చింది. 1975లో అధిక ధరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నది. రైతాంగ ఉద్యమ నేతలు భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరి శిక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. రమీజాబీ ఘటనకి వ్యతిరేకంగా కొట్లాడింది. దివిసీమ ఉప్పెనలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై, ప్రాణాలను కోల్పోతే వారికి అండగా నిలిచి గుండె ధైర్యాన్ని ఇచ్చింది. క్యాపిటేషన్,అధిక డొనేషన్లు, ఫీజులకు వ్యతిరేకంగా పోరాడిరది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బిగిపిడికిలి ఎత్తింది. ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థులారా ‘‘గ్రామాలకు తరలండి’’ అనే కార్యక్రమంతో ప్రజల జీవన విధానాన్ని, వారు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. సామాజిక, సాంస్కృతిక,ఆర్థిక అంతరాలు లేని సమాజం కోసం పోరాడాలని ప్రజలను చైతన్యం చేస్తుంది.
సమరశీల పోరాటాలకు నిత్యం సిద్దం
తన 50 ఏళ్ల ప్రస్థానంలో పీడీఎస్‌యూ అనేక పోరాటాలు నిర్వహించింది. ఎన్నో హక్కులను సాధించింది. ఉద్యమ నిర్మాణ క్రమంలో అనేకమంది పోరాట యోధులను కోల్పోయింది. ఈ పోరాట స్ఫూర్తిని వివరిస్తూ, అమరవీరుల స్ఫూర్తిని నేడు మరింత ఎత్తి పట్టాల్సిన అవసరం ఉంది. పోరాట స్ఫూర్తితో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకొనుటకు, విద్యా కార్పొరేటీకరణ వ్యతిరేకంగా పోరాట జ్వాలలను రగిలించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 ను ప్రతిఘటించాలి. అందరికీ సమానమైన శాస్త్రీయమైన విద్య కోసం, సమానమైన అవకాశాల కోసం సమరశీల పోరాటాలను నిర్వహించాలి. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీడీఎస్‌యూ కార్యవర్గాలు ఐక్యంగా 50 ఏళ్ల పీడీఎస్‌యూకి విప్లవ జేజేలు తెలియజేస్తున్నాయి ఇప్పటికే 2024 అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో, 2024 నవంబర్ 5న విజయవాడలో పీడీఎస్‌యూ అర్థ శతాబ్దోత్సవ సభలను నిర్వహిస్తున్నాయి. వీటిని జయప్రదం చేయవలసిందిగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులను, ప్రజాస్వామిక వాదులను, మేధావులను, అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
నవంబర్ 5న విజయవాడలో పీడీఎస్‌యూ అర్థ శతాబ్దోత్సవ సభల సందర్భంగా
పి. మహేష్
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు
97003 46942