- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు నొప్పి తెలియకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
50 శాతం దాకా వేసిన పన్నుల ఆదాయమంతా ఏమైపోతున్నది? అనేక దేశాలలో అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉంది. ఇండియాలో అది కూడా లేదు! మండల్ కమిషన్ నివేదికలో కోరినట్టు చట్టసభలలో, విద్య, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో 50 శాతం రిజర్వేషన్ల ద్వారా వారి జనాభాకు ప్రాతినిధ్యం కల్పించడం ఈనాటి అవసరం. బీసీలకు, మహిళలకు అన్ని రంగాలలో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడం అవసరం. పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలాంటి సర్వేలు, అధ్యయనాలు లేకుండానే కేటాయించారు. దాంతో బీసీల జనరల్ కోటా పది శాతం తగ్గిపోయింది. క్రీమీలేయర్ పరిమితి యేటా పెంచి 50 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచడం అవసరం. మరో రకమైన ఆదాయాన్ని, ప్రజల నుంచి తిరిగి ప్రజలకు ప్రభుత్వానికి సమకూర్చాల్సిన అవసరం ఉంది. దేవుడికిచ్చే సొమ్మంతా పూజారులకు, యాజమాన్యానికి ఇచ్చినట్టు భావిస్తున్నారు కొందరు. అలా భావిస్తే అది దేవుడిని చూపి వ్యాపారం చేయడం అవుతుంది. అది ప్రజల సొమ్ము. దేవుళ్లను చూసి దేవుళ్ల మీద భక్తితో ఇచ్చిందే తప్ప. పూజారులకు, యజమానులకు ఇచ్చింది కాదు.
కాలం మారుతున్నది. కాలానికనువుగా కొన్ని రాజ్యాంగ సవరణలు కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ చేసుకోవాల్సి ఉన్నది. రోజు రోజుకూ తేదీలు మారినట్టే వయసు కూడా మారుతుంది. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా వయసు పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకూ తేదీలు మారినట్టే ప్రభుత్వం రోజూ కొంచెం మారుతున్నది. కొంచెం కొంచెం మార్చుతుంటే, కొంచెం కొంచెం మారుతుంటే మార్పు తెలియదు. దీన్ని తత్వశాస్త్రంలో ఎవల్యూషన్ అని, పరిణామాత్మక మార్పు అని అంటారు. అకస్మాత్తుగా మారితే మార్చితే గుణాత్మక మార్పు, రెవల్యూషన్ అంటారు. ప్రజల నుంచి తిరుగుబాటు రెవల్యూషన్ రాకుండా కొంచెం కొంచెం అలవాటు చేస్తారు. రోజూ కొంచెం ధర పెరుగుతుంటే నొప్పి తెలియదు. అందుకు వ్యతిరేకంగా ఉద్యమం చేయలేరు.
'కొద్దిగనే గదా పెరిగింది' అని భరిస్తారు. అలా ఆరు రూపాయలున్న లీటరు పెట్రోలు 120 రూపాయలు అయింది. 60 రూపాయలున్న విమానం టికెట్ ధర రూ.6000 అయింది. రూ.30 గా ఉన్న తులం బంగారం రూ. 60 వేలు అయింది. 500 రూపాయలకు ఎకరం ఉన్న భూమి 5 కోట్లకు ఎకరం అయింది. 50 రూపాయలున్న ఉద్యోగుల జీతం 1.50 లక్షలు అయింది. అంబేద్కర్ ప్రాబ్లం ఆఫ్ రూపీ పుణ్యాన 1947 దాకా ఒక డాలర్‌కు ఒక రూపాయి ఒక పౌండు కొనసాగింది. సాగిలపడుడు మొదలయ్యాక రూపాయి డాలర్, పౌండు సమానంగా ఉన్న ధర ఇప్పుడు 80 రూపాయలకొక డాలర్ అయింది.
ధరలు మాత్రం చావడం లేదు
ఇట్ల రూపాయి ధర రోజు రోజుకూ దిగుతూనే వున్నది. ఇట్ల రోజు రోజుకూ వయసు పెరుగుతున్నట్టే పౌండు ధరలు, డాలర్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇందుకు భిన్నంగా, పేదవారి బతుకులా వయసు పెరుగుతున్న కొద్దీ రూపాయి ధర, పేదవారి వయసులా వయసుడుగిపోయి శక్తి తగ్గిపోతున్నది. వయసు పెరిగి వృక్షాలు మహా వృక్షాలైనై. కొందరు మొలకల తీరు మొదలై మొదలు పెరిగి, కాండాలు పెరిగి, కొమ్మలు శాఖలు పెరిగి ఎవరూ పట్టరానంత పెరిగి పోతున్నారు. వాళ్ల వలెనే, వారి వల్లనే ధరల కాండాల చుట్టు కొలతలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు వయసు పెరిగి పెరిగి మనుషులు చనిపోతున్నారు. ధరలు పెరిగి పెరిగి ఎందుకో చనిపోవడం లేదు. పెరిగిన వారు వయసు పెరిగి చనిపోవడం సహజ క్రమం. కానీ, ఆ వర్గం వారు, ఆ సామాజిక వర్గాల వారు వయసు ఉడిగిపోయి రాలి పోవడం లేదు.
