- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో పెరిగిపోతున్న నపుంసకత్వం..
సెక్స్ అంటే మూడు అక్షరాల పదం కాదు.. మనిషి జీవితం, మనుగడను, సృష్టి పురోగతిని శాసించేది , అలాంటి జీవ స్థితి గురించి స్త్రీ లేదా పురుషులు బహిరంగంగా మాట్లాడటం, చర్చించడం భారతదేశంలో నిషిద్ధమైన విషయంగా చూస్తారు. ఇది భాగస్వాముల మధ్య ప్రైవేట్‌గా, చాలా గోప్యంగా ఉండాలనే మూఢత్వం చివరికి సెక్స్ సమస్యలు తీవ్ర స్థాయికి చేరడానికి కారణమంటే నమ్మలేరు కదా. కాని ఇది పచ్చి నిజం సుమా!
సెక్స్ సమస్యలు వాటి తీవ్రత, ముఖ్యంగా నపుంసకత్వం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో అతి పెద్ద సమస్యగా మారుతోంది. ప్రపంచంలో పెళ్ళి కాని మగవాళ్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందనీ, జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ, సంఖ్యల్లోనే కాదు, వ్యాప్తి రేటులో కూడా ప్రపంచానికి భారతదేశం నపుంసకత్వ రాజధానిగా ఎదుగుతున్నదనీ, నపుంసకత్వం 40 ఏళ్లు పైబడిన పురుషులలో 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 25 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారిలోనే విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయనీ. మన దేశంలో మాత్రం 20 నుంచి 30 శాతం విడాకులకు నపుంసకత్వమే అసలు కారణమని పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రతి 10 మంది భారతీయ పురుషులలో ఒకరు నపుంసకత్వంతో తీవ్రంగా బాధపడుతున్నారని, గతంలో ఈ సమస్య మెట్రోనగరాలు, పట్టణాలలో ఎక్కువగా ఉండేదనీ, నేడు మారుమూల గ్రామాల్లో సైతం నపుంసకత్వం ఎక్కువైందని సర్వేలు చెబుతున్నాయి..
పెళ్ళికి ముందే సెక్స్ ..
నేడు పుట్టిన శిశువు మొదలు పండు ముదుసలి వరకు చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చినట్లుగా కాలం గడిచిపోతుంది, ముఖ్యంగా యువతీ యువకులు స్మార్ట్ ఫోన్లలో సెక్స్‌కు సంబంధించిన హాట్ సెక్స్ వీడియోలు వీక్షణం చేస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. పెళ్ళికి ముందే 30-40 % మంది కనీసం ఒకరూ లేదా ఇద్దరితో సెక్స్‌లో పాల్గొన్న అనుభవాలు కల్గి ఉంటున్నారు, చాలామందిలో పోర్న్ లేదా హాట్ సెక్స్ వీడియోలు చూసిన తర్వాత సెక్స్ కోరికలు. ప్రతిస్పందనలు సహజంగానే ఎక్కువైతాయి. ఫలితంగా పోర్న్ వీడియోలో ఉన్నట్లుగా సెక్స్ చేయాలని ప్రయత్నించి విఫలం చెందుతారు. వీడియోలో చూపిస్తున్నది ఫేక్ అనే చేదు నిజం తెలియక మార్కెట్లో దొరికే అడ్డమైన మాత్రలను వాడుతూ, సక్సెస్ కాలేక, సెక్స్ అంటేనే భయం.. సెక్స్ చేస్తే ఎక్కడ విఫలం చెందుతామోనన్న అనుమానం తో పెళ్ళంటేనే వణికిపోయే వాళ్ళు ఇంకొందరు, ఇక పెళ్లైన వాళ్ళు భార్యతో సెక్స్ జీవితానికీ దూరంగా ఉంటూ.. బలహీనతలు కప్పి పుచ్చటానికి ఏవోవో కాకమ్మ కథలు చెప్పుతూ కాలం వెళ్ళబుచ్చుతారు. ఫలితంగా మెజారిటీ కుటుంబాల్లో అక్రమ సంబంధాలు ఏర్పడటం, గొడవలు పడటం ఆ తర్వాత విడి పోవటాలు... సాధారణమైపోతుంది.
పెళ్లయిన నాటి నుంచే..
ప్రపంచ ఆధునీకరణ మూలంగా, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, శ్రమలేని శరీరాలు, నిరుద్యోగత ఫలితంగా పెళ్లిల్లు కూడా 25 -27 ఏళ్లు దాటిన తర్వాతనే జరుగుతున్నాయి. పెళ్లయి సంసారం లోనికి ప్రవేశించిన మొదటి వారంలోనే నూటికి 20 శాతానికి పైగా సెక్స్ బలహీనతల తో డీలా అయిపోతున్నారు. సెక్స్ పై అవగాహన లేకపోవడం, మొదటి రాత్రే ప్రయత్నించి విఫలం కావడంతో ,ఎవ్వరికీ చెప్పుకోలేక అవమానంగా భావించి బెంబేలెత్తిపోతున్నారు. నలభయ్యేళ్లు వచ్చేసరికి 48 శాతం మంది రక్తపోటుతో బాధపడుతుండగా. 45 శాతం మంది 40 ఏళ్లకే మధుమేహంతో అవస్థలు పడడం కారణంగా పురుషుల్లో లైంగిక జీవితం పట్ల ఆసక్తి సన్నగిలుతోంది. ఈ సమస్య గత అయిదేళ్లలో 15 శాతం పెరిగింది. ఫైజర్ అప్జాన్ సర్వే పరిశోధనల ప్రకారం, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులలో 30 శాతం మంది అంగస్తంభన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 53 శాతం మంది పురుషులకు తమకు అంగస్తంభన ఉన్నట్లు కూడా తెలియదు..
