మైనర్ల మేజర్ మిస్టేక్స్!

by Ravi |   ( Updated:2024-11-16 00:30:21.0  )
మైనర్ల మేజర్ మిస్టేక్స్!
X

ఒక దశాబ్దకాలం ముందర అత్యాచారాలు, దొంగతనాలు, ర్యాగింగ్ లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో మేజర్లే ఉండేవా రు. కానీ గత ఐదారు సంవత్సరాలుగా ఇటు వంటి ఘటనలకు పాల్పడుతున్నవారిలో పదిహేను నుండి పద్దెనిమిది ఏళ్లలోపు వారు (మైనర్లు) ఎక్కువగా ఉంటున్నారు. మైనర్లు ఎక్కువగా ఎటువంటి తప్పులు చేస్తు న్నారు? అందుకు కారణం ఏమిటి? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?

మేజర్ మిస్టేక్స్..

మైనర్లు ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా చేసే అల్లరి పరవాలేదు. కానీ శృతిమించిన అల్లరి ప్రమాదకరం. అబ్బాయిలు, స్నేహభావంతో ఉండాల్సిన సహచర ఆడపిల్లలను టీజ్ చేస్తున్నారు. తోటి విద్యార్థులతో గొడవలు పడుతున్నారు. చదువుకు ప్రాధా న్యత ఇవ్వకుండా ఫ్యాషన్, స్టైల్, వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇవి చూడడానికి చిన్న విషయాలుగా కనిపించవచ్చు. కానీ ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మైనర్లు సరదాగా మొదలు పెట్టిన ధూమపానం, మద్యపానం వ్యవసానాలుగా మారుతున్నాయి. వీటితో పాటు ప్రమాదకరమైన గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తుమందులుకు అలవాటు పడుతున్నా రు. అక్కడితో ఆగకుండా వీటిని విక్రయించడం, సరఫరా చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్య మాల్లో రీల్స్, స్టేటస్‌లు అంటూ పేరు రావడం కోసం ప్రమాదకరమైన విన్యా సాలు చేస్తు న్నారు. పదేపదే లైక్‌లు, షేర్లు ఎంతమంది చేశారో అంటూ నిత్యం అదే పనిగా మొబైల్ చూస్తున్నారు. చూడకూడని పోర్న్ సైట్లు వీక్షిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్లో గేమిం గ్, బెట్టింగ్‌కు అలవాటు పడి పెట్టుబడి కోసం ఆన్లైన్‌లో రుణాలు తీసుకు ని అవి తీర్చలేక, తల్లిదండ్రులతో చెప్ప లేక రుణాలిచ్చేవారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మై నర్లకు డ్రైవింగ్ లైసెన్స్‌ మంజూరు చేయ దు. కానీ వీరు బైకులను వేగంగా నడు పుతూ ప్రమాదాలకి గురవుతున్నారు. వారి వలన ఇతరులు ప్రమాదాలకు గురవుతున్నారు.

పరిష్కారాలు..

మనం అవునన్నా కాదన్నా యువతలో కొందరు చేస్తున్న ఆకృత్యాలకు బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు మూడు ఉన్నాయి. అవి కుటుంబం, సమాజం, పాఠశాల. మైనర్లపై మూడింటి ప్రభావం ఎక్కువ. కుటుంబాలలో తల్లిదండ్రులు వారి మైనర్ పిల్లలకు అనవసరంగా మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు. అవసరార్థం ఇచ్చినా కూడా వారిపై నిఘావేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్ వాహనాలను నడపనీయరాదు. ఏది మంచో ఏది చెడో ఇంట్లో పెద్దలు చెప్పాలి. సమాజంలో పౌరులు ఎవరు ఎలాపోతే మాకేంటి అనే ధోరణి విడనాడాలి. పిల్లల తల్లిదండ్రుల దృష్టికి పిల్లల చేస్తున్న తప్పులను తీసుకువెళ్లాలి. సినీ నిర్మాతలు, దర్శకులు అశ్లీల చిత్రాలను తీయకూడదు. సమాజం ప్రోత్సహించకూడదు. యూట్యూబ్‌లలో వచ్చే చిత్రాలపై కూడా సెన్సార్ ఉండాలి. ఇక ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. కానీ ర్యాంకులకే పరిమితమైన ప్రైవేటు పాఠశాలలు ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ అంటూ కేవలం గణితం, సైన్స్ సబ్జెక్స్‌ మీదనే బోధన కొనసాగిస్తున్నారు. నైతిక విలువలను బోధించడం లేదు. ఇక్కడ కూడా విలువలు నేర్పే ఇతర పాఠ్యాంశాల మీద కూడా శ్రద్ధ వహించాలి. అప్పుడే మంచి సమాజాన్ని తయారు చేయగలం.

డీ జే మోహన రావు

94404 85824

Advertisement

Next Story

Most Viewed