- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముట్టడిలో చిన్నారికి.. ఓదార్పు గుసగుసలు
లేదు, మనమిప్పుడు చచ్చిపోవడం లేదు.
నీవు వింటున్న శబ్దాలు
తలుపులు కొడుతున్నట్టున్నాయి
పైకప్పుకు వేసిన వెల్ల పగుళ్ళిస్తోంది.
ఎంతకాలం వీలైతే అంతకాలం
ప్రపంచమాడే నాటకం అది.
ఒంగిపోయి మన గుండె లబ్ డబ్ శబ్దాలను
లెక్కపెట్టుకుంటూ ఉండాలి.
మంచిది, అలాగే..
నీ చేతులు నా గెండెకు ఆనించు
నేను నీ పైన వాలిపోతాను.
చివరికి మనిద్దరిలో ఈ ప్రేమ క్రీడను
ఎవరు ఇష్టపడతారో వారే గెలిచినట్టు.
అవును, అది చివరికి చేరుతుంది.
చేతుల బదులు ఇక్కడే నీ హృదయాన్ని
నా హృదయంపై ఆనించు.
నీ కోసం ఎందుకింత వేగంగా కొట్టుకుంటోంది
అదంతా అంతే.. నువు మళ్ళీ
పుట్టాలని నేను కోరుకుంటున్నాను
ఈ ప్రపంచం లానే.
ఇంట్లో ఉన్నప్పుడు ఉండే నీపాల బుగ్గల్లా
అవేమీ కొత్త కాదు
నేనిక్కడే ఉన్నా, మనం క్షేమంగా ఉన్నాం.
గుర్తుంచుకో నా జున్ను ముక్కా దాక్కో.
మీ అమ్మ ఏ పాటైతే పాడిందో, ఆ పాటే పాడుదాం.
ఆమె ఇప్పటికీ మనతోనే ఉంది.
నిశ్శబ్దంగా ఆపాట నువ్వు పాడి తీరాలి.
ఆమెకాపాటంటే చాలా ఇష్టం.
అదేమీ సాయం చేసేది కాదు.
పాడు.. పాడు..గొంతెత్తి బిగ్గరగా పాడు.
నువ్వు పుట్టినప్పుడు ఎలా ఏడ్చావో
మళ్ళీ ఏడ్చి చూపించు.
అవేమీ సైరన్లు కావు
అవేమీ ఎగిసిపడే మంటలు కావు
నా జున్ను ముక్కా దాక్కో, కళ్ళు మూసుకో .
ఈ క్రీడ అయిపోగానే
నీకు మరొక జీవితం వస్తుంది.
(గాజాపై ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో)
-జోసఫ్ ఫాస్నో
అనువాదం
రాఘవ శర్మ
94932 26180