Electric Vehicles: మనం ఈ-వాహనాలకు మరాలి!

by Ravi |   ( Updated:2022-12-27 18:31:28.0  )
Electric Vehicles: మనం ఈ-వాహనాలకు మరాలి!
X

ప్రపంచవ్యాప్తంగా ఈవీల వాడకం పెంచడం ద్వారా కార్బన్ డై ఆక్సయిడ్ తగ్గించవచ్చు. పరిశుభ్ర వాతావరణం, రోడ్లు ఏర్పాటు చేయవచ్చు. అనారోగ్యాలు తగ్గించి ఆయుష్షు ప్రమాణం పెంచవచ్చు. వీటి ఉత్పత్తుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. చమురు కోసం ఓపెక్ దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెంచుకోవచ్చు. ప్రజలకు చమురు ధరల భారాన్ని తగ్గించి, వారి ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు మెరుగుపరచవచ్చు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడటం ద్వారా ఆదాయం ఆదా చేసి పరిసరాల పరిశుభ్రత పెంచుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా ఈవీ ఉత్పత్తి చేసే సంస్థలకు రాయితీలు ఇవ్వాలి. కొనుగోలు దారులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం 'స్వచ్ఛ ఢిల్లీ' కార్యక్రమం ద్వారా ఈవీ వాహనాలను ప్రమోట్ చేస్తున్నది.

భూగోళం మీద సమస్త దేశాలు, మానవులు, జంతుజాలం, పశుపక్ష్యాదులు వివిధ రకాల కాలుష్య కోరలలో చిక్కుకొని అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాలలో అకాల మరణాలకు గురై అయినవారికి కానివారిగా మిగులుతూ దుఃఖం కలుగుజేస్తున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం వాయు కాలుష్యం. కొన్ని జాతులు ఈ కాలుష్యం వలన అంతరించే స్థితికి చేరుకున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా వలన ప్రయాణ సాధనాల వాడకం పెరిగింది. దీంతో శిలాజ ఇంధానాలైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం ఎక్కువయ్యింది. వాటితో సర్వత్రా వాయు కాలుష్యం పెరిగి ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్త్మా, చర్మ వ్యాధులు ప్రబలి మానవాళి జీవితం దుర్భరం అవుతున్నది.

అవి పెరగడం శుభపరిణామం

వాహన కాలుష్యం వలన మన దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంటున్నదో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. గాలి నాణ్యత పెను ప్రమాదంలో పడి కొన్ని సందర్భాలలో ఆఫీసులు, పాఠశాలలు, ఉపాధి కార్యక్రమాలు సైతం మూసివేసే పరిస్థితి నెలకొంటున్నది. అందుకే యావత్ ప్రపంచ ప్రజానీకం పెట్రోల్, డీజిల్ గ్యాస్ వంటి వాటితో నడిచే వాహనాలకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాడకం వైపు మొగ్గు చూపాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం యేటా 30 లక్షల మంది వాయు కాలుష్యం వలన మరణిస్తున్నారు. అనేక మంది అనారోగ్యాలకు గురవుతూ, ఎక్కువగా వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు చేస్తూ ఆర్థికంగా దివాలా తీస్తున్నారు.

ఈ కాలుష్యానికి‌ మానవులే కాదు, అనేక జంతువులు, పక్షులు కూడా అకాల మరణం పొందుతున్నాయి. అందుకే, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, ఇంధన ధరలు, వాయు కాలుష్యం వంటి కారణాల వలన అందరం ఈవీల(EV) వాడకం మొదలు పెట్టాలి. ఇప్పటికే మన దేశంలో ఈ-బైక్, ఈ-రిక్షా, ఈ-కార్ వాడకం మొదలవడం శుభ పరిణామం. ఇంధన వాహనాల వాడకంతో ఉత్పన్నమయ్యే కార్బన్ మొనక్సయిడ్, నైట్రోజన్ ఆక్సయిడ్ వంటి కలుషిత వాయువులను నియంత్రణ చేయవచ్చు. ఇప్పటికే 'వోల్వో'(volvo) సంస్థ 2030 నాటికి అతి వేగంగా ప్రయాణించే ఈ-వాహనాలను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల ఉత్పత్తిని 2035 నాటికి పూర్తిగా నిలిచి వేసే దిశగా 'జనరల్ మోటార్స్' సంస్థ నిర్ణయం తీసుకుంది.

అది మన కర్తవ్యం

ప్రపంచవ్యాప్తంగా ఈవీల వాడకం పెంచడం ద్వారా కార్బన్ డై ఆక్సయిడ్ తగ్గించవచ్చు. పరిశుభ్ర వాతావరణం, రోడ్లు ఏర్పాటు చేయవచ్చు. అనారోగ్యాలు తగ్గించి ఆయుష్షు ప్రమాణం పెంచవచ్చు. వీటి ఉత్పత్తుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. చమురు కోసం ఓపెక్ దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెంచుకోవచ్చు. ప్రజలకు చమురు ధరల భారాన్ని తగ్గించి, వారి ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు మెరుగుపరచవచ్చు. ఎలక్ట్రిక్ వెహికిల్స్(Electric vehicles) వాడటం ద్వారా ఆదాయం ఆదా చేసి పరిసరాల పరిశుభ్రత పెంచుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా ఈవీ ఉత్పత్తి చేసే సంస్థలకు రాయితీలు ఇవ్వాలి. కొనుగోలు దారులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి.

తాజాగా ఢిల్లీ ప్రభుత్వం 'స్వచ్ఛ ఢిల్లీ'(swachh delhi) కార్యక్రమం ద్వారా ఈవీ వాహనాలను ప్రమోట్ చేస్తున్నది. ఒక ఈవీని ఒక సంవత్సరం వాడటం ద్వారా 1.5 మిలియన్ల గ్రాముల కార్బన్ డై ఆక్సయిడ్ తగ్గించవచ్చు అని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు రాబోయే అవసరాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో క్లయిమేట్ ఛేంజ్, పర్యావరణ మార్పులు, భూతాపం తగ్గించాలన్నా, మానవులతో పాటు జంతువులు పక్షులు కూడా ఈ భూగోళంపై పదికాలాలపాటు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలన్నా, వాయు కాలుష్యం నివారించాలన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం మన అందరి కర్తవ్యం. అడవులను, జీవవైవిధ్యాన్ని కాపాడటం మన అందరి బాధ్యతగా భావిద్దాం.

ఐ.ప్రసాదరావు

6305682733

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed