పారిశ్రామికాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా

by Ravi |
పారిశ్రామికాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా
X

ఇటీవల వైజాగ్‌లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌లో భాగంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల‌పై ప్రభుత్వం చేసిన ప్రకటన అంకెల గారడీనా లేక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేల కోట్లు పెట్టుబడులు తెచ్చాము అన్న గొప్పలు చెప్పుకోవడానికా అని సందేహం కలుగుతోంది.

ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది, అయితే అందులో 2024 ఎన్నికల ముందు గ్రౌండ్‌ అయ్యే పరిశ్రమలు అందులో ఎన్ని? వాటిలో పెట్టుబడులు ఎంత? ఉపాధి ఎంత? పరిశ్రమలను ఎక్కడ నెలకొల్పుతారు అనే విషయాలను ప్రభుత్వం ఎక్కడా కూడా స్పష్టం చేయలేదు..

ఒప్పందాల్లో గ్రీన్‌ హైడ్రో ప్రాజెక్టులు రూ.8.5 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టులను ఇంతవరకు ఎక్కడైనా మన దేశంలో ప్రారంభించారా? కనీసం డీపీఆర్‌ ఉందా? ఎన్ని సంవత్సరాలకు ఆ డీపీఆర్‌ వస్తుందో చెప్పగలరా? ప్రభుత్వం దీనిపై సమగ్రమైన వివరాలు వెల్లడించాలి..

అంబానీ పవర్‌ ప్రాజెక్టు కోసం 15 సంవత్సరాల క్రితం కృష్ణపట్నం వద్ద కేటాయించిన ఐదు వేల ఎకరాల్లోనూ, అదానీకి రుషికొండ వద్ద పది మెగావాట్ల డేటా సెంటర్‌కు కేటాయించిన 280 ఎకరాల్లోనూ నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం వీటిపై కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మేకల రవి కుమార్

82474 79824

Also Read..

గోగువనం పువ్వులు


Next Story

Most Viewed