వయసు పెరిగి పెరిగి, ధరలు పెరిగి పెరిగి చనిపోకపోవడం అసహజ క్రమం. అసహజ స్వభావం. పని చేసుకొని బతికే పేదల ఆదాయం పొట్టకూటికే చాలడం లేదు. మరోవైపు ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ పన్నులు, జీఎస్‌టీ పన్నులు కట్టే ట్యాక్సు పేయర్ల ఆదాయం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వాల నుంచి పేద ప్రజల నుంచి, కార్మికుల నుంచి, మధ్య తరగతి ప్రజల నుంచి పరోక్ష పన్నుల నుంచి, లాభాల పేరిట, బ్లాక్ మనీ పేరిట, బ్లాక్ మార్కెట్, ధరల పెరుగుదల పేరిట రోజూ కొంచెం దోపిడీ చేసిన సొమ్ము నుంచి, వసూలు చేస్తున్న పన్నుల నుంచి చెల్లిస్తున్నదే. ఏమంటే ప్రజలిపుడు ఆదాయంలో 50 శాతం పైగా ప్రభుత్వాలకు వ్యాపారులకు, కాంట్రాక్టర్ లకు పారిశ్రామిక వేత్తలకు, బ్లాక్ మార్కెట్ వారికి చెల్లించడం వల్లనే ఆయా వర్గాలు బలిసిపోతున్నాయి. ప్రజలు నలిగి పోతున్నారు.
వారికి అంత ఆదాయం ఎక్కడిది?
రాజరికాలలో పూర్వం పంటలో నాలుగోవంతు, ఆరోవంతు మాత్రమే పన్ను చెల్లించేవారు. రాజులు చెరువులు తవ్వించారు. రోడ్లు వేయించారు. తక్షశిల, నలంద, విక్రమ శిల, శ్రీ పర్వతలాంటి విశ్వ విద్యాలయాలను నడిపించారు. ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పించారు. ఇప్పుడింతింతగా పన్నులు వేసి సగం ఆదాయం గోళ్లూడగొట్టి వసూలు చేస్తూ కూడా 'నీ బతుకు నువ్వు బతుకాలె! ప్రభుత్వం నీకెందుకు సాయం చెయ్యాలె?' అని అంటున్నారు. కొందరు ప్రత్యక్ష టాక్స్ పేయర్స్ 'ఆదాయం మా కష్టార్జితం, మా కష్టార్జితం మా వద్ద ప్రభుత్వం వసూలు చేసి నీకు ఉచిత పథకాలు ఇవ్వాలా?' అని అంటున్నారు. 'నీవు స్వయంగా కష్టపడి బతకాలె సంపాదించుకోవాలె. నీకు దేశం సేవ చేయడం కాదు, నీవే దేశానికి సేవ చేయాలె!' అని కొందరు టాక్స్ పేయర్స్ అంటున్నారు.
టాక్స్ పేయర్స్‌కు అంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల నుంచి వచ్చిందే అని వారు మరిచి పోతున్నారు. టాక్సు పేయర్సు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇవి 60 యేండ్ల క్రితం ఆర్‌ఎస్‌ఎస్(RSS), జనసంఘ్(Jana Sangh) చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక కూడా వీరు తమ ఐడియాలజీని ఇలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. వీరు వ్యాపారులకు కాంట్రాక్టర్లకు పారిశ్రామికవేత్తలకు, బ్యాంకులకు, కంపెనీలకు, ఉత్పత్తిదారులకు, ఎగుమతి, దిగుమతి దారులకు లక్షల కోట్లు ఉచితాలు సబ్సిడీలు, గ్రాంటులు, అప్పులు రౌండర్ మాఫీలు, ప్రభుత్వ సంస్థలను చవకగా అమ్మి అప్పగించడం, బొగ్గు గనులు అప్పగించడం ద్వారా లక్షల కోట్లు కొందరే బిలియనీర్లు కావడాన్ని మాత్రం పాలసీగా కొనసాగిస్తున్నారు.
