- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బలవంతుడిదే రాజ్యం.. తలొంచిన కమల..
"తమది ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా తమకు తామే కితాబు ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పు కొనే అమెరికాలో, ఇప్పటివరకు ఒక మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోలేని దుస్థితి. దీనినే మనం "పేరు గొప్ప ఊరుదిబ్బ" అంటాం. మంచి విద్యార్హతలు, విశేషమైన పరిపాలనా అనుభవం. దేశానికి ఉపాధ్యక్షురాలిగా విశేష సేవలు చేసి ప్రశంసలు పొందిన మహిళ కమలా హారిస్ ఓటమి చెందడం ఆశ్చర్యం.
దాదాపు అన్ని ప్రీపోల్ సర్వేలు ఆమె ఈ సారి అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయం అంటూ ఊదరగొట్టాయి. ముఖాముఖి వాగ్ధాటిలో కూడా ట్రంప్‌ను కమలా హ్యారిస్ నిలవరించింది. మంచి వక్తగా పలువురి మన్ననలు పొందింది. అయినా ఇలా ఎందుకు జరిగింది? లోపం ఎక్కడుంది? కమలా హారిస్ ఓటమి అనేక ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాజకీయ నాయకత్వంలో లింగ సమానత్వానికి అమెరికాలో చోటు లేదా? అత్యున్నత అధ్యక్ష పదవికి మహిళలు పనికిరారా? గొప్ప ప్రజాస్వామిక దేశంలో రాజకీయ రంగంలో మహిళల ఎదుగుదలకు అడ్డంకులేమిటి?
ఇదేం ప్రజాస్వామ్యం!
అమెరికాలో మహిళలు 20వ శతాబ్దం ప్రారం భంలో రాజకీయ ప్రాతినిధ్యానికి పోరాటం చేశా రు. 1920లో రాజ్యాంగానికి 19వ సవరణను ఆమోదించడం ద్వారా మహిళలకు ఓటు హక్కు కల్పించబడింది. అయితే, సుమారు శతాబ్దం పాటు రాజకీయ కార్యాలయాలలో మహిళలకు ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉంది. 2023 నాటికి, మహిళలకు కాంగ్రెస్ స్థానాలలో కేవలం 28 శాతం మాత్రమే అవకాశం దక్కింది. జనా భాలో (సుమారు 50.5%) మహిళలు ఉన్నా .. పార్టీలలో అధికార పదవులకు మహిళలకు ఇవ్వడానికి అమెరికా సమాజం ముందుకు రాలేదు. పార్టీ నాయకత్వంలో, ప్రభుత్వ పదవుల్లో మహిళలకు గుర్తింపు లేదు. ఇది మహిళల పట్ల అమెరికా వ్యవస్థ చూపుతున్న వివక్ష కాదా! ఇదేం ప్రజా స్వామ్యం. ఇదేమి అగ్రరాజ్య లక్షణం? మొదటి సారి మహిళా అధ్యక్షురాలిగా 1972లో డెమొక్రాటిక్ నామినేషన్ కోసం ఒక మహిళ పోటీ చేసినప్పుడు ఈ చర్చ ముందుకు వచ్చింది. అప్పటి నుండి, హిల్లరీ క్లింటన్, ఎలిజబెత్ వారెన్ వంటి ప్రముఖ వ్యక్తులు అధ్యక్షత్వాన్ని కోరారు. కానీ ఎవరికీ ఈ అధ్యక్ష పీఠం దక్కలేదు. 2016లో క్లింటన్ అభ్యర్థన ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచింది. ఆమె ప్రజా ఓటును గెలిచినా, ఎలక్ట్రోరల్ కాలేజీలో ఓడిపోయింది. ఇది కేవలం ఓటరు మద్దతుకు మించి ఉన్న వ్యవస్థాపక సవాల్‌గా అక్కడ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం అలా ఉంది.
ట్రంప్‌పై అనేక అభియోగాలు..
