- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే చోట ఓటు ఉండేలా చేస్తేనే..
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఓటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. సికింద్రాబాద్ మరియు హైదరాబాదులోని నియోజకవర్గాల్లో యాభై శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు. మల్కాజ్‌గిరి, చేవెళ్లలో మాత్రం 50 శాతం దాటింది.
గ్రేటర్ పరిధిలో ఏ ఎన్నికలు జరిగిన పోలింగ్ శాతం తగ్గుతూనే వస్తున్నది. ప్రతిసారి ఎన్నికలకు ముందు పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా.. సిటీ ఓటర్లు ఓటింగ్‌పై ఆసక్తి చూపడం లేదు. సిటీ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల తోటి, జిల్లా అధికారులతో సమావేశాలు, ప్రైవేటు కంపెనీల యాజమానులతో చర్చలు జరిపి అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా అందరికి వేతనంతో కూడా సెలవుగా ప్రకటించింది. పైగా నూతన ఓటర్లు ఈ సారి రాష్ట్రంలో పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు దీంతో ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి.
విద్యావంతులైన ఓటర్లు దూరం
నిజానికి సిటీ పరిధిలో విద్యావంతులైన ఓటర్లే ఎక్కువగా ఉంటారు. మనం ఒక్కరం ఓటు వేయకపోతే జరిగేదేముంది అన్నట్టుగా వీరు పోలింగ్ రోజున బూత్‌లకు రావడానికి అనాసక్తి చూపిస్తున్నారు. అయితే, మల్కాజ్‌గిరి, మేడ్చల్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండటం, వారు వారికి అక్కడ ఇక్కడ ఓటు హక్కు ఉండటం, ఈ సారి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగడం కొంత పోలింగ్ తగ్గడానికి కారణాలుగా విశ్లేషించుకోవచ్చు.
అదేవిధంగా హైదరాబాద్ పరిధిలోని బహదూర్ పుర, చంద్రయాన్‌గుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, మలక్ పేట, యాకుత్‌పురాలలో చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. పాతబస్తీ ప్రాంతంలో ఎన్ని ఓటర్ చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన ఓటర్ల తీరులో మార్పు రావడం లేదు. ఇక్కడి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. వీటన్నింటికి తోడు ఓటరు జాబితాలో గందరగోళం, ఒక కుటుంబంలోని ఓట్లు వేర్వేరు బూతులలో ఉండడం. ఓటు వేసేందుకు ఎపిక్ కార్డుతో వచ్చిన ఓటు లేకపోవడం, పోలింగ్ స్లిప్పులు కొన్నిచోట్ల అందకపోవడం వంటివి కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు.
ప్రజలే ప్రభువులు
మనం వేసే ఓటు అయిదు సంవత్సరాల భవిష్యత్తు అనే విషయం మర్చిపోరాదు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిపోతే భవిష్యత్తులో ఓటు తప్పనిసరి చేసే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా ఇప్పటికే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో 'ప్రజలే ప్రభువులు' వారికి అధికారాన్ని ఇచ్చేది ఓటు హక్కు. దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషన్ సైతం వారాంతపు సెలవుల తర్వాత కాకుండా పనిదినాల్లో వారం మధ్యలో పెడితే యువత పోలింగ్ రోజు ఓటుకు వచ్చే అవకాశం కలదు. దీంతో పాటు ప్రతి మనిషికి ఒకటే ఆధార్ కార్డు లాగా దేశం మొత్తంలో ఎక్కడైనా ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలి. చాలామందికి సిటీకి వలస వచ్చి ఇక్కడ, గ్రామాల్లో సంక్షేమ పథకాలు కట్ అవుతాయని అక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు. పోలింగ్ సమయంలో వారు గ్రామాల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపుతుండటంతో.. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం అవుతుంది. దీనిని ఎన్నికల కమిషన్ సీరియస్ అంశంగా తీసుకుని వచ్చే ఎన్నికల నాటికి ఒకే ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలి..!
పుల్లూరు వేణుగోపాల్
9701047002