ఇదీ సంగతి: అధికారమే అబద్ధం అడుతుందా?

by Ravi |   ( Updated:2022-12-16 02:18:32.0  )
ఇదీ సంగతి: అధికారమే అబద్ధం అడుతుందా?
X

దాదాపు 20 లక్షల హెక్టార్లలో వివిధ కారణాలతో వివిధ పంట నష్టాలు జరిగాయి. అందుకే ఉత్పత్తి తగ్గింది. ఊర్లకు ఊర్లే ఎలాంటి పనులు లేక ఇబ్బందులను ఎదురుకుంటున్నాయి. నీతి ఆయోగ్ ఈ పేదరికం, పనులు లేని పరిస్థితిని లెక్కలు చేసి మరీ తెలుపుతున్నది. పవర్ లెస్, స్పైన్ లెస్ పరిస్థితి ఉంది. మొత్తం దేశ సంపదను కార్పొరేట్‌లకు అప్పజెప్పి 'వారి మోచేతి నీళ్లు తాగండి' అని దేశ ప్రజలను వదిలేసే పరిస్థితికి పాలకులు తెస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అతి చౌకకు కార్పొరేట్‌లకు ధారాదత్తం చేసి, ఎన్నికలు, అధికారం చెలాయించడం ఒక్కటే అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు. టాక్స్‌లు, జీఎస్‌టీలు, ధరలు పెంచుతూ పోతారు. బ్యాంకుల్లో ఋణానికి వడ్డీ పెంచుతారు. డిపాజిట్‌లకు వడ్డీ తగ్గిస్తారు. టాక్స్ పేయర్ల సొమ్ముతో పొలిటీషియన్ ఎంజాయ్ చేస్తాడు. ఆస్తులు పెంచుకుంటారు. ఇదే దేశంలో పాలకుల నీతి. అదే రాజకీయ నీతి. అబద్ధాలు చెబుతూనే ఉంటారు. అది పార్లమెంట్‌లో అయినా, పబ్లిక్ లో అయినా అంతే! ఇట్స్ ఏ మైండ్ గేమ్! పవర్ గేయిన్ గేమ్!

ధికారంలో ఉన్నవారు బయట పబ్లిక్‌లో, పార్లమెంట్‌లో అబద్ధం ఆడితే ఏమి చేయగలం? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిదేండ్లలో మూడు వేల దాకా చట్టాలను రద్దు చేసారు. కొత్త చట్టాలను, కార్పొరేట్లకు ఉపయోగపడే చట్టాలను తెచ్చారు. దేశం కోసం చేసిన అప్పుల విషయంలోగానీ, బ్యాంకు రుణాల అంశంలోగానీ, కార్పొరేట్లకు అప్పుల మాఫీ గురించిగానీ, ఎన్‌పీ‌ఏ(NPA), జీఎస్‌టీ(GST), అధిక ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, దేశంలో పేదరికం, అసమానతలు పెరుగుతున్న విషయం అయితేనేమీ, లెక్కలన్నీ తప్పే చెప్పడం వారికి ఆనవాయితీగా మారింది. ప్రభుత్వం మీద విద్వేషంతో, ప్రజల ఆదరణ చూడలేక విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పీఎం మోడీ(modi) బయట మీటింగ్‌లలో, ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో(finance minister) చెబుతారు. నేల మీది నిజానికి, వాస్తవానికి విరుద్ధంగా చెబుతారు. విపక్ష నేతలను అవహేళన చేస్తారు.

రెండు వేల రూపాయల నోటు కనిపించక పోవడం మీద రాజ్యసభలో స్వయంగా అధికార బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ(susheel modi) దానిని దశలవారీగా రద్దు చేయాలని మాట్లాడుతారు. నోట్ల రద్దుతో నల్లధనం వెలికి రావడం లేదు. అది పెట్టుబడిదారులకే ఉపయోగకరంగా మారింది. పది లక్షల కోట్ల దాకా ఈ కొత్త నోట్లు కనిపించడం లేదు. నకిలీ నోట్ల చెలామణి పెరిగిందని అపుడపుడు పట్టుబడుతున్న నకిలీ కరెన్సీని బట్టి స్పష్టం అవుతున్నది. టెర్రరిస్ట్ యాక్టివిటీకి రెండు వేల రూపాయల రూపాయల నోట్లు ఉపయోగ పడుతున్నాయని, ఫండింగ్ అవుతున్నాయని అధికార ఎంపీ పేర్కొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావీద్ అలీ(javid ali) అంటారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా అంతా సవ్యంగానే ఉందంటారు ఆర్థిక మంత్రి.

