- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్ల రేషనలైజేషన్ చట్టవిరుద్ధం!
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత సంవత్సరం అసెంబ్లీలో మార్చి 9న ప్రకటించింది... సీఎం స్వయంగా విభాగాల వారీగా ఖాళీలు వెల్లడించి వీటికి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 80వేల ఉద్యోగాల్లో 13,500 ఖాళీలు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో 9,400 పోస్టులు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, పండిట్ పోస్టులు ఉన్నాయని ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్ పంపింది. గత సంవత్సరం జూన్ 12న టెట్ నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 4సార్లు, స్వరాష్ట్రంలో 3 సార్లు టెట్ నిర్వహించగా 4 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మరో 2లక్షల మంది టెట్‌లో అర్హత పొందలేదు. ఇంతవరకు టెట్ రాయని వారు 20 వేల మంది ఉన్నారు. వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం లేదు.
టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ అంటూ గత 6 నెలలుగా కొర్రీలు చెబుతూ వస్తోంది. రాబోయే 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రాబోతోంది... అయినా ఇప్పటివరకు టీఆర్టీపై నిర్ణయం తీసుకోలేదు. 4 లక్షల మంది అభ్యర్థులు ఇతర నోటిఫికేషన్లు వదిలేసి మరీ తమకు పట్టు ఉన్న టీఆర్టీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. 20 రోజుల క్రితం సబ్ కమిటీ సమావేశంలో మళ్ళీ టెట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు దీనిపై ప్రకటన రాలేదు.
గుదిబండలా రేషనలైజేషన్
ఎన్నికల ముందే సీఎం చెప్పిన లెక్కల ప్రకారం, ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చిన 9,400 పోస్టులకు అయినా టీఆర్టీ ఇస్తారని 4 లక్షల మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తుంటే ఇప్పుడు ఉన్న పళంగా టీచర్ల రేషనలైజేషన్ చేస్తామని సర్దుబాటు పేరుతో ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన జీఓ 25ని ఇప్పుడు అమలు చేస్తామని చెప్పి టీచర్ పోస్టులు తగ్గించడం దారుణం. విద్యార్థులకు నష్టం జరగకుండా విద్యా వాలంటీర్ల సేవలు తాత్కాలికంగా వినియోగించుకోవచ్చు లేదా టీచర్లతోనే డిప్యూటేషన్ చెప్పించవచ్చు. కానీ క్లియర్ వెకెన్సీ ఉన్న పోస్టులలో టీచర్ల హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని స్కూల్స్‌లో ఉన్న టీచర్లను వేరే స్కూల్‌లోని ఖాళీ పోస్టులలో టీచర్లతో భర్తీ చేస్తూ ఆ ఖాళీ పోస్టులను తొలగిస్తున్నారు. ఇలా చేయడం విద్యా హక్కు చట్టంకి విరుద్ధం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 నుండి 5 వేల ఖాళీలు తగ్గిపోతాయి. గత సంవత్సరం కాలంగా డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు అనేక ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏదో తూతూ మంత్రంగా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ఆలోచన చేయడం సరికాదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు నోరు మెదపడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసారు.. కానీ స్వరాష్ట్రంలో పదేళ్లుగా కేవలం ఒకే ఒక్క టీఆర్టీ వేశారు. అభ్యర్థులు సుప్రీంకోర్టులో కేసు వేస్తే కేవలం 8,792 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. మళ్ళీ గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. అసెంబ్లీలో సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని 4 లక్షల మంది అభ్యర్థులు కోరుతున్నారు. లేదంటే అరకొర పోస్టులను భర్తీ చేయాలని భావిస్తే ఒక్కో జిల్లాల్లో పదుల సంఖ్యలో కూడా ఖాళీలు ఉండవు. దీనివల్ల నిరుద్యోగ యువతకి అటు విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున పాత ఖాళీలకు వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలి.
రావుల రామ్మోహన్ రెడ్డి
డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
93930 59998