- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదీ సంగతి: గుజరాత్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయా?
దేశంలోని డ్రగ్స్ ప్రభావం అతిగా ఉన్న 272 జిల్లాలలో కేంద్రం 'నషా ముక్త్ భారత్ అభియాన్'ను అమలు చేస్తున్నది. ఇందుకోసం 13 వేల మంది వాలంటీర్‌లను నియమించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017-2019 మధ్యన డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మరణించినవారిలో 55 మంది 14 సంవత్సరాల బాలలే ఉండడం మన దేశంలోని డ్రగ్స్ తీవ్రతను స్పష్టం చేస్తున్నది. చనిపోయిన వారిలో 30 నుంచి 45 లోపు వారు 745 మంది ఉన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడినవారిని కౌన్సెలింగ్ చేయడం లాంటి చర్యలేవీ కూడా తగిన ఫలితాలను ఇవ్వడం లేదు. అసలు మాదక ద్రవ్యాలు దేశంలోనికి రాకుండానే కట్టడి చేసే మార్గాన్ని అన్వేషించాలి. 'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్' అంటారు కదా! అదే పాటిస్తే మంచిది.
గుజరాత్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. ఓడరేవులు, విమాన మార్గాల ద్వారా అఫ్ఘానిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్ నుంచి వివిధ రకాల డ్రగ్స్ మన దేశంలోకి వస్తున్నాయి. ఒకప్పుడు పంజాబ్, ముంబై డ్రగ్స్ సరఫరాకు, వాడకానికి ప్రసిద్ధిగా ఉండేవి. ఇప్పుడు గుజరాత్ కేంద్రంగా మారింది. ఇటీవల రూ. 21 వేల కోట్ల విలువ గల మూడు వేల కిలోల హెరాయిన్‌ను గుజరాత్ ఓడరేవులో అధికారులు పట్టుకున్నారు. ఇది అదానీకి చెందిన ఓడరేవు. దీనిని ఎలా చూడాలి? గత 27 యేండ్ల నుంచి గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటి దాకా పలు సందర్భాలలో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 1.75 లక్షల కోట్లు ఉందంటారు. గతంలోనూ ఒకసారి రూ. 35 వేల కోట్ల విలువ గల డ్రగ్స్ పట్టుకున్నారు. రూ.350 కోట్ల విలువ గల చరస్ పట్టుకున్నారు,
ముంబైలో సముద్ర మార్గంలో వచ్చిన డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. గత ఏడాది రూ.1,026 వేల కోట్ల విలువ గల 513 కేజీల డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా 2017లో 745 మంది, 2018లో 875 మంది, 2020లో 514 మంది, 2021లో 700 మంది చనిపోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించింది. గుజరాత్‌లో డ్రగ్స్‌కు ఒక పెద్ద నెట్ వర్క్ ఉంది. ఇక్కడ కచ్చా మాల్ తెచ్చి శుద్ధి చేసే ఫ్యాక్టరీలు, భారీగా ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. గుజరాత్ డ్రగ్స్‌కు అడ్డాగా మారింది. అరెస్టులు కేవలం పాకెట్ మార్ స్థాయివారివే జరుగుతున్నాయి. అసలు పెద్దోళ్లు తప్పించుకుంటున్నారా? రాజకీయ ఫండింగ్ పొందుతున్నవారి అండ దండలతో తప్పిస్తున్నారా? తెలియదు. ఇంత పెద్ద నెట్‌వర్క్‌కు పెద్దల అండదండలు ఉండే ఉంటాయి.
