- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎస్సీకి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వండి!
రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు గత ఏడు సంవత్సరాలుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నా.. గత ప్రభుత్వం కేవలం 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకే కొత్తగా ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఖాళీగా ఉన్న మిగతా 15 వేల పోస్టులు జతచేసి 20వేల టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. దీనికి టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్, టెట్ ప్రక్రియ అంటూ ముడిపెట్టకుండా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీచేయాలి. అనుబంధ నోటిఫికేషన్ జారీచేశాక కావాలంటే టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందుకే అనుబంధ నోటిఫికేషన్‌లో గతంలో అప్లై చేయని అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. అలాగే ఖాళీగా ఉన్న ప్రాథమిక స్థాయి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వ్యాయామ టీచర్లు, స్పెషల్ టీచర్ పోస్టులు, ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులు, ఉర్దూ పోస్టులు అన్ని ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ప్రమోషన్స్ ప్రక్రియలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ స్థాయిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే బి.ఎడ్ నిరుద్యోగులకు కొంత న్యాయం జరుగుతుంది.
-రావుల రామ్మోహన్ రెడ్డి
తెలంగాణ డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థుల సంఘం
93930 59998