బాలల నీతి దారులు

by Ravi |   ( Updated:2022-09-03 18:27:09.0  )
బాలల నీతి దారులు
X

బాల సాహిత్యాన్ని సృష్టించడం తేలికైన పని కాదు. దానికి పదాలు కన్న ఎక్కువగా పిల్లల మనస్తత్వం తెలుసుండాలి. బాలల మనోభావాల మీద గౌరవం ఉండాలి. అప్పుడే చక్కటి సాహిత్య వెలువడుతుంది. బాల సాహితీకారులకు ముఖ్యంగా పిల్లల పట్ల ఓర్పు, నేర్పు ,ప్రేమ ,బాధ్యత తప్పనిసరిగా కలిగి ఉండాలి. నీతిని మాత్రమే బోధిస్తూ ఉంటే సరిపోదు. స్వయంగా వారిలో తెలివిని పెంచడం చేయాలి. పిల్లల మనసు తెలుసుకుని వారి స్థాయికి తగ్గట్టు కథలు రాయడం భాషోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేసిన సంగనభట్ల రామకిష్టయ్య గారికే సాధ్యం. అందంగా పద్యాలు రాయగల దిట్ట. మంచి పనులకు దానధర్మాలు చేయమని, ప్రతి పైసాకు ప్రతిఫలం ఆశించకుండా ఉండమని 'కీర్తి మాధుర్యం' కథలో చక్కటి సందేశాన్ని అందించారు. కొడుకులో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లి గొప్పతనం గురించి 'అమ్మ ప్రేమ' లో ఆవిష్కరించారు.

జీవితంలో గొప్పగా ఎదగాలని పరోపకారం చేయాలని ఎవరిని గాయపరచకూడదని 'చెట్టు సందేశంలో' చక్కగా వివరించారు. తన మాటను వేదవాక్కు లాగా భావించి పైకి వచ్చిన రాము మాస్టారు గారి పేరును తన పిల్లాడికి పెట్టడం, గురు ఆనంద భాష్పాలు రాల్చడం 'గురుదక్షిణ' కథ లో చెప్పారు. అడవులు పెంచితేనే వర్షాలు కురుస్తాయి జంతువులకు ఆశ్రయం కలుగుతుందని 'పచ్చని చిలుక' కథ ద్వారా చక్కటి సందేశాన్ని అందించారు. ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు తెగింపు వస్తుందని 'తెగింపు' కథలో తెలుసుకుంటాం. అమాయకులను మోసం చేయకూడదు అనే నీతిని 'దురాశ' కథలో తెలుసుకుంటాం. ఇతరులను ద్వేషించడం హేళన చేయడం మంచిది కాదని 'ప్రకృతి నియమాలు' కథలో బాలలకు చక్కటి సందేశాన్ని అందించారు రచయిత. ముఖచిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు ఆగాచార్య వేశారు.

రూ.100, పేజీల సంఖ్య 95

ప్రతులకు

సంగనభట్ల చిన్న రామకృష్ణయ్య

ఇంటి నెంబర్ 11-52

గోదావరి రోడ్డు, ధర్మపురి,

జగిత్యాల జిల్లా - 505425

99085 ౫౪౫౩౫

సమీక్షకులు

యాడవరం చంద్రకాంత్ గౌడ్

సిద్దిపేట, 9441762105

Advertisement

Next Story

Most Viewed