మన కోసం మరణించిన త్యాగమూర్తి

by Ravi |   ( Updated:2024-12-25 00:30:51.0  )
మన కోసం మరణించిన త్యాగమూర్తి
X

దైవం మానుష రూపేణా’ అంటారు పెద్దలు. దేవుడు ఎక్కడి నుంచో దిగిరాడు. మన మధ్యే ఉంటాడు. మనిషిలాగే ఉంటాడు. పక్కవాళ్లకు తన ఆనందాన్ని పంచి ఇచ్చి, బాధలో ఉన్నప్పుడు సాయమందిస్తే వాళ్లే దేవుళ్లు. ‘పరోపకారం కోసం పరలోకం నుంచి వచ్చి సహనంతో శాంతి, ప్రేమ, కరుణతత్వాన్ని బోధించిన బోధకుడు, శాంతిదూత. క్రైస్తవం మతం కాదు క్రమశిక్షణతో సాగించె మానవ జీవన విధానం. ఆ విధానాన్ని అనుసరిస్తూ ఆయన బోధనలు ఆచరిస్తూ ప్రపంచం నలుమూలలా క్రీస్తును స్తుతిస్తూ ఆ మహనీయుని జన్మదినోత్సవాన్ని మహోత్సవంగా మానవాళి జరుపుకుంటున్న తరుణం క్రిస్మస్. తెలుగు చలన చిత్ర రంగ దర్శకులు, గేయ రచయితలు యేసు క్రీస్తు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించారు ఆ మహనీయుని స్తోత్ర గీతాలతో స్తుతించారు ఆ చలన చిత్రాలని సినీ గీతాలని ఒక్క సారి పరిశీలించి అందులోని ప్రభోదాత్మక పరిమళంతో మనస్సుని పరిశుద్ద అత్మాలయంగా మార్చుకుందాం.

పింగళి పాళీ... కరుణాక్షరఝరి

'మిస్సమ్మ' చిత్రంలో సందర్బోచితంగా కరుణించు మేరీ మాత .. పింగళి నాగేంద్రరావు కలం నుంచి జాలువారిన . “కరుణించు మేరిమాత శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత పరి శుద్ధాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష తుదిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు క్షణమైనా శాంతిలేదే దినదినము శోధనాయే “పింగళి పాళీ నుంచి జాలువారిన కరుణాక్షరఝరి. తుది లేని దారుల వెంట గమ్యాన్ని చేరుకోలేము, కరుణామయుని మార్గ దర్శకత్వంలో గమ్యాన్ని చేరుకుంటాం.

ముళ్ల కిరీటాన్ని మణి కిరీటంగా భావించి

యేసు, ముళ్ళ కిరీటాన్ని మణి కిరీటంగా భావించి తనని శిక్షిస్తున్న వారిని క్షమించమన్న త్యాగమూర్తి. తాను నమ్మిన విలువల కోసం శిలువ నెక్కి మనకోసం మరణించి మళ్ళీ మన కోసం ఈ లోకానికి రక్షకుడైనిలిచిన నీవు మానవ చరితకు చరిత్రకు శకపురుషుడివై వెలుగును పంచె వేగుచుక్కవే. దైవకుమారుడివై నీవు బోధించిన బోధనలు శాంతిని ప్రేమని త్యాగాన్ని మాలో నింపాలి. కాంతి వంతమైన ఆ కరుణా కాంతులే క్రిస్మస్ పండగ.

(నేడు క్రిస్మస్ వేడుకల సందర్భంగా)

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story

Most Viewed