Also read: మహిళలంటే గౌరవం లేని పార్టీ బీజేపీ! దానికి ఇవే సాక్ష్యాలు
అక్కడి నుంచి ఇక్కడికి
గతంలో పంజాబ్ బార్డర్‌లో డ్రగ్స్ శుద్ధి కేంద్రాలు ఉండేవి. ఇప్పుడవి గుజరాత్‌కు షిఫ్ట్ అయ్యాయి. అయినా పంజాబ్‌లోనూ ఒకటీ అరా ఉన్నాయని అంటారు. ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విడతలవారీగా 1.50 లక్షల కిలోల డ్రగ్స్‌ను తగులబెట్టారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ యువతను డ్రగ్స్ నుంచి కాపాడడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోందన్నారు. నిజానికి డ్రగ్స్ చెదల మాదిరిగా యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. దీనికి కారణం అయిన ఆ చీకటి బహిరంగ వ్యాపారంలోని బిగ్ ఫేస్ ఎవరిదో తేలాలి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఏఐఐఎంఎస్, నేషనల్ డ్రగ్స్ డిపెండెంట్ ట్రీట్‌మెంట్ సెంటర్- ఎన్‌డీడీటీసీ సంయుక్తంగా అక్టోబర్ 2021 లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం దేశంలో మాదకద్రవ్యాలకు అలవాటు పడినవారు 18 లక్షల మంది ఉన్నారు.
అందులో 4.6 లక్షల మంది పిల్లలు ఉన్నారు. యూజర్స్ కేటగిరీలో 12.6 లక్షల మంది వస్తారు. ఈ ఏడాది కాలంలో డ్రగ్స్ వ్యాపారం, దిగుమతి, వినియోగం మరింతగా పెరిగినందున యూజర్స్ సంఖ్య పెరిగి ఉంటుందని అంచనా. 9 జూలై 2022 లెక్కల ప్రకారం భారతదేశంలో వంద మిలియన్ మంది కోకైన్, కన్నబిస్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ వాడుతుంటారని సమాచారం. యూపీ, బెంగాల్, ఢిల్లీ, మణిపూర్, బిహార్‌లో హెరాయిన్ 10 నుంచి 17 శాతం మంది యువత వాడుతున్నారు. ఇంటర్‌నేషనల్ మార్కెట్‌లో ఒక కేజీ డ్రగ్ ఏడు కోట్ల రూపాయలు పలుకుతున్నది.
Also read: మోనోపాలి దిశగా భారతదేశం! ప్రత్యామ్నాయం ఏంటి?
ఫలితమివ్వని అభియాన్
దేశంలోని డ్రగ్స్ ప్రభావం అతిగా ఉన్న 272 జిల్లాలలో కేంద్రం 'నషా ముక్త్ భారత్ అభియాన్'ను అమలు చేస్తున్నది. ఇందుకోసం 13 వేల మంది వాలంటీర్‌లను నియమించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017-2019 మధ్యన డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మరణించినవారిలో 55 మంది 14 సంవత్సరాల బాలలే ఉండడం మన దేశంలోని డ్రగ్స్ తీవ్రతను స్పష్టం చేస్తున్నది. చనిపోయిన వారిలో 30 నుంచి 45 లోపు వారు 745 మంది ఉన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడినవారిని కౌన్సెలింగ్ చేయడం లాంటి చర్యలేవీ కూడా తగిన ఫలితాలను ఇవ్వడం లేదు. అసలు మాదక ద్రవ్యాలు దేశంలోనికి రాకుండానే కట్టడి చేసే మార్గాన్ని అన్వేషించాలి.
'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్' అంటారు కదా! అదే పాటిస్తే మంచిది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్రం కేబినెట్‌లోని మరో ఆరుగురు మంత్రులు దేశానికి గుజరాత్ మోడల్ అంటారు. అదానీ, అంబానీల పాట పాడతారు. దేనికి? ఇప్పుడు డ్రగ్స్‌కు కేంద్రం అయినందుకా? లేక నాణ్యమైన పనిచేయని కారణంగా వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న మోర్బీలోని హ్యాంగింగ్ వంతెన కూలి 150 మంది అమాయక ప్రజలు, అందులో 56 మంది చిన్నారులు ఊపిరి కోల్పోయినందుకా? ఎన్నికలు, అధికారం, రాజకీయం ఇదేనా మీ పాలన?
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223