- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిందీ.. ఖండాలు దాటింది!
ఈ ప్రపంచీకరణ యుగంలో, హిందీ తన ఉపయోగాన్ని నిరూపించుకోవడంలో విజయం సాధించింది. ఇప్పుడు హిందీ దేశ ప్రజల భాష మాత్రమే కాదు, అది ప్రపంచంలోని ప్రతి మూలలో కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒకవైపు దక్షిణాఫ్రికా, ఫిజీ, మారిషస్, గయానా, ట్రినిడాడ్, సురినామ్ వంటి దేశాల్లోనూ, మరోవైపు అమెరికా, రష్యా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ వంటి అన్ని ప్రధాన దేశాల్లోనూ హిందీ మూలాలు నిరంతరంగా సాగుతున్నాయి. కొరియా, చైనా, పోలాండ్ మొదలైనవి ఈ ప్రపంచీకరణ యుగంలో తమ మనుగడ సాగించడానికి హిందీపై ఆధారపడవలసి వస్తుంది. నేడు ప్రపంచంలోని నలభైకి పైగా దేశాలలో 600కు పైగా విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో హిందీ బోధించబడుతోంది. హిందీ విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు కమ్యూనికేషన్ భాష మాత్రమే కాదు, ఇతర వ్యక్తులకు కూడా ఆసక్తికరమైన భాషగా మారింది. దేశంలో హిందీ సర్వవ్యాప్తి అయింది. దేశంలోని ప్రజలందరూ మాతృభాషతో పాటు హిందిలోనూ సంభాషిస్తారు. ‘హిందీ అబ్ దేశ్ కో జోడ్నే వాలీ భాషా హీ నహీ, దిలోంకో జోడ్నే వాలీ భాషా హై’ (హిందీ ఇప్పుడు దేశాన్ని ఏకతాటిపై కలిపే భాష మాత్రమే కాదు, ఖండాలను దాటి హృదయాలను కలిపే భాష కూడా)
ఇంగ్లీష్ ఉన్నా..
స్వాతంత్ర ఉద్యమంలో హిందీ భాష కీలకపాత్ర పోషించింది. జాతిపిత మహాత్మా గాంధీ తన సమావేశాలు, ఉపన్యాసాలు ప్రజలకు చేరేలాగా హిందీ భాషనే వినియోగించారు. అందులో భాగంగా హిందీ ప్రచార సభలు స్థాపించారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఈ భాష నేర్చుకునేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. హిందీ భాష లిపి దేవనాగరి లిపి. ఈ లిపి ప్రత్యేకత ఏంటంటే ఏదైతే రాస్తారో, అదే చదువుతారు. అంటే ఇందులో నిశ్శబ్ద పదాలు (సైలెంట్ వర్డ్స్) ఉండవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి, విదేశాల్లో చదువు, ఉద్యోగంకై వెళ్ళే వారికి, సివిల్స్ సర్వీసెస్ లాంటి ఉద్యోగాల సాధనలోను ఈ భాష పాత్ర అత్యంత కీలకం. మారుతున్న కాలానికి అనుగుణంగా హిందీకి ప్రాముఖ్యత పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా హిందీ మాట్లాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో హిందీ భాష రెండో స్థానం దక్కించుకుంది.
ఆధునికత వైపు వేగంగా దూసుకెళ్తున్న కొందరు భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడుతున్నందుకు గర్వంగా భావించవచ్చు, కానీ నిజం ఏమిటంటే ప్రపంచంలోని అనేక దేశాల్లో హిందీకి గౌరవప్రదమైన హోదా లభించింది. ఇది మాత్రమే కాదు, మన అధికార భాష హిందీ వల్ల ప్రపంచ స్థాయిలో ప్రతి భారతీయుడికి గౌరవం లభిస్తోంది. దక్షిణాదిలో పదవ తరగతి వరకే హిందీని బరువైన బాధ్యతగా త్రిభాషా సూత్రానికి లోబడి అమలు పరుస్తున్నారు. ప్రభుత్వాలు భాషాబోధకులకు పదోన్నతులు కల్పించి, ప్రమాణాలు పెంచే ప్రయత్నాలు చేస్తే పాఠశాల స్థాయిలోనే భాషావికాసానికి ప్రోత్సాహం కల్పించినట్లవుతుంది. జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన హిందీ భాషాభిమానులందరికీ హిందీ దివస్ శుభాకాంక్షలు.
(నేడు హిందీ భాషా దినోత్సవం)
డా. కమలేకర్ నాగేశ్వర్ రావు
ఉపాధ్యాయులు, హిందీ సేవి అవార్డు గ్రహీత,
98484 93223