- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అపర కుబేరుల సంపద అందరిదీనా?
ఆర్థిక అభివృద్ధి అందరికీ సంబంధించినదిగా ఉండాలని, అది మానవ అభివృద్ధిగా ఉండాలని మహాత్మా గాంధీ అభిప్రాయం. నేడు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధి కొందరిదిగానే ఉంటూ ఆయా దేశాల్లో ఉన్న వనరులను అప్పనంగా పాలకుల నుంచి పెట్టుబడిదారులు పొందుతూ మిలియనీర్లు బిలినియర్లుగా మారుతూ అరకొర ఉద్యోగ అవకాశాలు కల్పించి అశేష ప్రజానీకాన్ని పేదరికంలో ఉంచుతూ జరిగే వృద్ధి ప్రక్రియ ఎవరికి ఉపయోగమో..? పాలకులు గమనించాలి. ఎకనామిక్ సర్వే నివేదిక ప్రకారం, మన దేశంలో 78.5 లక్షల ఉద్యోగాలు 2030 వరకు ప్రతి సంవత్సరం వ్యవసాయేతర రంగాలలో కల్పించాల్సి ఉంటుంది. ఇంత మేర ఉద్యోగ కల్పన మన అపర కుబేరులు కల్పించగలరా?
భారతదేశంలో కుబేరుల సంపద ట్రిలియన్ డాలర్లకు చేరింది కాబట్టి కుబేరుల సంపద అంతా దేశానికి చెందిన సంపదగా భావిం చాలా? వీరి సంపద ప్రజల ఆస్తిగా భావించి సంతోషించాలనే ఆలోచన కలగడం సహజం. ప్రపంచంలో బిలియనీర్ల సంపద అంతా వారి వారి వ్యక్తిగత సంపద అయినప్పుడు అది దేశ ప్రజల ఆస్తిగా ఎలా భావించగలం?
ఈ సొమ్ము వ్యవస్థను బలోపేతం చేస్తుందా?
వివిధ వ్యాపారాల ద్వారా, సంస్థల ద్వారా ప్రపంచ కుబేరులు కొంత మేరకు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తున్నట్టుగా చెప్పలేం. అపర కుబేరులు సంపదంతా న్యాయబద్ధమైన సంపదగా కూడా ప్రజలు భావించడం లేదు. అవినీతి వలన సంపాదించిన ధనమంతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయగలవా? భారతదేశంలో కూడా బిలియనీర్ల సంఖ్య 334 చేరింది వీరి మొత్తం సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అవినీతిపై అంతర్జాతీయ స్థాయిలో పోరాడాలని ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరపాలని నిర్ణయించింది.
ఆస్తుల ప్రైవేటీకరణ అవినీతే...
ప్రపంచ బ్యాంకు ప్రకారం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం అవినీతి అవుతుంది. ధనికుల నుంచి వచ్చే పన్నులను తగ్గించి వారికి రాయితీలను ఇవ్వడం వలన ప్రభుత్వ ఆదాయం తగ్గి ప్రజా సేవలో పెట్టే ఖర్చు తగ్గేదిగా చేయడం కూడా అవినీతే. ఆర్థిక అభివృద్ధిలో నిరుపేదలు మమేకం కాలేక అటువంటి వనరులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వలన ఆదాయ అసమానతలు పెరిగి పేదలు నిరుపేదలుగా మారుతున్న ముఖచిత్రమే అవినీతి. ఇక్కడ అవినీతిలో ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరూ బాగుపడుతున్నారు. మధ్యలో చెడిపోయేది పేదోడే. ఆర్థిక అభివృద్ధికి ఈ దోపిడీ పెద్ద అవరోధంగా ఉన్నది. ప్రజలందరికీ ఆ వృద్ధి ఫలాలు అందవు.. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అవినీతి ఒక అవరోధంగా ఉంది. ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి.
బ్యాంకులను కూడా నియంత్రిస్తే..