నిజానికి ఇది ఒక సవాల్

సుశీల్ మోడీ లేవనెత్తిన ఈ రెండు వేల రూపాయల నోటు సర్క్యూలేషన్ నుంచి మాయం అయిపోయిన అంశం అంతర్గతంగా ఒక సవాల్‌గా మారింది. 2016లో నోట్ల రద్దు ఏకపక్షంగా జరిగింది. అప్పుడు పీఎం మోడీ దీని మీద సవాల్ చేసారు. నల్లధనం(black money) వెలికి తీసి ఒక్కొక్కరి పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేసే హామీ ఇచ్చారు. ఇప్పుడు అది పచ్చి అబద్ధం అని తేలిపోయింది. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అబద్ధం అని స్పష్టం అయిపోయింది. డాలర్‌తో పోల్చితే మన రూపాయి విలువ 66 ఉంటేనే లబోదిబో అంటూ 'దేశం ఆర్థిక వ్యవస్థ ఖతం అయిందన్న' పీఎం నరేంద్ర మోడీ ఇప్పుడు అది 82 అయినా ఆర్థిక వ్యవస్థకు దోకా లేదు అంటున్నారు.

ఇంతకన్నా అబద్దం ఏముంటుంది? దేశ సంపద అయిన టాక్స్ పేయర్ సొమ్ము దుర్వినియోగం అవుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. గుజరాత్ లాంటి బీజేపీ రాష్ట్రం, దేశం మోడల్ అని చెప్పుకునే స్టేట్‌లో 1 కోటి 40 లక్షల 15 వేల 340 మంది నిరుపేదలు ఉన్నారు. 2 కోట్ల 61 లక్షల 99 వేలమంది మంది న్యూట్రిషన్ సమస్యను ఎదుర్కుంటున్నారు. రాజస్థాన్‌లో 2 కోట్ల 3 లక్షల 88 వేల మంది పేదలు ఉన్నారు. బిహార్, ఝార్కండ్‌లాంటి రాష్ట్రాలలో ప్రతీ రెండో వ్యక్తి పేదవాడే ఉన్నాడు. మొత్తం దేశంలోని 16 రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ప్రతీ రెండో, మూడో వ్యక్తికీ ధాన్యం లభించని పరిస్థితి ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 కోట్ల మంది, మధ్య ప్రదేశ్‌లో 5 కోట్ల మంది పేదలు ఉన్నారు. 12 కోట్ల మంది వలస కార్మికులలో 75 లక్షల మందికే కరోనా అనంతరం పనులు లభించాయి. 25 శాతం అంటే 3 కోట్ల మంది గ్రామాలకు వాపసు వచ్చి ఖాళీగా ఉంటున్నారు.

'బతికితే ఎలా బతకాలి?' అనే ప్రశ్న ఇప్పుడు సామాన్యులలో రగులుతున్నది. ఆందోళన కలిగిస్తున్నది. 2 కోట్ల 30 లక్షల మంది యువకులు తాజాగా ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నికల దృష్టి కోణంలో దేశంలోని 80 కోట్ల మంది పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్న ఐదు కేజీల బియ్యం, గోధుమలు లాంటి ఈ రేషన్ ఇంకెంత కాలం కొనసాగుతుందో తెలియదు. సబ్సిడీల నిధిని కేంద్రం రెండు లక్షల కోట్ల వరకు పెంచింది. దీనిని 5 లక్షల 32 వేల 446 కోట్లు చేయడానికి ప్రతి పాదిస్తున్నది. పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రస్తావన తెచ్చింది. దాదాపు 20 లక్షల హెక్టార్లలో వివిధ కారణాలతో వివిధ పంట నష్టాలు జరిగాయి. అందుకే ఉత్పత్తి తగ్గింది. ఊర్లకు ఊర్లే ఎలాంటి పనులు లేక ఇబ్బందులను ఎదురుకుంటున్నాయి.

నీతి ఆయోగ్(NITI AYOG) ఈ పేదరికం, పనులు లేని పరిస్థితిని లెక్కలు చేసి మరీ తెలుపుతున్నది. పవర్ లెస్, స్పైన్ లెస్ పరిస్థితి ఉంది. మొత్తం దేశ సంపదను కార్పొరేట్‌లకు అప్పజెప్పి 'వారి మోచేతి నీళ్లు తాగండి'అని దేశ ప్రజలను వదిలేసే పరిస్థితికి పాలకులు తెస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను(Public sector companies) అతి చౌకకు కార్పొరేట్‌లకు ధారాదత్తం చేసి, ఎన్నికలు, అధికారం చెలాయించడం ఒక్కటే అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు. టాక్స్‌లు, జీఎస్‌టీలు, ధరలు పెంచుతూ పోతారు. బ్యాంకుల్లో ఋణానికి వడ్డీ పెంచుతారు. డిపాజిట్‌లకు వడ్డీ తగ్గిస్తారు. టాక్స్ పేయర్ల సొమ్ముతో పొలిటీషియన్ ఎంజాయ్ చేస్తాడు. ఆస్తులు పెంచుకుంటారు. ఇదే దేశంలో పాలకుల నీతి. అదే రాజకీయ నీతి. అబద్ధాలు చెబుతూనే ఉంటారు. అది పార్లమెంట్‌లో అయినా, పబ్లిక్ లో అయినా అంతే! ఇట్స్ ఏ మైండ్ గేమ్! పవర్ గేయిన్ గేమ్!

Also Read: అవస్థలలో దేశ ఆర్థిక వ్యవస్థ

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.

Also Read....

common recruitment board: తెలంగాణ వర్సిటీల చాన్సలర్ ను మార్చే ప్రయత్నం జరుగుతుందా?

Advertisement

Next Story