కమలా హారిస్‌తో పోలిస్తే ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి సరితూగుతాడా!? నిజానికి కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ ఎందులో గొప్ప? ఆయన బడా వ్యాపారవేత్త. కానీ వ్యాపారంలో నిజాయితీ లేదు. అత్యధిక ధనవంతుడు. అయినా ప్రభుత్వానికి ట్యాక్సులు ఎగ్గొడతాడు. ట్రంప్ వ్యక్తిగతంగా నిజాయితీ లేని స్త్రీలోలుడు. అనేక లైంగిక కేసులు తన పైన ఉన్నాయి. అమెరికాలో పలు కోర్టులలో అనేక ఆర్థిక నేరాల్లో నిందితుడు. వ్యాపారంలో మోసపు ఎత్తుగడలు వేయడం ఆయనకు హాబీ. వ్యాపార లెక్కలు అంతా ఫేకే. ట్యాక్సుల ఉల్లంఘన, ఎగవేతలూ మామూలే. తన క్రింద పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపు కేసులు ఉన్నాయి. లంచాలు ఇచ్చి కేసులు లేకుండా చేసుకోవటంలో దిట్ట. అనేక సార్లు ట్రంప్ ప్రవర్తనపై కోర్టు మొట్టికాయలు వేసింది. ఎన్నికల్లో తన ప్రత్యర్థులను గౌరవించడు. మహిళ అని మొహం కూడా చూడకుండా దూషణలు చేశారు. కమలా హారిస్ రంగును హేళన చేశాడు., ఆమె డ్రస్‌పై కూడా కామెంట్ చేశాడు.. తన ఆకారం అందం చూసుకోడు గానీ ఇతర మహిళలపై బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తాడు. ఒకరకంగా మహిళలను గౌరవించని సంస్కార హీనుడు ట్రంప్.
అమెరికాలో వ్యవస్థాపక అడ్డంకులు..
అమెరికాలో మహిళల ప్రాతినిధ్యానికి అనేక వ్యవస్థాపక అడ్డంకులు ఉన్నాయి. ఎన్నికల మార్గదర్శకత్వం లేదు. మహిళా పార్టీల నిర్మాణాలు తక్కువ. స్థాపిత రాజకీయ నెట్‌వర్క్‌ల నుండి మద్దతు లభించలేదు. పార్టీలో, ప్రభుత్వంలో మహిళా నాయకుల కొరత కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ప్రచార నిధులు పెద్ద అడ్డంకి. అమెరికా రాజకీయ ప్రచా రాలు ఖరీదైనవి. మహిళలకు తమ పురుష సహచరుల కంటే ఫండింగ్ వనరులు చాలా తక్కువ లభించాయి. అమెరికా పేరుకే అగ్రరాజ్యం. అక్కడ మహిళల లైంగిక వేధింపులు తక్కువ కాదు. వ్యభిచారం, డ్రగ్, గన్ కల్చర్ ఎక్కువ. నల్లవారి పట్ల జాతి వివక్షత ఇప్పటికీ కొనసాగుతోంది. సామాజిక, ఆర్థిక రాజకీయాలలో మహిళలు బాగా వెనుకబడి ఉన్నారు. భారతీయుల ప్రతిభ అంటే గిట్టదు. వారి వివాహ వ్యవస్థ విడాకులు లేకుండా దీర్ఘకాలం దాంపత్య జీవితం గడపగలగడంపై వారికి అసూయ. భారతీయులు తమ సంపాదనను పొదుపుగా వాడటంపై స్థానిక అమెరికా ప్రజలకు ఈర్ష. అందుకే భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ ఓటమికి అనేక కారణాలలో ఇవి కూడా తోడ్పడ్డాయి.
ట్రంప్ ఉద్ధరిస్తాడనటం భ్రమే!
అమెరికాలో ఒక మహిళా అధ్యక్షురాలిగా కమలా హారిస్ ఓడినా...ట్రంప్ గెలిచినా, అమెరికా గొప్పతనం ఇకముందు కూడా వెలిగి పోతుంది అనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమే. ట్రంప్ అమెరికాను ఉద్ధరిస్తాడు అనుకోవడం భ్రమే. ఎందు కంటే... ఆర్ధికంగా అమెరికా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అనేక కంపెనీలు, బ్యాంకులు దివాలా తీశాయి. చైనా ఉత్పత్తులతో పోటీపడే పరిస్థితి లేదు. అమెరికా డాలర్ వన్నె తగ్గింది. అనేక మందికి కొవిడ్ తర్వాత ఉద్యోగాలు రోజుకు వేల సంఖ్యలో ఊడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనంతో యూరప్ సంబంధాలు కూడా అంతంత మాత్రమే. ఇతర దేశాలకు అమెరికా పరిశ్రమలు వలస పోతున్నాయి. రష్యా, చైనా, ఇండియా నార్త్ కొరియా, జపాన్ బంధాలు బలపడుతున్నాయి. పాలస్తీనా సమస్య తీరకపోవడానికి అమెరికా ఏకపక్ష స్వార్థ ప్రయోజనాలే కారణం. ట్రంప్ వల్ల నెతన్యాహు యుద్ధంలో మరింతగా రెచ్చిపోనున్నాడు. ట్రంప్ ఇజ్రాయిల్‌కి మొదటి నుండి మద్దతు పలుకుతుంది. యుద్ధం ట్రంప్ వల్ల మరింతగా గల్ఫ్‌కు పాకి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా...? రాబోయే కాలమే తీర్పు చెబుతుంది.
డా. కిషోర్ ప్రసాద్
98493 28496