ధనవంతులు రాజకీయాలను నిర్ణయించడమే కాకుండా బ్యాంకులను నియంత్రించడం ఉత్పత్తి కార్యక్రమాలను నియంత్రించడం వలన డెమో క్రసీ ఫ్లూటోగ్రఫీగా మారి ప్రజలను నిరుపేదలు గా ఉంచుతున్నారు. అవినీతి అంటే అధికారం లో నిజాయితీ లేనితనం. అవినీతి అవగాహన సూచిక 2021లో 180 దేశాలను మన దేశం 85వస్థానంలో ఉందంటే ఆశ్చర్యమేస్తుంది. దీని వల్ల ప్రజల ఆర్థిక అభివృద్ధి పనులలో మమే కం కాలేక ఉచితల కోసం ఎగబడుతున్నారు. అవినీతికి పేదరికానికి అవినాభావ సంబంధం ఉందని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఆర్థిక అభివృద్ధి జరిగి పేదరికం తొలగిపోయే సమయంలో అవినీతి అడ్డంగా ఉండడంతో వృద్ధి ఫలాలు పేదలకు అందకుండా పోతు న్నాయి. ప్రజల సొమ్ము అవినీతి సొమ్ముగా మారిపోతున్నది.
అక్రమ మార్గాలు సక్రమమైతే...
ఈ అక్రమ సంపాదనతో ఆదాయ అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అభివృద్ధి మార్గాలు మూసుకుపోతున్నాయి. వనరుల ఉపయోగంలో అసమర్థత ఏర్పడుతుంది. నైపుణ్యం తగ్గి మార్కెట్లో నిర్వీర్యం అవుతున్నాయి. ఫలితం గా జాతీయ ఆర్థిక అభివృద్ధికి ముప్పు ఏర్పడుతున్నది. పన్ను ఎగవేతల వలన లక్షల కోట్లను ధని కులు స్వాహా చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యంవలన కోటాను కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. విద్యుత్ శక్తి రంగంలో 50 శాతం ఆదాయం అవినీతిలో రాకుండా పోతున్నది. మన దేశంలో ప్రజలకు అందవలసిన సదుపాయాల శాతం అవినీతి రూపేనా దోచబడుతున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా. అవినీతికి, పేదరికానికి అవినాభావ సంబంధం ఉన్నదని అందువలన యువత అక్రమ మార్గాలే మంచివిగా భావించి డబ్బు సంపాదనకు దిగుతూ చేయరాని పనులు చేస్తూ సమాజాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. మినిస్టర్స్, బ్యూరోక్రాట్స్ అనేక స్కామ్‌లలో ఇరుక్కుని వేల కోట్ల ప్రజాధనాన్ని వనరులను చేజిక్కించుకొని రాత్రికి రాత్రే కుబేరుల జాబితాలో చేరుతున్నారు.
జీడీపీ ఎవరి జేబుల్లోకి చేరుతోంది?
నూతన ఆర్థిక విధానాలు 1991లో చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతం పుంజుకుంది. సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాన్ని విరుద్ధంగా దేశ పాలకులు 1991లో ఆర్థిక సంస్కరణ పత్రాలపై సంతకాలు చేయడం వలన విదేశీ పెట్టుబడులు ప్రత్యక్షంగా దేశంలోకి ప్రవేశించాయి. ఫలితం గా 1995లో ఇద్దరే ఇద్దరు బిలియనీర్లు దేశం లో ఉండగా నేడు 334 పెరిగారు. వీరేమన్నా దేశంలో ఉద్యోగాలు కల్పించి ప్రజల ఆదాయా లు పెంచి పేదరికం తొలగించి తద్వారా జీడీపీని పెంచి ప్రపంచ జీడీపీలో మన దేశం వాటాను పెంచుకొని ప్రపంచ కుబేరులు సరసన నిలిచా రా? అంటే అదీ లేదు. 1991లో ప్రపంచ జీడీపీ లో మన వాటా కేవలం ఒకే ఒక శాతం ఉండగా నేడు నాలుగో లేదా ఐదు శాతానికి పెరిగింది. మరి ఈ పెరిగిన జీడీపీ ఎవరు జేబులోకి పోతోంది? ప్రపంచ పేదల్లో 1/4 వంతు పేదలు మనదేశంలోనే ఉన్నారు. అవినీతిపరమైన భారతీయులు కొందరు స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకున్నారని 2015-16 లో ఆ బ్యాంకు అధికారులు ఒప్పుకున్నారు. మన ప్రధానమంత్రి కూడా ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షలు డిపాజిట్ చేస్తానని కూడా వాగ్దానం చేశారు. ప్రతి రూపాయిని వెనక్కి తెస్తామని ఆనాడు మోడీ అన్నారు. ఇంత మొత్తాన్ని తీసుకొచ్చి దేశాభివృద్ధికి ఉపయోగించి ఉంటే, మన దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.
డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
98663 22172