మునుగోడులో బీఎస్పీ ఉనికి చాటుకుంటుందా?

by Ravi |   ( Updated:2022-10-29 18:30:36.0  )
మునుగోడులో బీఎస్పీ ఉనికి చాటుకుంటుందా?
X

తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం మునుగోడు నియోజకవర్గం దగ్గరే ఉంది. రాష్ట్రంలో ఎక్కడా చూసిన అదే టాపిక్ మాట్లాడుతున్నారు. పార్టీలు ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. మరి మునుగోడులో వారి పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికలలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పోటీగా ఉన్నాయి. తర్వాత స్థానంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్‌పీ ఉంది ఈ పార్టీకి ఎక్కువ ఓట్లు పోలవుతాయని అంచనా. ఈ పార్టీకి దళిత, గిరిజన, బహుజనుల ఓట్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బలాబలాలు

ఈ ఎన్నికలలో అటు ప్రధాన పార్టీలన్నీ జోరుగా డబ్బు మద్యం పంచి ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. మునుగోడులో ఎక్కువ బహుజనులు అయిన గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మశాలి, మాదిగ, మాల, ఇలా సబ్బండ వర్గాలు ఉన్నాయి, వీటన్నింటినీ ముందస్తుగానే టీఆర్ఎస్, బీజేపీ తమ వైపునకు తిప్పుకుంటున్నారు. మెజారిటీ కులాలుగా ఉన్న ముదిరాజ్, గౌడ్, యాదవ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, బీఎస్‌పీ ప్రచారంలో కొంచెం వెనుకబడి ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎలాంటి సభలు, సమ్మేళనాలు నిర్వహించలేదనే వాదనా ఉంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఓటు బ్యాంక్ రాజగోపాల్‌తో పాటు బీజేపీకి వెళ్లకుండా ఆపితే కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంటుంది. బీజేపీకి అక్కడ సొంత ఓటింగ్ లేదు. కేవలం రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, మోడీ గ్రాఫ్ కొంతవరకు కలిసివస్తుంది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తన సంప్రదాయ ఓటింగ్ మాత్రమే కాకుండా కమ్యూనిస్టు పార్టీల సానుభూతిపరుల ఓటు బ్యాంకుతో బలంగా ఉన్నట్టు అనిపిస్తోంది.


బొమ్మరగోని కిరణ్ ముదిరాజ్

అడ్వకేట్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

79893 81219

Advertisement

Next Story