- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి అక్కినేని హీరోతో రొమాన్స్ చేయబోతున్న బుట్టబొమ్మ..? థ్రిల్లింగ్ సస్పెన్స్ అంటూ వచ్చేస్తున్నారోచ్..
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగ చైతన్య, పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ జంటగా ‘ఒక లైలా కోసం’ అనే మూవీలో నటించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు త్వరలోనే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ దండు ఇప్పుడు తెరకెక్కించనున్న ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలో నాగ చైతన్య నటించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డేను మేకర్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. దీంతో వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ సెట్ కానున్నదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే చైతన్య, పూజ కాంబో ఫిక్స్ అవుతోందో లేదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక బుట్ట బొమ్మ విషయానికి వస్తే దాదాపు ఏడాదిగా సినిమాలకు దూరం ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం 5 వరుస చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.