- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా ఉద్యోగుల సెలవులూ.. ప్రత్యేక సౌలభ్యాలూ..!
మహిళల కోసం ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు, వెలుసుబాట్లు కల్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం,ఇతరత్రా భీమాలు ఇలా అనేక సౌకర్యాలు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు కూడా కొన్ని సౌకర్యాలు,ప్రత్యేకమైన సెలవుకు కూడా ప్రభుత్వం కల్పించింది. వాటిపై ప్రతి మహిళా ఉపాధ్యాయురాలు ఉద్యోగి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సబార్డినేట్ సర్వీసు రూల్సులోని నిబంధన 22 మరియు జీవో.237 తేది28-05-1996 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జీవో.27 తేది09-01-2004 ద్వారా ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. జీవో.350 తేది30-07-1999) ననుసరించి మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. మెమో నం.3731 తేదీ 11.12.2003 మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క భార్య కారుణ్య నియామకమునకు ఇష్టపడకపోయినా లేదా అందుకు అవసరమైన అర్హతలు లేకపోయినా అటువంటి సందర్భాలలో మరణించిన ఉద్యోగి మీద ఆధారపడిన కుమార్తెలలో ఒకరికి వివాహితులైనప్పటికీ నియామకం జరపవచ్చు. జీవో.322 తేది19-07-1995 ద్వారా పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరును కూడా చేర్చడం జరిగింది.
మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు
జీవో.433 తేది4-8-2010 ద్వారా మార్చి 8న మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు చేయడం జరిగింది. జీవో.374 తేదీ 16.3.1996 ప్రకారం మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరుని తెలియజేస్తుంది. జూనియర్ లెక్చరర్లకు కూడా 5 రోజుల అదనపు సెలవుల మంజూరు అదే కోవలో జీవో.142 తేదీ1.9.2018 ద్వారా ఈ సెలవులను రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు కల్పించారు. జీవో.152 తేదీ 4.5.2010 ప్రకారం వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయాలని సూచిస్తున్నది. జీవో.1415 తేదీ 10.6.1968 ప్రకారం మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు 14 మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు (14) రోజులు మంజూరుచేయవచ్చు.
ప్రత్యేక ఆకస్మిక సెలవు
జీవో.128 తేదీ 13.4.1982 ననుసరించి మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు. జీవో.69 తేదీ 6.6.2003 ప్రభుత్వ ఆర్థిక చేయూత పొందుతున్న ఎయిడెడ్ సంస్థలలో పనిచేయు వివాహిత ఉద్యోగినులకు ప్రభుత్వ ఉద్యోగినులకు వర్తించే విధంగానే 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరుకు ప్రభుత్వం అవకాశం కంపించింది. జీవో.275 తేదీ 15.5.1981 మహిళా ఉద్యోగులు గర్భవిచ్చితి తర్వాత సాల్పింగ్టమీ ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో 14 రోజులకు నించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందే అవకాశం ఉంటుంది.
జీవో.52 తేదీ 1.4.2011
ఈ జీవో ప్రకారం మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసు మేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయాలని సూచిస్తున్నది. జీవో.762 తేదీ 11.8.1976 చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును. జీవో.209 తేదీ 21.11.2016 ప్రకారం మహిళా ఉద్యోగులు, టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు చేస్తారు. ఇట్టి సెలవును 6 స్పెల్స్ కి తగ్గకుండా స్పెల్ కి 15 రోజులు మించకుండా మొదటి ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు, వికలాంగులైన పిల్లలు ఉంటే 22 సంవత్సరాలు నిండే వరకు ఇట్టి సెలవును వినియోగించుకోవచ్చును. మొదటి విడత మంజూరు సమయంలో శిశువు యొక్క పుట్టిన తేదీ సర్టిఫికెట్ జతచేసి సదరు మంజూరు అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సుధాకర్.ఏ .వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)
90006 74747