ఇవి కార్పొరేట్ ప్రపంచం సృష్టి...!

by Ravi |   ( Updated:2024-03-19 00:30:34.0  )
ఇవి కార్పొరేట్ ప్రపంచం సృష్టి...!
X

నిండా నూరేళ్లు నిండని భారత ప్రజాస్వామ్య పాలన, బడా వ్యాపారస్తుల కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందనడానికి ఎలక్ట్రోరల్ బాండ్స్ చక్కటి ఉదాహరణ. ఎలక్టోరల్ బాండ్స్ ప్రమాదకరమైన విషపు నాగుల పుట్ట. అది తవ్విన కొద్దీ విషపు నాగులు బయటపడుతూనే ఉంటాయి. ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను కొనుగోలు చేసే సంస్థలు విశ్వంలోని బ్లాక్ హోల్స్ లాంటివి. అవి ఎంతటి శక్తివంతమైన పదార్థానైనా అమాంతం మింగి వేయగలుగుతాయి. అవి ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని పది నిమిషాలలో కూల్చివేయగలుగుతాయి.

కార్పొరేట్లకు అనుకూలంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ లోని చట్టాలను ప్రభుత్వాలు సవరిస్తూ వస్తున్నాయి. అభివృద్ధి పేరిట నిర్వహిస్తున్న పనులన్నీ దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. చట్టాలను ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి కానీ జరిగే పనులన్నీ కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి దేశంలోని రాజకీయ పార్టీల ఎలక్ట్రోరల్ బాండ్స్‌ని కార్పోరేట్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను కొనుగోలు చేసే సంస్థలు విశ్వంలోని బ్లాక్ హోల్స్ లాంటివి. అవి ఎంతటి శక్తివంతమైన పదార్థానైనా అమాంతం మింగి వేయగలుగుతాయి. అవి ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని పది నిమిషాలలో కూల్చివేయగలుగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మెగా ఇంజనీరింగ్ సంస్థ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను కొనుగోలు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు ఆ సంస్థకు కాంటాక్ట్ ఇచ్చినందుకే కదా.

బాండ్ల కొనుగోలుతో భారీ కాంట్రాక్టులు

మేఘా ఇంజనీరింగ్ సంస్థ జాతీయ పార్టీ ఐన భారతీయ జనతా పార్టీ ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను కొనుగోలు చేసి దేశంలో వివిధ చోట్ల భారీ కాంట్రాక్టులు సొంతం చేసుకుంది. కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసిన ఎలక్ట్రోరల్ బాండ్ల సంపద మొత్తం దేశంలోని కార్మికులను దోచుకుని పోగుచేసున్నవే.ఈ దేశంలో కార్పొరేట్ భూతం బలంగా తయారవుతున్న తరుణంలో అది మెల్ల మెల్లగా ప్రభుత్వంలోని ప్రతి రంగాన్ని మింగేసుకుంటూ అన్ని రంగాలపై పైచేయి సాధించుకుంటూ వస్తున్నది. ఇప్పటికే అది ప్రభుత్వంలోని నూటికి తొంభై శాతం రంగాలను మింగేసి దర్జాగా రొమ్ము విసిరి ప్రజాస్వామ్యంలోని చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకుని నిలబడింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ పుట్టించిన బీజేపీ ఒక కార్పొరేట్ సంస్థల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను పుట్టించడానికి రిజర్వ్ బ్యాంక్ చట్టాలనే సవరించింది. ఈ దేశంలోని ప్రభుత్వ బ్యాంకులను భారతీయ స్టేట్ బ్యాంకులలో విలీనం చేసి భారతీయ స్టేట్ బ్యాంకును విస్తరింపజేసింది.

కోర్టునే ఏమారుస్తున్న ఎస్‌బీఐ

భారతీయ స్టేట్ బ్యాంకు విస్తరణ తర్వాత దాని స్వయం ప్రతిపత్తిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లాగేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐని తన నియంత్రణలోకి తీసుకొని ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ ను విక్రయించే అధికారం కల్పించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ జాబితా భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఎస్‌బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదు. దీనిని బట్టి ఎస్‌బీఐ బీజేపీ పార్టీ కనుసన్నలలో ఉందని మనకు అర్థమవుతుంది. ఎస్‌బీఐ ఇచ్చిన నివేదికలో దేశంలో బడా కార్పొరేట్లు ఐన గౌతం అదానీ, ముఖేష్ అంబానీల పేర్లు అందులో లేకపోవడం విశేషం. దేశ పరిపాలన ప్రభుత్వాల చేతుల్లో లేదు, పాలకుల చేతుల్లో లేదు... కార్పొరేట్ల చేతుల్లో ఉందనడానికి ఇది నిదర్శనం.

- గుండమల్ల సత్యనారాయణ

89199 98619

Advertisement

Next Story

Most Viewed