నపుంసకత్వానికి కారణాలు..
భారతదేశంలో పురుషుల్లో నపుంసకత్వ సమస్యను వైద్యపరంగా చక్కదిద్దడానికి అవసరమైనంత పరిశోధనలు లేకపోవడం బాధాకరం. రోజురోజుకీ పెరిగిపోతున్న నపుంసకత్వానికి చాలా కారణాలున్నప్పటికీ ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్, క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయడం, తగినంత వ్యాయామం లేకపోవడం, నిద్రలేకపోవడం, పదేపదే ప్రయాణాలు చేయాల్సి రావడం, జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్లు, మద్యం, మత్తు పదార్థాలకు బానిసకావడం, బరువు పెరగడం, రక్తపోటు, మెదడు లేదా వెన్నుపూసకు గాయాలు లేదా జబ్బులు , హైపోగొనాయిడిజం, రేడియేషన్, పార్కిన్సన్స్ , ప్రొస్టేట్ గ్రంథి జబ్బులు, థైరాయిడ్, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు, కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పురుషుల్లో లైంగిక పటుత్వం బాగా తగ్గిపోతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
తక్కువ సెక్స్ - ఎక్కువ జబ్బులు...
సాధారణంగా ఆరోగ్యవంతమైన భార్యాభర్తలు పెళ్లైన కొత్తలో రెగ్యులర్‌గా లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పుట్టిన పిదప కనీసం వారానికి 3-5 సార్లు సరాసరి కలుస్తారు. ఇక 35 ఏళ్లుదాటిన తరువాత చాలామంది కనీసం వారానికి రెండుసార్లు కూడా లైంగిక జీవితాన్ని అనుభవించలేకపోతున్నారనీ సెక్సాలజిస్ట్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- సెక్స్ బలహీనతలు లేని పురుషులతో పోలిస్తే, సెక్స్ బలహీనతలు ఉన్న పురుషులు రెండు రెట్లు ఎక్కువ గుండెపోట్లు (2.6%), స్ట్రోక్‌లను (6.3%) అనుభవిస్తారు.(అమెరికన్ హార్ట్ అసోసియేషన్, 2018).
-డిప్రెషన్ లేని వారి కంటే డిప్రెషన్ ఉన్నవారిలో 39% ఎక్కువగా సెక్స్ బలహీనతలు వచ్చే అవకాశం ఉంటుంది. (ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్, 2018).
-సెక్స్ బలహీనతల వలన డిప్రెషన్ ప్రమాదాన్ని 192% పెంచుతుంది. (ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్, 2018).
-అలాగే సెక్స్ బలహీనతలు లేని వారి కంటే సెక్స్ బలహీనతలు ఉన్న వ్యక్తులు డిప్రెషన్‌ను అనుభవించే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. (ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్, 2018).
-సంతానం లేని జంటలలో 20% నుండి 25% వరకు లైంగిక అసమర్థత ఉంటుంది. (పునరుత్పత్తి భాగస్వాముల వైద్య బృందం, 2020)
ఇలా చేస్తే హ్యాపీగా..
ముఖ్యంగా సంప్రదాయాలు పాటించే మన దేశంలో సెక్స్ జీవితం - సుఖ సంసారం అంటే ఏమిటో పండితులకే కాదు పామరులకు కూడా తెలియదు. కారణం సెక్స్‌పై కనీస అవగాహన లేకపోవడమే, పెళ్లి తర్వాత పిల్లలు.. ఇక సెక్స్‌తో పని ఏమిటి అనే స్థితిలోనే యవ్వన జంటలు సైతం అమాయకంగా మగ్గుతున్నాయి. లైంగిక జీవితాన్ని ఆస్వాదించకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలే కాదు, కుటుంబ సమస్యలు కూడా పెరిగి పోతున్నాయి. దాదాపు 30 శాతం మంది పురుషులు తమ వైవాహిక జీవితం కుప్పకూలే దాకా మేల్కోవడం లేదని, తమకు లైంగిక సమస్యలున్నట్టు ఒప్పుకోవడానికి, చెప్పుకోవడానికి చాలా మంది పురుషులు సిగ్గుపడుతున్నారని. ఇలాంటి విషయంలో పురుషులు బహిరంగ మార్కెట్లో దొరికే మందులను తీసుకోవద్దని, పసలేని వాణిజ్య ప్రకటనలకు మోసపోవద్దనీ, దాపరికంతో వ్యవహరించక, వెంటనే డాక్టర్లను సంప్రదించి, ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవాలని, లేకుంటే మొదటికే మోసం వస్తుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డా. బి. కేశవులు నేత.
ఎండీ. న్యూరో- సైకియాట్రీ .
సీనియర్ మానసిక & సెక్స్ వైద్య నిపుణులు.
85010 61659.
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీఈఓ లేఖ..