- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హక్కుల నేత ఆజం అలీ
అది ప్రజా సంఘాల నాయకులను పద్ధతి ప్రకారం అంతమొందిస్తున్న కాలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనలో నయీం చేతిలో తుపాకులు పెట్టి ప్రజల్ని భయం గుప్పెట్లో ఉంచుతున్న రోజులవి. మరో హక్కుల నేత పురుషోత్తంను హైద్రాబాద్‌లో హత్య చేసిన మూడు నెలల తర్వాత 2001 ఫిబ్రవరి 18న ఉపాధ్యాయుడు ఆజం అలీని పాలక వర్గ కిరాయి హంతకుడు నయీం క్రూరంగా చంపేశాడు. ఆజం అలీ దశాబ్దానికి పైగా పౌరహక్కుల సంఘంలో పని చేసిన వ్యక్తి. ఏడెనిమిదేళ్ళు నల్గొండ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడుగా పనిచేసి, 1998లో కార్యదర్శి బాధ్యతలను స్వీకరించి, సీరియస్‌గా పనిచేశారు. తాను నిజమైన పిల్లల మాష్టారు. ఎప్పుడూ గిజూబాయి రచనల గురించి, ఆయన విధానాలను పాఠశాలల్లో, అన్వయించవలసిన అవసరం గురించి మాట్లాడేవాడు. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా గొంతెత్తమన్నాడు. ప్రజాస్వామ్యం కోసం, మాయమవుతున్న మనుషులను రక్షించుకోవడం కోసం, తలలపై తల్వార్లు లేకుండా చేయడం కోసం మనందర్ని గొంతెత్తమన్నాడు. మైనారిటీ నుండి ఇలాంటి గొంతుకలు రావడం చాలా అరుదు. మనుషుల పట్ల అమితమైన మమకారం కలవాడు. 38 ఏళ్ళ వయసులోనే పూర్తి జీవితాన్ని కోల్పోయాడు. ఎన్‌ఆర్‌సీ పేరుతో ముస్లింలను నిర్మూలించడం, కార్మిక రైతాంగ చట్ట సవరణలతో కార్మికులను, రైతులను హత్య చేసే స్థితికి పాలక వర్గం మారిన స్థితిలో, ఆజం కార్యాచరణలో మనమెక్కడో పునరాలోచించుకుందాం. పౌరహక్కుల సంఘం అమరుడు ఆజం అలీ అమరత్వాన్ని గుర్తు చేసుకుందాం.
(నేడు ఆజం అలీ 20వ వర్ధంతి సందర్భంగా)
ఎన్. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి
పౌర హక్కుల సంఘం, తెలంగాణ