- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ అమెరికా ప్రెసిడెంట్ అవుతుందా?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా చెప్పుకునే అమెరికాలో చాలామంది ఒక మహిళను అధ్యక్షురాలిగా అంగీకరించరంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. అమెరికా పూర్తిగా పురుషాధిక్య సమాజం. ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఒక్కరు కూడా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కాలేకపోవడమే ఇందుకు నిదర్శనం. 1827లో విక్టోరియా వుడ్ హల్ అనే మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. అయితే ఆమె యులిస్సెస్ జీ గ్రాంట్ చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలోనే అనేక పార్టీలు పోటీలో ఉన్నాయి. ఆధునిక అమెరికాలో మాత్రం అధ్యక్ష బరిలో నిలిచిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ పేరు దక్కించుకున్నారు. 2016లో డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ బరిలో నిలువగా రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన ట్రంప్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి కమలాహ్యారిస్ బరిలో దిగుతున్నారు. అయితే, హ్యారిస్ గెలిస్తే మాత్రం తొలి మహిళ అమెరికా అధ్యక్షురాలిగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.
కాసేపట్లోనే ఎన్నికలు స్టార్ట్
మరికొద్దిసేపట్లో అమెరికాలో ఓటింగ్ ప్రారంభంకానున్నది. ఫలితాలు రావడానికి మరొకొన్ని వారాల సమయం ఉన్నా.. ట్రెండ్స్ మాత్రం రేపటికల్లా తెలిసిపోతాయి. మరి అమెరికా అధ్యక్షస్థానంలో ఎవరు కూర్చుంటారు? ట్రంప్ అధికారంలోకి వస్తాడా? కమలాహ్యారిస్ అధ్యక్ష పదవి దక్కించుకుంటే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రలో నిలిచిపోతారు. ఇంతటి అభివృద్ధి చెందిన అమెరికాలో ఇప్పటివరకు ఒక మహిళ అధ్యక్షురాలు ఎందుకు కాలేకపోయారు? దీని వెనుక కారణాలు ఏమిటి? హ్యారిస్ కు ఉన్న బలాబలాలు ఏమిటి?
ఆర్థిక విధానాలు కారణమే..
నిజానికి ఈసారి జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో పలు అంశాలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కానున్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థికవ్యవస్థ. బైడెన్ పాటించిన ఆర్థిక విధానాలపై అమెరికా మూలవాసుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా సంపద అమెరికన్లదే అనే నినాదం అక్కడ బలంగా వినిపిస్తున్నది. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అనేక దేశాలకు భారీగా నిధులు కేటాయించడాన్ని మూలవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా అమెరికన్లలో కట్టుబానిసల్లా ఉద్యోగాలు చేయడాన్ని వ్యతిరేకిస్తారు. జీవితాన్ని సాధ్యమైనంత ఆనందంగా గడిపేలా చూసుకుంటారు. చైనా, భారతీయుల్లా ప్రతి విషయాన్ని తీవ్రంగా ఆలోచించే పద్ధతికి వ్యతిరేకంగా ఉంటారు. భవిష్యత్తు గురించి పెద్దగా ఆందోళన వారిలో ఉండదు. గత ప్రభుత్వాలు అన్నీ విద్య, వైద్యం, పెన్షన్ సహా అనేక సంక్షేమ పథకాలు అమలుచేశాయి. అయితే, ప్రస్తుత తరం అమెరికన్లు.. అమెరికాలో ఇతర దేశాల ప్రజలు భారీగా పెరిగిపోవడాన్ని ఇష్టపడటంలేదు. అందువల్లే తమకు ఉద్యోగాలు దొరకడం లేదన్న భావన కూడా బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో వలసలపై ఉదారంగా ఉండే డెమోక్రాట్లపై సహజంగానే అమెరికా మూలవాసుల్లో వ్యతిరేకత పెరిగింది. ఇది కమలహ్యారిస్ కు తీవ్రంగా నష్టం చేకూర్చే అంశం. మరోవైపు ఆర్థికవ్యవస్థ బలంగా లేకపోవడం వల్ల కార్పొరేట్ కంపెనీలు ట్రంప్ వంటి నాయకుడిని కోరుకుంటున్నాయి. అతడి వ్యవహారశైలి ఎలా ఉన్నా.. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టే సామర్థ్యం ఉన్నదని కార్పొరేట్ ప్రపంచం బలంగా నమ్ముతున్నది. అందుకే ట్రంప్ తో భేటీకి పెద్ద పెద్ద కంపెనీల అధినేతలు క్యూ కడుతున్నారు.
అమెరికాలో బలమైన కమ్యూనిటీలు
అమెరికాలో ఆఫ్రికా మూలాలున్న ప్రజలు, ప్రవాస భారతీయులు బలమైన కమ్యూనిటీలు. కమలాహ్యారిస్ ఈ రెండు కమ్యూనిటీలకు చెందినవారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే డెమోక్రాట్లు బైడెన్ ను ససేమిరా అని కమలాహ్యారిస్ వైపు మొగ్గు చూపారు. డెమోక్రాట్లు ఉదార వలసవిధానం అమలు చేస్తారన్న పేరు ఉన్నది. అందుకే 2009లో జార్జ్ బుష్ దిగిపోయిన తర్వాత 2021వరకు మళ్లీ రిపబ్లికన్లు అధికారంలోకి రాలేదు. ఆ పార్టీలో యుద్ధకాంక్ష అధికంగా ఉంటుందన్న విమర్శలతోపాటు వలసవాదం వారు తీసుకునే నిర్ణయాలపై అమెరికాలో నివసిస్తున్న ఆఫ్రోఅమెరికన్లు, ఎన్నారైలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. గతంలో దాదపుగా 85శాతానికిపైగా ఎన్నారైలు డెమోక్రాట్లవైపు ఉండగా.. ఈసారి మాత్రం పరిస్థితి మారుతున్నది. అన్ని సర్వేల్లో 65శాతానికిలోపే డెమోక్రాట్లవైపు మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ కు దాదాపు 35శాతానికి పైగా మద్దతు తెలుపుతున్నారు. లక్షలు ఖర్చు చేసి అమెరికా వచ్చిన ప్రవాస భారతీయులకు ఆర్థికమాంద్యం కారణంగా కనీస ఉద్యోగాలు దొరక్కపోవడంతో వారు ట్రంప్ వంటి నేతలే బలంగా కోరుకుంటున్నారు.
పోటస్..
అమెరికాలో పోటస్ అనే పేరుకు చాలా గౌరవం ఉంటుంది. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ (అమెరికా అధ్యక్షుడు) అని అర్థం. విశ్వ విఖ్యాత గ్రీకు యుద్ధవీరుడు అలెగ్జాండర్‌ను పోటస్ అని పిలుస్తారు. అమెరికా అధ్యక్షుడు కూడా ఆ స్థాయి వీరుడు అని చెప్పుకోవడం అమెరికన్లకు ఇష్టం. మరి ఆ స్థానంలో మహిళను అంగీకరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.