KCR:కేసీఆర్ సారు మీకు ఇన్ని అవమానాలా!

by Ravi |   ( Updated:2022-09-03 13:22:06.0  )
KCR:కేసీఆర్ సారు మీకు ఇన్ని అవమానాలా!
X

బిహార్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం నడుస్తున్నది. ఝార్ఖండ్‌లో కూడా. వీరు బీజేపీకి వ్యతిరేకమే కానీ, కాంగ్రెస్‌కు అనుకూలం. కేసీఆర్‌ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ వ్యతిరేకం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిడుతూ, బయటి రాష్ట్రాలకు పోయి బీజేపీ వ్యతిరేక కూటమి అని మాట్లాడటం నితీశ్‌కుమార్ లాంటి నేతలు గమనించకుండా ఉంటారా? 'రైతులకు డబ్బులు ఇస్తాను, లేదా సైనిక కుటుంబాలకు డబ్బులు ఇచ్చేందుకు మీ రాష్ట్రానికి వస్తానంటే' ఎవ్వరైనా వద్దంటారా? స్వాగతిస్తూ మర్యాదలు చేస్తారు. ఆ మర్యాదను మనం కాపాడుకోవాలి. కేసీఆర్‌ విషయంలో అది జరగడం లేదు. ఏదో ఒక వంకతో ఇతర రాష్ట్రాలకు పోయి బీజేపీ వ్యతిరేక కూటమి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.

రాజకీయాలు మాట్లాడకపోతే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు. కేవలం రాజకీయాలే మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కూడా కాదు. ఎప్పుడు ఏది అవసరమో అదే మాట్లాడాలి. సభ ఉద్దేశం ఏమిటో ఎరిగి మాట్లాడితే మంచిది. ఇటీవల మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయన ఎందుకిలా అయ్యారో అని బాధనిపిస్తున్నది. సమయం, సందర్భం లేకుండా ఆయన మాట్లాడుతున్న తీరు కొంత వెగటుగానే అనిపిస్తున్నది.

నిన్న బిహార్‌ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ మాట్లాడుతుంటే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేయడం, ఆయనను కేసీఆర్‌ నిలువరించడం చూస్తే కేసీఆర్‌తో వేదిక పంచుకోవడం వారికి ఇబ్బందిగానే ఉందనిపించింది. గతంలో ఝార్ఖండ్‌లో కూడా ఇదే సీన్ జరిగింది. ఇద్దరు వేరు వేరు పార్టీల నేతలు ఒకే వేదిక పంచుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఏమి మాట్లాడాలన్నది ముందుగానే నిర్ణయం కావాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడాలనుకున్నపుడు ఇది కచ్చితంగా పాటించాలి. కేసీఆర్‌ దీన్ని విస్మరిస్తున్నారు. ఇష్టం వచ్చిన అంశాలు, ఏకాభిప్రాయం లేని అంశాలు ఇష్టారీతిన మాట్లాడుతుంటే వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

అక్కడి పరిస్థితి వేరు కదా

బిహార్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం నడుస్తున్నది. ఝార్ఖండ్‌లో కూడా. వీరు బీజేపీకి వ్యతిరేకమే కానీ, కాంగ్రెస్‌కు అనుకూలం. కేసీఆర్‌ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ వ్యతిరేకం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిడుతూ, బయటి రాష్ట్రాలకు పోయి బీజేపీ వ్యతిరేక కూటమి అని మాట్లాడటం నితీశ్‌కుమార్ లాంటి నేతలు గమనించకుండా ఉంటారా? 'రైతులకు డబ్బులు ఇస్తాను, లేదా సైనిక కుటుంబాలకు డబ్బులు ఇచ్చేందుకు మీ రాష్ట్రానికి వస్తానంటే' ఎవ్వరైనా వద్దంటారా? స్వాగతిస్తూ మర్యాదలు చేస్తారు. ఆ మర్యాదను మనం కాపాడుకోవాలి.

కేసీఆర్‌ విషయంలో అది జరగడం లేదు. ఏదో ఒక వంకతో ఇతర రాష్ట్రాలకు పోయి బీజేపీ వ్యతిరేక కూటమి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాట్లాడటం మంచిదే. కూటమి కట్టి కూడా కొట్లాడొచ్చు. బీజేపీని ఓడించి కేసీఆర్‌ ప్రధాని కూడా కావొచ్చు. కానీ, ఆయా రాష్ట్రాల పర్యటనకు వెళ్లే ముందు 'రాజకీయాలు మాట్లాడటానికి వస్తున్నాను, కూటమి విషయం చర్చిద్దాం అని చెప్పిపోవాలి. కేసీఆర్‌ తెలంగాణ ఖజానాకు కస్టోడియన్ మాత్రమే. సంపద ప్రజల పన్నుల ద్వారా వచ్చింది. ఆయన సొంతం కాదు. ఆచి, తూచి ఖర్చు చేయాలి. తన రాజకీయాల కోసం అమర సైనిక కుటుంబాలను, రైతు కుటుంబాలను వాడుకోవడం సరికాదు.

సొంత డబ్బులతో పోవాలి

కేసీఆర్‌ రాజకీయాలు మాట్లాడాలనుకుంటే టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఆపార్టీ డబ్బులతో పర్యటనకు వెళ్లాలి కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సబబు? తమిళనాడులో స్టాలిన్‌తో కూడా ఇలాంటి అనుభవమే. బెంగాల్‌లో దీదీ కూడా ఇలానే చేశారు. కేసీఆర్‌ను తాను ఆహ్వానించలేదని, వారే దుర్గామాత దర్శనానికి వస్తే ఆతిథ్యం ఇచ్చానని, తమ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదని మీడియాకు వెల్లడించారు.

ఇదెంత అవమానం! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. చివరికి కర్ణాటకలో దేవెగౌడ, కుమారస్వామి కూడా మీతో ఏకీభవించలేదు. మీరు ఇప్పుడు అవసరాల కోసం బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. మీరు కూటమి కట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలు ఎప్పటి నుంచో బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ విషయాలు మరిచిపోయి హనుమంతుని ముందు కుప్పి గంతులు ఎందుకు? ఇన్ని అవమానాలు ఎదురైనా మీరు ఇంకా మారరా!?

Also Read : బీహార్‌లో ఆసక్తికర సన్నివేశం! సీఎం నితీష్ కుమార్ వద్దన్నా వినని కేసీఆర్


కప్పర ప్రసాదరావు

96767 76622

Advertisement

Next Story