గుళ్లను కూడా కాంట్రాక్టుకివ్వాలి
50 శాతం దాకా వేసిన పన్నుల ఆదాయమంతా ఏమైపోతున్నది? అనేక దేశాలలో అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉంది. ఇండియాలో అది కూడా లేదు! మండల్ కమిషన్ నివేదికలో కోరినట్టు చట్టసభలలో, విద్య, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో 50 శాతం రిజర్వేషన్ల ద్వారా వారి జనాభాకు ప్రాతినిధ్యం కల్పించడం ఈనాటి అవసరం. బీసీలకు, మహిళలకు అన్ని రంగాలలో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడం అవసరం. పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు(ews reservations) ఎలాంటి సర్వేలు, అధ్యయనాలు లేకుండానే కేటాయించారు. దాంతో బీసీల జనరల్ కోటా పది శాతం తగ్గిపోయింది. క్రీమీలేయర్ పరిమితి యేటా పెంచి 50 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచడం అవసరం. మరో రకమైన ఆదాయాన్ని, ప్రజల నుంచి తిరిగి ప్రజలకు ప్రభుత్వానికి సమకూర్చాల్సిన అవసరం ఉంది. దేవుడికిచ్చే సొమ్మంతా పూజారులకు, యాజమాన్యానికి ఇచ్చినట్టు భావిస్తున్నారు కొందరు. అలా భావిస్తే అది దేవుడిని చూపి వ్యాపారం చేయడం అవుతుంది.
అది ప్రజల సొమ్ము. దేవుళ్లను చూసి దేవుళ్ల మీద భక్తితో ఇచ్చిందే తప్ప. పూజారులకు, యజమానులకు ఇచ్చింది కాదు. చాలా మంది బ్లాక్ మనీని వైట్ మనీగా చెలాయించడానికి కూడా భారీగా ముడుపులు వేసేస్తున్నారు. ప్రజలిస్తున్న ఆ సొమ్ము ఇన్‌కమ్ టాక్సు పరిధిలోకి, జీఎస్‌టీ పరిధిలోకి రావాలి. రోడ్లను కాంట్రాక్టుకిచ్చి టోల్ ట్యాక్సు వసూలు చేస్తున్నట్టుగానే, దేవాదాయ శాఖ(endowment department) కింద లేని గుళ్లను, బొగ్గు గనులిచ్చినట్టు, టోల్ గేట్లు పెట్టినట్లు కాంట్రాక్టు కివ్వాలి. గుళ్ల ఆదాయం ప్రజలిచ్చేదే గనుక 50 శాతం ఆదాయం పన్ను , జీఎస్‌టీ కిందకు తీసుకు రావాలి. గుళ్లను కార్పోరేట్ చట్టాల పరిధిలోకి తేవాలి. పూజారికి సరైన జీతం ఇవ్వడానికి సమగ్ర చట్టం రూపొందించాలి. పెద్ద ఆదాయం ఉన్న గుళ్ల ప్రధాన పూజారులకు ఒకరిద్దరికి ఐఏఎస్ అధికారుల స్థాయి జీత భత్యాలు ఏర్పాటు చేయాలి. నియామకాలకు అర్హతలూ అవసరం.
ఎనిమిదేండ్ల పదవి చాలదా?
కులాల మధ్య వ్యత్యాసాలు తొలగించడానికి, కులాల మధ్య పెళ్లిళ్లు చేసుకునేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలుండాలి. కులాల సమానత్వం కోసం అన్ని కులాలు సమాన గౌరవం పొందడం కోసం కులం మార్చుకునే చట్టం ఆవశ్యకత రోజు రోజుకూ పెరుగుతున్నది. 'కులం మార్చుకున్నవారికి, కుల రిజర్వేషన్లు వర్తించవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి' అనే విధంగా చట్టం తేవడం అవసరం. ఇద్దరు కన్నా మించి కనేవారికి ఎన్నికలలో పోటీ చేసే హక్కు ,ఉద్యోగం చేసే హక్కు లేకుండా సవరణలు చేయడం, ప్రధాని, ముఖ్యమంత్రి వంటి పదవులలో, అమెరికా వలె ఎనిమిదేండ్ల పరిమితి విధించడం అవసరం. తద్వారా ప్రతీ తరం ఎదగడానికి అవకాశం ఉంటుంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా వెనకబడి వున్నారు గనుక, వారు ఎన్నికలలో పోటీ చేయడానికి, ఓడినా, గెలిచినా తిరిగి పాత ఉద్యోగంలో చేరడానికి అవకాశం కల్పించడం అవసరం. అట్లే కోటి రూపాయల ఆదాయం పన్ను కట్టే భారతీయులకు ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఇవ్వకుండా, ఓటు హక్కు పౌరసత్వం కల్పించాలి. ఇలా కాలానుగుణంగా మార్పులు చేసుకోవడం అవసరం.
బీఎస్ రాములు
సామాజిక తత్వవేత్త
83319 66987
Also Read...