పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత!

by Ravi |   ( Updated:2024-08-23 00:30:33.0  )
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత!
X

హైడ్రా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆదర్శప్రాయమైన కార్యక్రమం. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడానికి ప్రారంభించిన 'యూనివర్సల్ క్లైమేట్ చేంజ్ యాక్షన్' లాంటిదే హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించిన హైడ్రా... నీటి వనరులు, కొండలు, పర్వతాలు, వృక్షజాలం, జంతుజాలాన్ని నాశ నం చేసే వాతావరణ విపత్తుకు వ్యతిరేకంగా ఏర్పర్చిన ఒక యాక్షన్ ప్రోగ్రాం. ప్రకృతిని నాశనం చేయడం మానవ ఉనికికి ముప్పు కలిగిస్తుంది. ఇది ప్రకృతిని రక్షించడానికి ఒక నమూనా ఇనిషియేటివ్ అవుతుంది. ఇది మన రాష్ట్రంలో మంచి ప్రారంభం, ప్రకృతి ఉద్దేశ్యం, ప్రజల ప్రయోజనాల రీత్యా దేశమే కాదు.. ప్రపంచం యావత్తూ దీన్ని అనుసరిస్తుంది. చెక్కుచెదరని, నిరపాయకరమైన నిబద్ధత, లక్ష్యంతో కూడిన ఈ పనిని కొనసాగించడం ప్రపంచంలోని వ్యక్తులందరి బాధ్యత.

ప్రొ. ఎం. సురేందర్ కుమార్

న్యాయవాది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా

77804 96978

Advertisement

Next Story