- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ప్రాణహిత'కు పుష్కర పండుగ
గోదావరికి ప్రాణహిత అతి పెద్ద ఉప నది. వైన్ గంగ, పెన్ గంగ, వర్ణ అను మూడు నదులు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉద్భవించి, సాత్పురా శ్రేణుల దక్షిణ వాలులో ప్రవహిస్తాయి. అక్కడి 'అస్థి' అనే గ్రామం గుండా పయనించి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడి హెట్టి గ్రామంలో ప్రవేశిస్తాయి. ఈ మూడు నదుల కలయికతో ఇక్కడే 'ప్రాణహిత' ఆవిర్భవిస్తుంది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గుండా ప్రవహించి చివరికి భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, సరస్వతి నదులతో కలిసి 'త్రివేణి సంగమంగా' గా విరాజిల్లుతుంది.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు సకల ప్రాణులకు హితంగా ఉంటాయి. జనం వాటిని వాటిని గౌరవించుకుంటూ, రక్షించుకుంటూ ముందుకు కదులుతారు. దేశంలో పుణ్య స్నానాలకు శ్రేష్టమైన పన్నెండు ముఖ్యమైన నదులలో ప్రాణహిత నది ఒకటి. ఇది తెలంగాణలో పుట్టి ఇక్కడే అంతర్లీనమయ్యే జీవనది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ తుమ్మిడిహెట్టి నుంచి మొదలుకుని ప్రకృతి రమణీయతల మధ్య కాళేశ్వరం వరకు 113 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అక్కడ గోదావరిలో కలిసిపోతుంది. అలాంటి గొప్ప నదికి పుష్కరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొదటి పుష్కరాలు ఇవి. ప్రాణహిత నదిని 'ప్రణీత' నది అని కూడా పిలుస్తారు. సాధారణంగా ప్రతి నదికీ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర ఉత్సవం జరుగుతుంది. మీన రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం వస్తుంది. ఈ ఏడు ఏప్రిల్ 12న రాత్రి మీనంలో బృహస్పతి ప్రవేశించాడు. అందుకే జనులు బుధవారం చైత్ర శుద్ధ ద్వాదశి రోజున ఏప్రిల్ 13 ఉదయం నుంచి పుష్కర స్నానాలను ఆచరించడం మొదలుపెట్టారు. పవిత్ర స్నానాలు చైత్ర బహుళ అష్టమి ఆదివారం ఏప్రిల్ 24 వరకు దాదాపు 12 రోజుల పాటు కొనసాగుతాయి.
త్రివేణి సంగమంగా మారి
గోదావరికి ప్రాణహిత అతి పెద్ద ఉప నది. వైన్ గంగ, పెన్ గంగ, వర్ణ అను మూడు నదులు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉద్భవించి, సాత్పురా శ్రేణుల దక్షిణ వాలులో ప్రవహిస్తాయి. అక్కడి 'అస్థి' అనే గ్రామం గుండా పయనించి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడి హెట్టి గ్రామంలో ప్రవేశిస్తాయి. ఈ మూడు నదుల కలయికతో ఇక్కడే 'ప్రాణహిత' ఆవిర్భవిస్తుంది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గుండా ప్రవహించి చివరికి భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, సరస్వతీ నదులతో కలిసి 'త్రివేణి సంగమంగా' గా విరాజిల్లుతుంది.
ఈ పుష్కరాలకు మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. గత పుష్కరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 సంవత్సరంలో జరిగాయి. అప్పటి ప్రభుత్వం దీనిని 'స్టేట్ ఫెస్టివల్' గా ప్రకటించించింది. ఈ సారి స్వరాష్ట్రంలో జరుగుతున్న పుష్కరాలలో లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గడ్చిరోలి జిల్లా సిరోంచ వద్ద పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్నది. జనం పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు చేయడంతో పాటు నదీ తీరాన ఉన్న 11, 12, శతాబ్దాల కాలం నాటి బ్రహ్మ, విష్ణు, శివాలయాలను దర్శించుకుంటారు.
జటావత్ హనుమ
లెక్చరర్, భూపాలపల్లి
85198 36308